For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శూర్పణక కనిపించిన వారందరితో కామ కోరికలను తీర్చుకునేదా? లోకకళ్యాణం కోసమే రాముడిపై మోజు పడిందా?

|

రామాయణంలోని చాలా పాత్రల గురించి మనం విని ఉంటాం. కానీ శూర్పణక గురించి చాలా మందికి అంతగా తెలీదు. శూర్పణక పాత్రకు కాస్త ప్రియార్టీ ఒక సినిమా రూపొందిస్తున్నారు దర్శకుడు భార్గవ్.

శూర్పణక గురించిపలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులకు తెలియజేయాలని దర్శకుడు భావిస్తున్నారట.

ఇక కాజల్‌ రావణాసురుడి సోదరి శూర్పణక పాత్రలో నటించనున్నారు. ఇక సినిమా గురించి పక్కన పెడితే వాస్తవంగా శూర్పణఖ ఎవరు? రామాయణంలో ఆమె పాత్ర ఏమిటి? శూర్పణఖ రాముడితో అలా ప్రవర్తించడానికి కారణాలులాంటివి చాలా ఆసక్తికరంగా ఉంటాయి. శూర్పణఖ రామాయణాన్ని మలుపు తిప్పిన వ్యక్తి.

రామాయణ కథాగమనానికి అంకురార్పణ

రామాయణ కథాగమనానికి అంకురార్పణ

శూర్పణఖ వృత్తాంతం రానున్న రామాయణ కథాగమనానికి అంకురార్పణ లాంటిది. దండక రావణుని రాజ్యంలోది అని చెప్పే కథ ఉత్తరకాండలో వుంది. ఆ కథ ప్రకారం రావణుడు ఖరుణ్ణి దండకలో తన ప్రతినిధిగా నియమించాడు. శూర్పణఖను దండకలో యథేచ్చగా తిరగమన్నాడు. ఇది మామూలు కథ. అంతేగాని ఆనాటికి రాజ్యాలు అంత స్థిరంగా వున్నట్లు కనిపించదు. అయితే దండకలో వున్న తెగల్లో ఖరుడు బలవంతుడు కావచ్చు. అంతేకాని అతనికి దండక మీద ఆధిపత్యం ఉన్నట్లు కనిపించదు.

కనిపించినవారితో కామం తీర్చుకోవడం

కనిపించినవారితో కామం తీర్చుకోవడం

శూర్పణఖ స్వేచ్ఛగలది. ఆమే కాదు... ఆ తెగవారంతా అంతేనేమో! ఆమెకు పెళ్ళిలాంటిదేమి జరిగినట్లు కొన్ని గ్రంథాల్లో లేదు. కొన్నింటిలో మాత్రం ఆమెకు పెళ్లయి, గర్భిణీగా మారినట్లు కూడా ఉంది. ఇక శూర్పుణఖ కనిపించినవారితో కామం తీర్చుకోవడం వాళ్ళ ఆచారం కావచ్చు. "నువ్వు నా కోరిక తీర్చు అని ఎవరినైనా అడగ్గలదామె. "నువ్వంటే నాకు మనసయింది, నాతో రమిస్తావా?" అనడం భారత కాలంలోనూ వుంది.

కోరిక తీర్చమన్నందుకు కాదు

కోరిక తీర్చమన్నందుకు కాదు

శూర్పణఖ రామున్ని చూసింది. మురిసింది. తన కోరిక తీర్చమంది. రాముడు తనకు ఇదివరకే భార్య వుందన్నాడు. నిరాటంకంగా వుండడానికి సీతను తింటానంది. సీతను తింటానన్నందుకు ముక్కూ, చెవులు కోయించాడు రాముడు. అంతేకాని తన కోరిక తీర్చమన్నందుకు కాదు. ఇది యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన. శూర్పణఖ రావడం "యదృచ్ఛయా" అంటాడు వాల్మీకి. ఆమె ప్లాను వేసుకుని రాలేదు. అలా చాలామంది దగ్గరికి వెళ్లి వుంటుంది. అది ఆమెకు మామూలే. కాని ఇక్కడే కథ అడ్డం తిరిగింది. ఆమెకు ఆశ్చర్యం కలిగించే దృశ్యం ఎదురయింది. రామునికి భార్య వుంది.

