For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రామాయణంలో రావణుని భార్య యొక్క ఆశ్చర్యమైన కథ

By Super
|

భారత పురాణంలో అనేక పాత్రల మాదిరిగా, మండోదరి జీవితంలో జరిగిన ప్రధాన సంఘటనలు అనేకం, అనేక కథనాల రూపంలో అందుబాటులో ఉన్నాయి, కానీ అన్ని కథనాలు కూడా మండోదరి యొక్క అందమైన ఆరాధనాభావం గురించి మరియు పాతివ్రత్యం గురించి, న్యాయవతిగా వివరిస్తాయి.

ఆమెను పంచకన్యలలో ఒకరిగా ఆరాధిస్తారు మరియు ఆమెను పూజిస్తే పాపాలు తొలుగుతాయని నమ్ముతారు. ("కీర్తింపబడే ఐదుగురు స్త్రీలు "). ఆమె భర్తకే అంకితమైన ఉత్కృష్టమైన పతివ్రతలలో ఒకరిగా గౌరవింపబడుతున్నది మరియు ముఖ్యంగా ఆమె అనేక దురదృష్టకర తప్పిదాలు మరియు చెడు ధోరణులను అనుసరించే వ్యక్తి, రాక్షసరాజు అయిన రావణాసురుడు భర్త అయినా, ఆమెకు అతనిపట్ల ఉన్న అంకితభావం, భార్యగా, ఒక పతివ్రతామతల్లిగా స్తుతించబడుతున్నది.

1. వివాహం

1. వివాహం

మండోదరి ఒక అందమైన మరియు పవిత్రమైన అమ్మాయిగా పెరుగుతున్నది. మాయాసురుడు చాలా అద్భుతమైన రూపకర్త, శిల్పి మరియు లంకా రాజు అయిన రావణాసురుడు, ఒకరోజు ఒక కొత్త నగరం నిర్మించమని కోరటానికి మాయాసురుడి నివాసానికి వొచ్చాడు. ఈ సందర్శన సందర్భంలో మండోదరిని కలిశాడు మరియు ఆమెతో ప్రేమలో పడ్డాడు. ఆమె తండ్రి నుంచి ఆమె చేతిని అందుకోవటానికి అంగీకారాన్ని కోరాడు మరియు అతను సంతోషముగా అంగీకరించాడు. మండోదరిని వేదమంత్రాల సాక్షిగా రావణుడు వివాహం చేసుకున్నాడు.

2. ఈ విధంగా, శివుడి వరం నిజం అయ్యింది:

2. ఈ విధంగా, శివుడి వరం నిజం అయ్యింది:

రావణాసురుడు ఒక గొప్ప మరియు ధైర్యవంతుడు అయిన రాజు, కానీ శివుడికి మొట్టమొదటి భక్తుడు కూడా. మాయాసురుడు రావణుడికి బహుమతిగా స్వచ్ఛమైన బంగారంతో తయారు చేసిన మిరుమిట్లుగొలిపే ఒక నగరాన్ని నిర్మించి ఇచ్చాడు. మేఘనంద, అతికాయ, మరియు అక్షయ కుమారుడు అనే ముగ్గురు కుమారులు మండోదరి,రావణ దంపతులకు కలిగారు. ఆమె ఆదర్శవంతమైన మరియు అంకితభావంగల భార్యగా, ఒక నిజమైన పతివ్రతగా నిరూపించబడింది.

రావణుని భార్య దైవాంశయైన మండోదరి కథ

రావణుని భార్య దైవాంశయైన మండోదరి కథ

3. రావణాసురుడికి గర్వం మరియు అహంకారం వంటి కొన్ని దుర్గునాలు ఉన్నాయి. సాంప్రదాయ ప్రకారం, అతనికి మందోదరితోపాటు అనేకమంది భార్యలు ఉన్నారు. ఒక సందర్భంలో, అతను ధర్మపరురాలుగా, పతివ్రతగా పేరొందిన పరాయి స్త్రీ అయిన వేదవతి అనే స్త్రీ పట్ల మోహపడ్డాడు. మండోదరికి ఈ అతిక్రమణలన్నీ తెలుసు మరియు వాటిని ఖండిస్తూ అతనికి సలహాలు ఇచ్చేది, కానీ ఎల్లప్పుడూ ఆమె ఒక ఆదర్శవంతమైన భార్యగా, నమ్మకమైనదిగా మరియు విశ్వాసరాలుగా ఉండిపోయింది.

రావణుని భార్య దైవాంశయైన మండోదరి కథ

రావణుని భార్య దైవాంశయైన మండోదరి కథ

4. న్యాయానికి, ధర్మానికి ప్రతీకగా, ఒక మహిళగా, మండోదరి రావణాసురుడిని ధర్మ మార్గంలో పెట్టటానికి ప్రయత్నించింది. ఆమె ఒకరి విధిని, కర్మలను నిర్ణయించే నవగ్రహకూటమిని తక్కువగా అంచనా వేయవొద్దని మరియు సీతగా పునర్జన్మ ఎత్తిన వేదవతిని మోహింపవద్దని మరియు అది రావణుని వినాశనానికి కారణం అవుతుందని అతనికి సూచించింది. రావణాసురుడు ఎప్పుడూ ఆమె సలహా పాటించలేదు, పట్టించుకోలేదు.

