For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హిందుమతంలో పవిత్రమైన నంది గురించి ప్రత్యేక కథనం

|

పవిత్ర త్రిమూర్తులలో ఒకరైన శివుని దేవాలయాలలో నంది దేవుని విగ్రహం లేకుండా కనపడడం అరుదుగా ఉంటుంది. ఈ దేవాలయాలలో కనిపించే, ఎద్దు విగ్రహాన్ని నంది అని పిలుస్తారు. అనగా శివుని వాహనం ఎద్దు నామం నంది. సాధారణంగా ఈ విగ్రహం, శివునికి ఎదురుగా కొంత దూరంలో కాళ్లను ముడుచుకుని కూర్చొని ఉన్న భంగిమలో కనిపిస్తుంది. ఎక్కువగా గర్భగుడికి బయటగా ఉండునట్లు ప్రతిష్టించడం జరుగుతుంది. క్రమంగా ఈ నంది చెవుల నుండి పరమేశ్వరుని విగ్రహాన్ని చూడడాన్ని అత్యంత పవిత్రమైన విషయంగా భక్తులు భావిస్తుంటారు. ఉదాహరణకు శ్రీశైలంలో నంది దర్శనానికి ఉన్న ప్రాముఖ్యత గురించి తెలియని వారు ఉండరు. ఇక్కడ నంది నుండి, ఆలయ గోపురాన్ని వీక్షించిన వారికి పునర్జన్మ ఉండకుండా, కైలాసంలో స్థానం లభిస్తుందని నమ్మకం.

ఎద్దులు విశ్వాసానికి చిహ్నాలుగా భావించడం జరుగుతుంటుంది. ఒక ఎద్దు తెలివిగా, నిజాయితీగా ఉండడమే కాకుండా కష్టపడి పనిచేస్తూ, యజమానికి ఆదరువుగా ఉంటుంది. మరియు శాంతముగా కూడా ఉంటుంది. కానీ ఎద్దు కోపంతో ఉన్నప్పుడు సింహంతో కూడా పోరాడగలదని చెప్తుంటారు. ఎద్దులోని ఈ లక్షణాలను పరిగణనలోనికి తీసుకోవడం ద్వారా, బహుశా నందిని తన వాహనంగా చేసుకుని ఉండవచ్చు అని కూడా చెప్పబడుతుంది.

నంది కారణంగా, మన దేశంలోని ఎద్దులను అత్యంత పవిత్రమైనవిగా భావించడం జరుగుతుంది. మరియు ఇవి నేరుగా పరమేశ్వరునితో సంబంధాన్ని కలిగి ఉన్నట్లుగా చెప్పబడుతుంది. కానీ ఇదంతా ఎంతవరకు నిజం ?

The Story Of The Sacred Bull Nandi

ఇక్కడ నంది పుట్టుక వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది., క్రమంగా ఎద్దులు ఎందుకు అంత పవిత్రతను సంతరించుకున్నాయి ? మరియు నంది దేవుడు పరమేశ్వరునికి వాహనంగా ఎలా మారాడు ? వంటి విషయాలను తెలుసుకోడానికి వ్యాసంలో ముందుకు సాగండి.

శివుడి ఆశీర్వాదం కారణంగానే నంది జన్మించింది :

శివుడి ఆశీర్వాదం కారణంగానే నంది జన్మించింది :

వాయుపురాణంలో చెప్పిన కథ ఆధారితంగా, రిషి కశ్యపునికి పిల్లలు లేరు. క్రమంగా అతను, అతని భార్య సురభి మిక్కిలి కుమిలిపోయేవారు. ఎలాగైనా వంశాన్ని నిలబెట్టాలన్న ఆకాంక్ష వీరిలో బలంగా ఉండేది. నిరంతరం శివుని ఆరాధిస్తున్న కారణంగా, కొద్ది కాలానికి రిషి కశ్యపుడు, సురభి జంట ఒక మగ బిడ్డ చేత ఆశీర్వదించబడ్డారు. పుట్టింది మగపిల్లవాడు కావడంతో ఆ ఇంట్లో సుఖసంతోషాలు నెలకొన్నాయి. క్రమంగా ఆ బాలునికి నంది అని పేరు పెట్టారు. అనగా ఆనందంగా, సంతోషంగా ఉండునట్లు అర్ధం. .

వరుణ దేవుడు, నంది మరియు శిలాద ముని కథనం :

వరుణ దేవుడు, నంది మరియు శిలాద ముని కథనం :

అయితే, కొన్ని ఇతర గ్రంథాల ప్రకారం, శిలాద ముని మరణంలేని పుత్రుడు కావాలని ఇంద్రుని కోరుకోవడం జరిగింది. క్రమంగా ఇంద్రుడు, దీనికి శివుని ఆశీస్సులు అవసరమని సూచించాడు. ఇంద్రుని సూచనల మేరకు శివారాధన ఆచరించిన ఫలితంగా, శిలాద ముని ఒక మైదానంలో ఒక శిశువును కనుగొని, అతనిని దత్తత తీసుకున్నాడు.