శూర్పణఖ ముక్కూ చెవులూ కోయించాడు

శూర్పణఖ ముక్కూ చెవులూ కోయించాడు

ఒక మగాడికి ఒక ఆడది. ఒక భార్యకు ఒక భర్త. ఇది ఆమెకు తెలియని విషయం, అంతుపట్టని విషయం. ఆమెకు తెలిసింది తన కోరిక తీర్చుకోడం, అంతవరకు ఎవరూ ఆమెను నిరాకరించి వుండరు. రాముడు నిరాకరించాడు. ఆమె అహం దెబ్బతింది. రాముని నిరాకరణకు కారణం అయింది సీత. ఆమెను హతమార్చడానికి ఉరికింది.అంతే రాముడు శూర్పణఖ ముక్కూ చెవులూ కోయించాడు.

మామూలు కుటుంబ గాథ

మామూలు కుటుంబ గాథ

శూర్పణఖకు ఇదొక అసాధారణ సంఘటన. తాను రాముణ్ణి వలస్తే అవమానిస్తాడా? పగ తీర్చుకుంటానని అన్న దగ్గరికి ఉరికింది. చెల్లెలికి అవమానం జరిగిందని యుద్ధానికి ఉరికాడు ఖరుడు. ఇదంతా మామూలు కుటుంబ గాథ. ఇందులో రాజకీయాలకూ తావులేదు. ఏ అన్న అయినా తన చెల్లెలికి అవమానం జరిగితే ఊరుకుంటాడా? ఏ భర్త అయినా తన భార్యను చంపుతానంటే ఊరుకుంటాడా? సరిగ్గా అలాంటి కథే ఇది.ఇది చాల చిన్న విషయం. ఎక్కడో తేలిపోవచ్చు. కాని ఈ సంఘటనను మూలంగా తీసుకొని మిగతా రామాయణ కథనంతా అల్లాడు వాల్మీకి. ఇది రామాయణానికి మరో మలుపు.

కోరికలను అదుపులో ఉంచుకోవడం కష్టతరమే

కోరికలను అదుపులో ఉంచుకోవడం కష్టతరమే

రామాయణంలో శూర్పణఖకు ప్రత్యేక స్థానం ఉంది. రాక్షసజాతి, భయంకర రూపం, నిలువెల్లా నిండిన పొగరు ఆమె రూపాన్నీ, వ్యక్తిత్వాన్నీ మన మనసుల్లో స్థిరం చేశాయి. కానీ ఆమె చర్యలో కనిపించే క్షణికావేశం ఖరీదు శూర్పణఖే చెల్లించినా, దాని ఫలితం మంచికి రూపమై నిలిచింది. మనిషైనా, రాక్షసైనా మనసులో కలిగే కోరికలను అదుపులో ఉంచుకోవడం కష్టతరమే. కానీ దాని మూలంగా తన జీవితాన్నే జీవచ్ఛవంగా మార్చుకున్న కన్నీటి ఉదంతం శూర్పణఖది.

శూర్పణఖ రాముణ్ని చూసి ఇష్టపడింది

శూర్పణఖ రాముణ్ని చూసి ఇష్టపడింది

గోదావరీ నదీ ప్రాంతంలో సీతారామ లక్ష్మణులు తీరిగ్గా మాట్లాడుకుంటున్న సందర్భంలో శూర్పణఖ రాముణ్ని చూసి ఇష్టపడింది. అంతే, అందమైన రూపంతో వారి ముందుకు వచ్చి రామునిపై ఇష్టాన్ని ప్రకటించింది. నీవెవరనీ, నీతో ఉన్నవారి పరిచయమేంటని నిర్భయంగా ప్రశ్నించింది. రాముడు తన గురించి చెప్పి సీత తన భార్యనీ, లక్ష్మణుడు తన తమ్ముడనీ, వారు అడవికి వచ్చిన కారణంతో సహా వివరించి, నువ్వెవరనీ ప్రశ్నిస్తాడు.

రావణుడి సోదరినీ..

రావణుడి సోదరినీ..

రాముని సూటిదనం నచ్చిన శూర్పణఖ మరింత సంతోషంతో విశ్వావసుడి కూతురుననీ, రావణుడి సోదరిననీ, కుంభకర్ణుడూ, విభీషణుడూ తన తోబుట్టువులనీ గర్వంగా చెబుతుంది. ఈ దండకారణ్యమంతా నాదేననీ, రాజ్యం, రాజకీయం తనకు పడవనీ, అందుకే ప్రకృతి నీడలో యథేచ్చగా విహరించే రారాణిని నేననీ తన పరిచయాన్ని గొప్పగా ప్రకటిస్తుంది.

