Latest Updates
-
జస్ట్ 10 నిమిషాల్లో ఫైవ్ స్టార్ హోటల్ స్టైల్ మష్రూమ్ ఆనియన్ పకోడీ.. ఈ చిన్న ట్రిక్ పాటిస్తే అదిరిపోతుంది! -
లైక్, కామెంట్, షేర్, ట్రోలింగ్.. యువతపై తీవ్ర ప్రభావం.. దీని నుంచి ఎలా బయటపడాలి.? -
పూజ గదిలో దీపం ప్రతిసారీ ఆరిపోతుందా.. మీ ఇంట్లో ఈ కష్టాలు తప్పవు.! -
రోజూ అవే చపాతీలు, రోటీలు తిని బోర్ కొట్టిందా? మట్కా రోటీ ఇలా చేస్తే పిచ్చెక్కించే టేస్ట్! -
స్వీట్, హాట్ తినాలనే కోరికలు విపరీతంగా ఉన్నాయా.. మీ బాడీలో ఈ లోపాలే కారణం.! -
శని దేవుని అభయహస్తం: జూన్ 2027 వరకు ఈ 3 రాశులకు రాజయోగం.. మీరున్నారా ఇందులో? -
కాల్షియం, ఐరన్, ఫైబర్ పుష్కలం..రోజకి ఇది 1 తింటే చాలు కొండలను ఢీకొట్టే శక్తి! -
గ్రహాల అరుదైన కలయిక: ఈ 4 రాశుల వారికి కుబేర యోగం.. మహాలక్ష్మి రాజయోగంతో పట్టిందల్లా బంగారమే! -
బ్రేక్ ఫాస్ట్ కైనా, డిన్నర్ కైనా.. స్టఫ్డ్ పనీర్ కుల్చా చాలా ఈజీగా చేసుకోండిలా..వేళ్లు చప్పరిస్తూ తింటారు! -
మీటింగ్లో కెమెరా ఆన్ చేయాలని మేనేజర్ మొండిపట్టు.. ఉద్యోగిని గెటప్ చూసి మైండ్ బ్లాంక్.!
కుంభమేళ సందర్భంగా ప్రయాగ అహ్మదాబాద్ లో గంగలో స్నానం చేస్తే ఎందుకంత పుణ్యం, బ్రహ్మ దేవుడే వచ్చాడు
అాలాగే రామాయణంలో చిత్రకూట్ ఘట్టం ద్వారా కూడా మనకు అలహాబాద్ ప్రాచుర్యం గురించి తెలుసుకోవొచ్చు. రాముడు శబరిని కలుసుకునే ఘట్టమంది. రాముడు చిత్రకూట్ వెళ్లడానికి ముందు ప్రయాగలోని భరద్వాజ్ ఆశ్రమం వద్ద త
మనదేశంలో ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ చాలా మందికి తెలుసు. దీన్ని ప్రయాగ్ రాజ్ అని కూడా అంటారు. అలహాబాద్ లో జనవరి 14 నుంచి మార్చి 4 వరకు కుంభమేళా కొనసాగుతుంది. దేశంలో హిందువులు అత్యంత పవిత్ర ప్రదేశంగా భావించే ప్రాంతాల్లో అలహాబాద్ కూడా ఒకటి.
అలహాబాద్ ఎందుకంత పవిత్ర ప్రాంతంగా మారింది. హిందువులందరూ ఈ ప్రాంతానికి ఎందుకంత ప్రాముఖ్యం ఇస్తారనే విషయాలను తెలుసుకుందాం.

ప్రయాగ్ రాజ్
అలహాబాద్ ను గతంలో ప్రయాగ్ రాజ్ అనేవారు. ఈ ప్రదేశానికి సంబంధించిన మొదటి ప్రస్తావనపద్మపురాణంలో ఉంటుంది. బ్రహ్మదేవుడు ఇక్కడ స్వయంగా పలు రకాల పూజలు నిర్వహించారని పురణాల్లో ఉంది.

చిత్రకూట్ ఘట్టం
అాలాగే రామాయణంలో చిత్రకూట్ ఘట్టం ద్వారా కూడా మనకు అలహాబాద్ ప్రాచుర్యం గురించి తెలుసుకోవొచ్చు. రాముడు శబరిని కలుసుకునే ఘట్టమంది.

భరద్వాజ్ ఆశ్రమం వద్ద
రాముడు చిత్రకూట్ వెళ్లడానికి ముందు ప్రయాగలోని
భరద్వాజ్ ఆశ్రమం వద్ద తన భక్తురాలు అయిన శబరిని కలిసి ఆమెతో కాసేపు ఉంటారు.