కొన్ని సంవత్సరాల తరువాత, వరుణ దేవుడు మరియు మిత్ర దేవుడు శిలాద ముని ఆరాధనకు మెచ్చి, అతనికి దీర్ఘకాల జీవితాన్ని అనుగ్రహించారు. కానీ తన కుమారుడు నంది మాత్రం 8 సంవత్సరాల వయస్సులో మరణిస్తాడని చెప్పారు. అప్పుడు నంది వయస్సు 7 సంవత్సరాలు.

నంది పరమేశ్వరుని ఆరాధించేవాడు :

నంది పరమేశ్వరుని ఆరాధించేవాడు :

నంది ఈ విషయం తెలుసుకొని, తన తండ్రిని దుఃఖంలో చూడలేక, శివుని శాంతపరచే క్రమంలో భాగంగా తపస్సు ప్రారంభించాడు. క్రమంగా పరమేశ్వరుడు తన ప్రార్థనలను ఆలకించి, ప్రత్యక్షమయి, మెడలో కట్టుకునేందుకు వీలుగా, గంటలతో కూడిన బహుమతిని ఇచ్చాడు. అంతేకాకుండా, ముందస్తు మరణం శాపాన్ని తొలగించాడు. మరియు శివుడు ఇక నుండి నీవు సగం మనిషి, సగం ఎద్దు వలె ఉంటావని చెప్పాడు. ఆ వరం కారణంగా నంది తల ఎద్దురూపంతోనూ, మొండెం మనిషి రూపంలోనూ ఉంటుందని చెప్పబడుతుంది. క్రమంగా నంది మరియు శిలాదుడు శివుని నివాసానికి చేరుకొని ప్రార్ధించగా, నందిని తన వాహనంగా మరియు తన గణాలకు అధిపతిగా నియమించాడు పరమ శివుడు. మరియు స్నేహితునిగా ఆశీర్వదించాడు.

నంది పరమేశ్వరుని ప్రధాన భక్తులలో ఒకరిగా …

నంది పరమేశ్వరుని ప్రధాన భక్తులలో ఒకరిగా …

క్రమంగా ఈ రోజు శివుని దేవాలయాలలో, నందిని కూడా ఒక దైవంగా భావించి పూజలను అందివ్వడం జరుగుతుంది. కర్నూలు వద్ద ఉన్న మహానందీశ్వర ఆలయం కేవలం నంది దేవునికి అంకితం చేసిన ఆలయాలలో ప్రధానాలయంగా ఉంది. ఇక్కడ అతి పెద్ద నంది విగ్రహం ఉంది.

అంతేకాకుండా యాగంటిలో ఉండే నంది విగ్రహం తరచుగా పెరుగుతుంటుందని ఒక నమ్మకం కూడా ఉంది. పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు రచించిన కాలజ్ఞానంలో, యాగంటి బసవన్న (నంది) రంకె వేసినప్పుడు, లోకం అంతరిస్తుందని ఉన్నట్లుగా చెప్పబడుతుంది.

నంది యొక్క శక్తులు మరియు లక్షణాలు :

నంది యొక్క శక్తులు మరియు లక్షణాలు :

నంది న్యాయం, విశ్వాసం, గౌరవం, వివేకం మరియు ధైర్యానికి మారుపేరుగా ఉంటుంది. మరియు ఈ లక్షణాలతో ఉన్న ఎవరైనా శివునికి ప్రియమైన వారుగా ఉంటారని చెప్పబడింది. శివుడు తన్మయత్వములో ఉన్నప్పుడు నంది సంగీతాన్ని ఆలపిస్తాడని చెప్పబడింది. శివుని సైన్యానికి అధిపతిగా ఉంటూ, రాక్షస ఏనుగు అయిన ఐరావతాన్ని సైతం సహరించాడని చెప్పబడింది. నంది ధర్మానికి న్యాయానికి రక్షగా ఉంటాడని చెప్పబడింది.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆద్యాత్మిక, జ్యోతిష్య, సౌందర్య, ఆరోగ్య, జీవనశైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, మాతృత్వ, శిశు సంబంధ, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

The Story Of The Sacred Bull Nandi

The sacred bull Nandi is the vehicle and gatekeeper of Hindu deity Lord Shiva, the creator, which is why it is enshrined in the form of statue at Hindu Shiv temples. Read the complete story here.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more