సీతనూ, లక్ష్మణుడినీ తినేస్తా

సీతనూ, లక్ష్మణుడినీ తినేస్తా

శూర్పణఖ రాముడితో తనను పెళ్లి చేసుకోమనీ, లేదంటే నన్ను కాదనడానికి కారణమైన సీతనూ, లక్ష్మణుడినీ తినేస్తాననీ అంటుంది. నవ్విన రాముడు నాకు పెళ్లైపోయిందీ.. ఇదుగో నా భార్య సీత. అదుగో లక్ష్మణుడిని అడిగి చూడమని అంటాడు. వారి హాస్యానికి కోపంతో రగిలిపోయిన శూర్పణఖ తన రాక్షసత్వాన్ని ప్రదర్శించేంతలోనే, లక్ష్మణుడు కత్తితో శూర్పణఖ చెవులూ, ముక్కూ కోసేశాడు. అంతే దండకారణ్యం తన రోదనకు అదిరిపడింది.

ఖరుడూ నేలకొరిగాడు

ఖరుడూ నేలకొరిగాడు

దండకారణ్య ప్రాంతం తన జనస్థానం, దాన్ని తన మరో సోదరుడైన ఖరుడు పాలిస్తున్నాడు. తన బాధను, వేదననూ చెప్పుకోవడానికి ఖరున్ని చేరింది శూర్పణఖ. జరిగిందంతా వివరించి వారి వినాశనం జరగాలని శాసించింది. దాని ఖరీదు ఖరునితో ఘోర యుద్ధం, పధ్నాలుగు వేల రాక్షససేన హతమయ్యారు. ఖరుడూ నేలకొరిగాడు. ఇదంతా చూసి తట్టుకోలేని పరిస్థితుల్లో లంకను చేరింది శూర్పణఖ.

సీతను లంకకు తీసుకురావడమే తరుణోపాయం

సీతను లంకకు తీసుకురావడమే తరుణోపాయం

రాక్షస జనస్థానం రాముని వల్ల నాశనమై పోయిందనీ, లక్ష్మణుడి వల్ల తాను విరూపగా మారిపోయాననీ, రాముని భార్య అయిన సీతను నీ పట్టపురాణిని చేద్దామనుకునే యత్నంలో ఇదంతా జరిగిందనీ, రామున్ని పరాభవించడం శక్తితో అసంభవమనీ, యుక్తితో సాధించాలనీ, అందుకు సీతను లంకకు తీసుకురావడమే తరుణోపాయమనీ ఆలోచించి నిర్ణయం తీసుకోమని పదేపదే చెబుతుంది. ఒక రకంగా రావణున్ని ప్రలోభపెట్టి సీతను అపహరించేందుకు సన్నద్ధం చేసింది. శూర్పణఖ అనుకున్నట్లే జరిగింది. లోకకళ్యాణం తథ్యమని మనసులో నిశ్చయించుకొని లంకనుండి అరణ్యానికి కదిలింది. తన కురూపితనానికి ప్రకృతిలోని అందం ఔషధమైంది. తన కోపానికీ, కసికీ, ఆవేశానికీ ప్రకృతే సమాధానమైంది.

ప్రకృతి ఒడిలోకి చేరింది

ప్రకృతి ఒడిలోకి చేరింది

చిన్నతనం నుంచే అరణ్యవాసంలోనే పెరిగిన శూర్పణఖకు బంగారు లంక రుచించలేదు. అందుకే తన బాధను పంచుకునే ప్రకృతి ఒడిలోకి చేరింది. తన అందవిహీనమైన రూపాన్ని జీర్ణించుకోవడానికి, తనలో జరిగిన సంఘర్షణకూ అనంత ప్రకృతే ఆలవాలమైంది. అరణ్య విహారంలో కలిగే హాయి అందమైన లంకలో లేదనుకుంది. అందుకే ప్రకృతికే అంకితమై జీవితాన్ని భరించింది.

సీతాపహరణం జరగకపోతే

సీతాపహరణం జరగకపోతే

సీతాపహరణం జరగకపోతే రామ రావణ యుద్ధం జరిగేదే కాదు. రావణ సంహారం జరుగక పోయుంటే శాంతికి స్థానమే ఉండేది కాదు. అందుకని ఆ మహత్కార్యానికి తాను హేతువుగా మారింది. తన రూపాన్నే బలిచ్చింది. ప్రాణత్యాగాన్ని మించిన గొప్పతనం శూర్పణఖ జీవితంలో ధ్వనిస్తుంది. లక్ష్మణుడు శూర్పణఖను ఆనాడే చంపేస్తే కథ వేరేలా ఉండేదేమో. స్త్రీని చంపడం అధర్మమనే కారణం కాస్త పక్కకు పెడితే అంతకన్నా గొప్ప త్యాగం శూర్పణఖ రూపంలో నిగ్గుతేలింది.