రావణుని భార్య దైవాంశయైన మండోదరి కథ

రావణుని భార్య దైవాంశయైన మండోదరి కథ

5. విష్ణువు యొక్క అవతారం, అయోధ్య నిర్వాసిత యువరాజు అయిన రాముని భార్య, సీతను రావణాసురుడు అపహరించాడు. మండోదరి సీతను రాముడికి తిరిగి ఒప్పగించమని రావణాసురుడికి సూచించింది, కానీ ఫలితం లేదు. మండోదరికి తెలుసు ఈ కామం రావణుని పతనానికి తెస్తుందని.

మండోదరి వాల్మీకి రామాయణంలో ఒక అందమైన మహిళగా వర్ణించబడింది. హనుమాన్, కోతి రూపంలో ఉన్న రాముడి దూత, సీత కోసం శోధనచేస్తూ లంకకు వచ్చినప్పుడు, అతను రావణుడి పడకగదిలో మంచంమీద నిద్రిస్తున్న మండోదరి అందం చూసి ఆశ్చర్యపడ్డాడు మరియు మండోదరిని సీతగా తప్పుగా అర్థం చేసుకున్నాడు.

రావణుని భార్య దైవాంశయైన మండోదరి కథ

రావణుని భార్య దైవాంశయైన మండోదరి కథ

6. హనుమాన్ చివరకు సీత ఎక్కడున్నది తెలుసుకుంటాడు మరియు రావణాసురుడు ఆమెను వివాహం చేసుకొనమని, లేకుంటే, సీతను చంపుతానని భయపెడుతున్నది హనుమాన్ చూస్తాడు. రావణాసురుడిని సీత తిరస్కరించింది. అప్పుడు సీత శిరచ్ఛేదంచెయ్యటానికి రావణాసురుడు కత్తి దూస్తాడు. మండోదరి రావణుడి చేతిని పట్టుకొని ఆపి సీతను రక్షించింది. మండోదరి, ఒక మహిళను చంపటం క్రూరాతిక్రూరమైన పాపం అని చెప్పింది మరియు అందువలన రావణాసురుడు సీతను చంపడానికి వెనుకడుగేసాడు. మండోదరి అతనితో తన ఇతర భార్యలతో సంతోషంగా ఉండమని , సీతను అతని భార్యగా చేసుకోవాలనే ఆలోచనను విరమించుకొమని చెప్పింది.

రావణుని భార్య దైవాంశయైన మండోదరి కథ

రావణుని భార్య దైవాంశయైన మండోదరి కథ

7. రావణాసురుడు సీతను చంపాలనే ఆలోచనను విరమించుకున్నాడు కాని, సీతను వివాహం చేసుకోవాలనే అతని కోరికను మాత్రం విరమించుకోలేదు. మండోదరి, తన అందం మరియు వారసత్వం ముందు సీత తక్కువగా ఉన్నప్పతికిని, ఆమెకు రాముదిపట్ల ఉన్న భక్తి, నిబంధనలను గుర్తించింది మరియు సచి మరియు రోహిణి వంటి దేవతలతో ఆమెను పోల్చుకున్నది.

రావణుని భార్య దైవాంశయైన మండోదరి కథ

రావణుని భార్య దైవాంశయైన మండోదరి కథ

8. రాముడికి సీతను శాంతియుతంగా తిరిగి ఒప్పగించాలనే అన్ని ప్రయత్నాలు విఫలం అయ్యాయి. రాముడు రావణుడి లంకపై యుద్ధం ప్రకటించాడు. రాముడితో జరిగే చివరియుద్ధం జరగబోయేముందు రోజు, మండోదరి చివరిగా రావణాసురుడికి తన ఆలోచనను మానుకోమని బోధ చేసింది కాని ప్రయత్నం విఫలమయ్యింది.

రావణుని భార్య దైవాంశయైన మండోదరి కథ

రావణుని భార్య దైవాంశయైన మండోదరి కథ

9. కానీ ఆమె తన కుమారుడు మేఘనాధుడు, అలియాస్ ఇంద్రజిత్ ("స్వర్గం యొక్క దేవుడు-రాజు-ఇంద్రుడిని జయించినవాడు ) యుద్ధాన్ని విరమించుకోమని సూచించింది అయితే తల్లిమాటను వినలేదు. చివరికి మండోదరి, భర్త మాట జవదాటని పతివ్రతాశిరోమణి మరియు నమ్మకమైన వీరసతీమణి, చివరి పోరాటంలో ఆమె భర్తకు అండగా నిలిచింది, రాముడితో పోరాడటానికి కాదు.

