For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రావణాసురుడి కుమారుడు ఇంద్రజిత్తు లక్ష్మణుడికి అల్లుడే కానీ చంపేస్తాడు, ఇంద్రున్ని ఓడించిన మేఘనాథుడు

ఇంద్రజిత్తు రణరంగంలోకి అడుగుపెడతాడు. ఇంద్రజిత్తు మొదట లక్ష్మణుడిని లక్ష్యంగా చేసుకుని యుద్ధం మొదలుపెడతాడు. ఇంద్రజిత్తు ఆటలు సాగవు. తర్వాత ఇంద్రజిత్తు నాగాస్త్రం వేస్తాడు. రాముడు, లక్ష్మణుడు.

|

ఇంద్రజిత్తు.. ఈయన రావణుడి పెద్ద కుమారుడు. వాస్తవానికి ఇంద్రజిత్తు పేరు మేఘ నాథుడు. మేఘాల్లో మాయలు చేస్తూ యుద్ధం చేయడం ఇతని ప్రత్యేకత. అయితే ఈయన ఇంద్ర జిత్తు అని పేరు రావడానికి ఒక కథ ఉంది. మేఘ నాథుడు ఎంతో శక్తిగలవాడు. ఇతను తన తండ్రి రావణాసురుడితో కలిసి ఇంద్రునితో యుద్ధం చేస్తాడు. అయితే రావణాసురుడిని ఇంద్రుడు చిత్తుచిత్తుగా ఓడిస్తాడు.

ఇంద్రున్ని ఓడించి బంధిస్తాడు

ఇంద్రున్ని ఓడించి బంధిస్తాడు

దీంతో మేఘనాథుడికి కోపం వస్తుంది. మా నాన్ననే బంధిస్తావా అని కోపానికి గురై అవుతాడు. తర్వాత మేఘ నాథుడు మాయ చేసి ఇంద్రునితో యుద్ధానికి పూనుకున్నాడు. తర్వాత ఇంద్రున్ని ఓడించి బంధిస్తాడు. తన తండ్రి రాక్షస సామ్రజ్యానికి ఇంద్రున్ని లాక్కొని వెళ్తుంటాడు. అయితే బ్రహ్మ వేడుకోవడంతో ఇంద్రున్ని వదిలిపెడతాడు మేఘ నాథుడు. అలా మేఘ నాథుడు ఇంద్రున్ని ఓడించడంతో ఇంద్ర జిత్తుగా మారాడు.

ఇంద్రజిత్తు నాగాస్త్రం వేస్తాడు

ఇంద్రజిత్తు నాగాస్త్రం వేస్తాడు

వెంటనే ఇంద్రజిత్తు రణరంగంలోకి అడుగుపెడతాడు. ఇంద్రజిత్తు మొదట లక్ష్మణుడిని లక్ష్యంగా చేసుకుని యుద్ధం మొదలుపెడతాడు. ఇంద్రజిత్తు ఆటలు సాగవు. తర్వాత ఇంద్రజిత్తు నాగాస్త్రం వేస్తాడు. దీంతో రాముడు, లక్ష్మణుడు స్పృహ కోల్పోతారు. అయితే హనుమంతుడు మూలికల ద్వారా బతికించేస్తాడు. తర్వాత శ్రీరాముడు, లక్ష్మణుడు ఇంద్రజిత్తును చిత్తుచిత్తు చేస్తుంటారు.

మాయ సీత ను సృష్టించి

మాయ సీత ను సృష్టించి

దీంతో ఇంద్రజిత్తు ఏం చెయ్యాలో అర్థంకాలేదు. తన మాయలను ప్రదర్శించాలనుకుంటాడు. అక్కడికక్కడే మాయ సీత ను సృష్టించి శ్రీరాముణ్ని బెదిరిస్తాడు. ఆ మాయ సీతను శ్రీరాముడి కళ్లెదుటే చంపేస్తాడు. రాముడు దుఖసాగరంలో మునిగిపోతాడు. అయితే శ్రీరాముడికి, లక్ష్మణుడికి అసలు విషయం తెలిసి వారు మళ్లీ యుద్ధానికి సిద్ధం అవుతారు.

యాగం చేయాలని వెళ్తాడు

యాగం చేయాలని వెళ్తాడు

శ్రీరాముడికి, లక్ష్మణుల నుంచి తప్పించుకోవాలంటే తాను మరిన్ని శక్తులు పొందాలని ఇంద్రుజిత్తు భావిస్తాడు. అందుకే యాగం చేయాలని వెళ్తాడు. ఆ యాగం పూర్తి అయితే అతను మరింత శక్తివంతుడు అవుతాడు. ఈ విషయం విభీషనుడు శ్రీరాముడికి చెబుతాడు. యజ్ఞాన్ని భంగం చేయాలని తలుస్తాడు లక్ష్మణుడు. చివరకు యాగాన్ని భంగం చేస్తారు.

శేషనాగుడిపై కుమార్తెను చేసుకుంటాడు

శేషనాగుడిపై కుమార్తెను చేసుకుంటాడు

అయితే ఇంద్రజిత్తుకు ఒక శాపం ఉంటుంది. గతంలో ఒక మునీశ్వరుడిని ఇంద్రజిత్తు బాధిస్తాడు. దీంతో ఆయన శపిస్తాడు. నీకు పాములకు ప్రభువైన వ్యక్తి వల్ల మరణం ఉంటుందిని చెబుతాడు. అయితే ఇంద్రజిత్తు ఇందుకు పరిష్కారం ఏమిటని ఆలోచించి సర్ప లోకానికి రాజు అయిన శేషనాగుడిపై విజయం సాధించి ఆయన కుమార్తెను పెళ్లి చేసుకుంటాడు.

వరుసకు అల్లుడే అయినా...

వరుసకు అల్లుడే అయినా...

ఇక లక్ష్మణుడు ఆదిశేషుడికి సంబంధించిన వ్యక్తే కాబట్టే తనని చంపడని భావిస్తాడు ఇంద్రజిత్తు. అలా మేఘనాథుడు లక్ష్మణుడికి వరుసకు అల్లుడే అయిన చివరకు లక్ష్మణుడి చేతిలోనే మేఘనాథుడు ప్రాణాలు కోల్పొతాడు. అయితే శ్రీరాముడు ఆదేశించడంతో మేఘనాథున్ని వధించడానికి బయల్దేరుతాడు లక్ష్మణుడు.

ఐంద్రాస్త్రాన్ని వేస్తాడు

ఐంద్రాస్త్రాన్ని వేస్తాడు

మళ్లీ లక్ష్మణుడు ఇంద్రజిత్తుతో పోరాడుతాడు. ఇంద్రజిత్తు పైకి ఐంద్రాస్త్రాన్ని లక్ష్మణుడు ప్రయోగిస్తాడు. దాంతో ఇంద్రజిత్తు తల తెగిపడిపోతుంది. మొడెం మరో వైపుకు పడిపోతుంది. ఇంద్రజిత్తు భారీ కాయం భూమిపై పడడంతో ఆ ప్రాంతం అంతా కంపించిపోతుంది. అలా లక్ష్మణుడు ఇంద్రజిత్తును చివరకు చిత్తుచిత్తుగా చంపేస్తాడు.

Image Credit(all pics)

English summary

the story of indrajit or meghnad the mightiest warrior in ramayana

the story of indrajit or meghnad the mightiest warrior in ramayana
Desktop Bottom Promotion