For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శ్రీ పంచముఖి హనుమంతుడు - భగవాన్ ఆంజనేయుడి ఐదు తలల వెనక కథ

|

పంచముఖ హనుమాన్, ఐదు తలల హనుమంతుడి కథ. శ్రీ పంచముఖి హనుమాన్ ఐదు తలల అర్థం తెలుసుకోండి. పంచముఖి హనుమాన్ ఎలా పుట్టాడో, ఆయన మంత్రం కింద తెలుసుకోండి.

శ్రీ పంచముఖి హనుమాన్, హనుమంతుడి ఐదు తలల అవతారం. హనుమాన్ భగవానుడి విశ్వవిరాట్ రూపమే ఈ పంచముఖి హనుమంతుడు.

పంచముఖి హనుమంతుడికి రెండు రకాల రూపాలున్నాయి. మొదటి రూపంలో అన్ని తలలు హనుమంతుడివే కాగా, రెండవ రూపంలో ఐదుతలలు హయగ్రీవుడు, నరసింహుడు, హనుమంతుడు, వరాహ మరియు గరుడ తలలు కలిగి ఉంటాయి. వీటిల్లో హయగ్రీవ, నరసింహ, వరాహాలు మహావిష్ణువు అవతారాలు. అందుకని పంచముఖి హనుమంతుడిని మహావిష్ణువు మరియు హనుమానుడి కలిపిన అవతారంగా పూజిస్తారు. శ్రీ పంచముఖి హనుమంతుడు, ఆంజనేయుడి తాంత్రిక రూపంగా భావిస్తారు.

 The Story Behind The Five Faces of Lord Hanuman,

Image source : youtube
హనుమంతుడి ఐదు తలల అర్థాలు
హనుమంతుడు ఐదు తలలకి అర్థాలు ఇవిగోః
తూర్పు ముఖ ఆంజనేయుడు మానవులకు ఇష్టసిద్ధికి,
దక్షిణముఖ కరాళ ఉగ్రవీర నరసింహ మానవులకి అభీష్ట సిద్ధిని,
పశ్చిమ ముఖ మహావీర గరుడ సకల సౌభాగ్యాలను,
ఉత్తర ముఖ లక్ష్మీవరహా ధనప్రాప్తిని,
ఊర్థ్వముఖ హయగ్రీవుడు సకల విద్యలలో జయప్రాప్తిని అందిస్తారు.
మరో కథనం ప్రకారం ఐదు ముఖాలు ఐదు రకాల ప్రార్థనలను సూచిస్తాయి –నమనం, స్మరణం,కీర్తనం, యాచనం, అర్పణం.

 The Story Behind The Five Faces of Lord Hanuman,

శ్రీ పంచముఖ హనుమంతుడి జననం

ఈ శ్రీ పంచముఖ హనుమంతుడి ఆవిర్భావం కథ రామాయణంలో ఉంది. రామయణ కథ ప్రకారం, యుద్ధసమయంలో, రావణుడు యుద్ధం గెలవడానికి మహిరావణుడి సాయం తీసుకున్నాడు.మహిరావణుడు పాతాళలోకానికి రాజు. మహిరావణుడు రాముడిని, లక్ష్మణుడిని అపహరించి పాతాళలోకానికి తీసుకెళ్ళాడు. హనుమంతుడు పాతాళలోకానికి వెళ్ళి వారిద్దరిని రక్షించాలనుకుంటాడు.

భగవాన్ ఆంజనేయుడు మహిరావణుడితో భీకర యుద్ధం చేసినా అతన్ని ఓడించలేకపోతాడు. మహిరావణుడిని చంపాలనుకుంటే, ఐదు వివిధ దిక్కులలో ఉన్న ఐదు దీపాలను ఒకేసారి ఆర్పాలని తెలుసుకుంటాడు. మహిరావణుడి జీవితం 3 దీపాలలో నిలిచి ఉన్నది. ఐదు దిక్కులలో ఉన్న ఐదు దీపాలను ఒకేసారి ఆర్పాలంటే, హనుమంతుడు అప్పుడు పంచముఖి హనుమంతుడి అవతారం దాలుస్తాడు- హనుమాన్, హయగ్రీవ, నరసింహ, గరుద మరియు వరాహ ముఖాలతో. శ్రీ పంచముఖి హనుమంతుడి ఐదు దీపాలను ఆర్పివేసి మహిరావణుడిని సంహరిస్తాడు.

 The Story Behind The Five Faces of Lord Hanuman,

తమిళ కంభ రామాయణంలో, హనుమంతుడి ఐదు తలల విశిష్టతను తెలియచేస్తూ ఇలా ఉంది ;

హనుమంతుడు పంచభూతాలలో ఒకటైన గాలి(పవనం)కి కొడుకు.

ఆంజనేయుడు సీతమ్మను వెతకడానికి సముద్రం దాటాడు. సముద్రం కూడా పంచభూతాలలో ఒకటే.

హనుమంతుడు ఆకాశంలో (గాలిలో) ఎగిరాడు,గాలి కూడా పంచభూతాలలో ఒకటే.

హనుమంతుడి ధ్యేయం సీతమ్మను వెతకడం. సీత భూమాతకి పుత్రిక. భూమి కూడా పంచభూతాలలో ఒకటి.

హనుమంతుడు లంకాదహనం చేసాడు. అగ్ని పంచభూతాలలో ఒకటి.

 The Story Behind The Five Faces of Lord Hanuman,

హనుమంతుడ్ని పూజించటానికి ఆయన విగ్రహం చుట్టూ 5సార్లు,14 సార్లు,23 సార్లు, ఐదు గుణకాలలో ప్రదక్షిణం చేయటం మంచిదని చెప్తారు. ఆయన్ని పూజించటానికి ఐదు రకాల ప్రార్థనలు కూడా ఉన్నాయి కదా –నమనం, స్మరణం, కీర్తనం, యాచనం మరియు అర్పణం.

English summary

The Story Behind The Five Faces of Lord Hanuman

Shri Panchmukhi Hanuman is the form of Lord Hanuman with five faces. The Panchmukhi Hanuman is the virata roopa of Lord Hanuman, a gigantic form of Lord Hanuman.
Story first published: Thursday, November 16, 2017, 18:47 [IST]
Desktop Bottom Promotion