రావణుని భార్య దైవాంశయైన మండోదరి కథ

రావణుని భార్య దైవాంశయైన మండోదరి కథ

10. వాల్మీకి రామాయణంలో ఇలా వర్ణిస్తున్నారు: రావణుడి కుమారులు మరియు యోధులందరూ మరణించిన తరువాత, రావణుడు విజయం కొరకు ఒక యజ్ఞం ("అగ్ని త్యాగం") నిర్వహించాడు. రాముడు హనుమాన్ నేతృత్వంలో కోతుల దళాన్నిపంపాడు మరియు కోతుల యువరాజు ,అంగదుడు యజ్ఞం నాశనం చేశాడు. కోతులు రావణుడి రాజభవనంలో బీభత్సం సృష్టించాయి, కానీ రావణుడు యజ్ఞం కొనసాగుతోంది. అంగదుడు రావణుని ముందు మండోదరి జుట్టు పట్టుకుని లాక్కువెళ్లాడు. మండోదరి భర్తను రక్షించమని అభ్యర్తించింది.

రావణుని భార్య దైవాంశయైన మండోదరి కథ

రావణుని భార్య దైవాంశయైన మండోదరి కథ

11. రాముడు తన భార్య కోసం ఏమి చేస్తున్నాడో అతనికి జ్ఞాపకం చేసింది. ఆగ్రహించిన రావణుడు యజ్ఞం విడిచిపెడతాడు మరియు తన కత్తితో అంగదుడిని ఎదిరిస్తాడు. యజ్ఞం పాదవటంతో,అంగదుడి ఉద్దేశ్యం నెరవేరింది మరియు అతను మండోదరిని విడిచి, అక్కడినుండి తప్పించుకుని వెళ్లిపోతాడు. మండోదరి మళ్ళీ రాముడికి సీతను అప్పగించమని రావణుడికి హితబోధ చేసింది కానీ అతను తిరస్కరించాడు.

రావణుని భార్య దైవాంశయైన మండోదరి కథ

రావణుని భార్య దైవాంశయైన మండోదరి కథ

12. అద్భుత రామాయణంలో వర్ణిస్తున్నారు: రావణాసురుడు, తను వధించిన ఋషుల యొక్క రక్తాన్ని నిల్వ చేయడానికి ఒక పెద్ద కుండ ఉపయోగించేవాడు. గ్రిత్సామద ఋషి, దేవత లక్ష్మీని తన కుమార్తెగా సాధించటం కొరకు తపస్సు చేశాడు. అతను దర్భ గడ్డి నుండి పాలు నిల్వచేసి మరియు ఒక కుండలో మంత్రాలతో దానిని పరిశుభ్రం చేశాడు, అందువలన లక్ష్మి నివసిస్తుందని. రావణుడు రక్తం నిల్వ ఉంచిన కుండలోకి ఈ కుండలో నిల్వ ఉన్న పాలను పోశాడు.

రావణుని భార్య దైవాంశయైన మండోదరి కథ

రావణుని భార్య దైవాంశయైన మండోదరి కథ

13. మండోదరి రావణుని దుష్కార్యాలు చూసి విసుగుచెంది, ఆమె విషం కంటే ఎక్కువ విషపూరితం అని చెప్పబడిన రక్తపు కుండలోని ద్రవాన్ని తాగి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది. చనిపోవటానికి బదులుగా మండోదరి గ్రిత్సామద ఋషి పాల ప్రభావంగా లక్ష్మి అవతారం ఆమెను గర్భవతిగా మారింది. మండోదరి కురుక్షేత్ర ప్రదేశంలో పిండాన్ని కప్పివేస్తుంది, ఆమెనే జనకుడు కనుగొని సీత అని నామకరణం చేసి పెంచుకున్నాడు.

రావణుని భార్య దైవాంశయైన మండోదరి కథ

రావణుని భార్య దైవాంశయైన మండోదరి కథ

14. దేవి భాగవత పురాణములో ఇలా చెప్పబడింది: రావణాసురుడు మండోదరిని వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు, మయుడు ఆమె జాతకప్రకారం ఆమె మొదటి పిండం నాశనం కావింపబడాలని మరియు తప్పనిసరిగా వధించాలని అతన్ని హెచ్చరిస్తాడు. మయుడి హెచ్చరికను విస్మరించి, రావణుడు మొదటి సంతానాన్ని ఒక పేటికలో ఉంచి జనకనగరంలో పాతిపెట్టాడు.

రావణుని భార్య దైవాంశయైన మండోదరి కథ

రావణుని భార్య దైవాంశయైన మండోదరి కథ

15. ఆమెనే జనకుడు కనుగొన్నాడు మరియు సీత అని నామకరణం చేసి పెంచాడు. జైన్ వాసుదేవహింది, ఉత్తర-పురాణము, ఇంకా అనేకమైన రామాయణం యొక్క అన్వయాలలో కూడా సీత, రావణ మరియు మండోదరి కుమార్తె అని మరియు ఆమె, రావణాసురుడి మరియు అతని కుటుంబం యొక్క ముగింపుకు కారణమని చెపుతున్నారు.

English summary

The Story Of Mandodari

As with many characters in Indian legend, several versions of the main events of Mandodari's life are available, but all versions describe Mandodari as beautiful, pious, and extremely righteous.
Desktop Bottom Promotion