ఎంతో పవిత్రమైన స్థలం
ప్రయాగా ప్రపంచంలోనే ఎంతో పవిత్రమైన స్థలం. ఈ పవిత్ర స్థలం నుంచి చాలా ప్రాంతాలు ఏర్పడ్డాయని హిందూ భక్తులు విశ్వసిస్తారు. ఈ విషయం పద్మ పురాణంలో 7 వ శ్లోకంలో వివరించారు.

ముక్కోటి దేవతలకు నెలవు
ప్రయాగ ముక్కోటి దేవతలకు నెలవుగా భావిస్తారు. ఈ గడ్డ ఎంతో మంది మునులు, రుషులు, మహానుభావులకు నెలవని హిందువులు నమ్ముతారు.

ప్రయాగరాజ్ సంగమం మాఘే మేళా
గంగా, యమున, సరస్వతిలాంటి పుణ్య నదులు కలిసే ప్రదేశమే ప్రయాగరాజ్ సంగమం మాఘే మేళా. దీన్ని సంస్కృతంలో సంగమం అంటారు. నదులు సంగమం జరిగే చోటు హిందువులకు ఎంతో పవిత్రం.

పాపాలన్నీ పోతాయని
అలాంటి సంగమం దగ్గర స్నానాలు చేస్తే పాపాలన్నీ పోతాయని చాలా మంది భక్తుల నమ్మకం. మకర సంక్రాంతి రోజు ఇక్కడ స్నానం చేస్తే ఎంతో పుణ్య ఫలం లభిస్తుందని చాలా మంది విశ్వాసం.

మాఘ్ మేళ
హిందూనెల అయిన మాఘలో మకరసంక్రాంతి రోజు సూర్యుడు మకరంలోకి వెళ్తాడు. ఇక ఆ రోజు ప్రయాగలో ఒక నిర్వహించే వేడుకనే మాఘ్ మేళ అంటారు. ఆ రోజు ఈ సంగమం దగ్గర చాలా మంది పుణ్యస్నానం ఆచరిస్తారు.

కామద్, మోక్షడ్
కామద్, మోక్షడ్ అనే పవిత్ర ప్రదేశాల్లో స్నానాలు ఆచరిస్తే పాపాల నుంచి బయటపడొచ్చని హిందువుల నమ్మకం. భక్తుల ఆ ప్రదేశానికి వెళ్లి కోరికలు కోరుకోగానే నేరవేరితే అలాంటి ప్రదేశాలను కమాద్ అని పిలుస్తారు. ఇది కామానా అనే హిందీ పదం నుంచి వచ్చింది. అంటే కోరిక అని అర్థం.

మోక్షడ్ తీర్థ
ఇక పుణ్యప్రాంతానికి వెళ్లడంతో మోక్షం వస్తే అలాంటి ప్రాంతాన్ని మోక్షడ్ తీర్థ అని అంటారు. మోక్షడ్ అనే పదం మోక్షం అనే పదం నుంచి పుట్టింది. అయితే కామద్, మోక్షడ్ కు నెలవుగా ప్రాంతం ప్రయాగా అంటే అలహాబాద్. అందుకే ఈ ప్రాంతాన్ని హిందువులు ఎంతో పవిత్ర స్థలంగా భావిస్తారు.

ఇబ్బందులన్నీ తొలగి
ప్రయాగను శట్కూల్ క్షేత్రం అని కూడా అంటారు. గంగ, యమున సంగమం ఈ ప్రాంతం. ఇక్కడికి వచ్చి మొక్కుకున్నా లేదంటే పుణ్యస్నానం ఆచరించినా ఇబ్బందులన్నీ తొలగిపోతాయాని భక్తుల నమ్మకం.

ఎలాంటి భేదాలు లేకుండా
ప్రజలంతా ఎలాంటి భేదాలు లేకుండా ఇక్కడికి వచ్చి భగవంతుడి ఆశీర్వాదం పొందుతారు. ఇక్కడ బ్రహ్మ పది అశ్వమేధ యాగాలు చేశారట. అందువల్లే ఈ ప్రాంతానికి పవిత్రత చేకూరిందని అంటారు. అలహాబాద్ విష్ణు ప్రజాపతి క్షేత్రంగా కూడా పేరుగాంచింది. బ్రహ్మనే వచ్చాడు కాబట్టి ఈ ప్రాంతానికి అంత పవిత్రత ఉంది.



Click it and Unblock the Notifications