శూర్పణఖ అసలు పేరు మీనాక్షి

శూర్పణఖ అసలు పేరు మీనాక్షి

శూర్పణఖకు సంబంధించి మరో కథ కూడా ప్రచారంలో ఉంది. శూర్పణఖ అసలు పేరు మీనాక్షి.. కేకసి, విశ్రావసుల కుమార్తె. రావణ, కుంభకర్ణ, విభీషణ, ఖర దూషణలకు సోదరి. మారీచ, సుబాహులకు మేనకోడలు. అంటే తాటకి ఈమెకు అమ్మమ్మ. విద్యజ్జిహ్యుడనే రాక్షసుడు ఈమెను వివాహం చేసుకున్నాడు. వీడు కాలకేయ వంశానికి చెందినవాడు. రావణాసురుడు లోకాలన్నిటినీ జయించే ఉత్సాహంలో ఒకసారి కాలకేయులతో పోరాడుతూ పొరబాటున విద్యుజ్జిహ్వుడినీ వధించాడు. అప్పటికి శూర్పణఖ గర్భవతి. భర్త మరణంతో దు:ఖితమదియైన శూర్పణఖను రావణుడు 'తెలియక తప్పు జరిగిపోయిందని' ఓదార్చాడు. మనసు కుదుటపడటానికి ఖరుడు, దూషణుడు, త్రిశరుడు అనేవాళ్ళను తోడిచ్చి దండకారణ్యంలో విహరించమని పంపేశాడు. అప్పటి నుంచి ఒంటరైన ఆమె లంకకు, దండకారణ్యానికి మధ్య తిరుగుతూ కాలం వెల్లదీస్తుంది.

శ్రీరామునికి సదాభిప్రాయం కలిగించింది

శ్రీరామునికి సదాభిప్రాయం కలిగించింది

రావణ సంహారమే రామాయణమైతే, శ్రీరాముడు రఘవీరుడైంది రాక్షస సంహారంతోనే ఇదంతా శూర్పణఖ వల్లే జరిగింది. ఒక్క తాటికి, సుబాహు తప్ప మిగతా వారి మరణానికి కారణమైంది. అంతేకాదు వారికి అభివృద్ధి కూడా తోడ్పడింది ఆమే. ఎలా అంటే విభీషణస్తు ధర్మాత్మా అంటూ మొట్టమొదటి సారిగా రాముడి వద్ద విభీషణుడి పేరును ప్రస్తావించి, ఆయనపై శ్రీరామునికి సదాభిప్రాయం కలిగించింది కూడా ఈ మీనాక్షే.

కామ వికారిగా మారి

కామ వికారిగా మారి

దండకారణ్యంలో నరవాసన తగలి పరుగెత్తుకొచ్చిన ఈమె, రాముడి దర్శనంతో ఆకలిని సైతం మరిచిపోయి, కామ వికారిగా మారి సాక్షాత్తు శ్రీమన్నారాయణుని చేయిందుకోవాలని ఆశించింది. అందుకు సీతను చంపడానికి కూడా సిద్ధపడింది. శూర్పణఖను రాక్షస స్త్రీగా వాల్మీకి వర్ణించినా, కంబ రామాయణంలో మాత్రం ఆమెను అందగత్తెగా చిత్రీకరించారు. సీతను చంపడానికి ఉద్యుక్తురాలవుతోన్న శూర్పణఖను తన అన్న శ్రీరాముడి ఆఙ్ఞ‌తో లక్ష్మణుడు ముక్కు, చెవులు కోసి వదిలిపెట్టాడు. అయితే ఈ శూర్పణఖ పూర్వ జన్మలో ఓ గంధర్వ కన్య. వైకుంఠంలో శేషతల్పంపై పవళించిన శ్రీహరిని చూడటానికి ఓ రోజు ఈమె ప్రయత్నించింది. ఈ సమయంలో ఆదిశేషుడు తన పడగలతో మహావిష్ణువును కనిపించకుండా మూసేశాడు. దీనికి ఆగ్రహించిన ఆ గంధర్వ కాంత శేషుడి చెవులు, ముక్కుమీద పొడించింది.

ప్రపంచం ముందు అంద విహీనంగా

ప్రపంచం ముందు అంద విహీనంగా

ఒక స్త్రీగా.. అందాన్నీ, ప్రకృతినీ అమితంగా ప్రేమించగలిగే వ్యక్తిగా, తన పని పూర్తి కాగానే ఎవ్వరినీ దోషులుగా చూడని పరిపక్వతే తన నైజంగా మలుచుకున్న శూర్పణఖ పరోక్ష మహనీయతను పొందడంలో తప్పులేదు. కాగల కార్యం తనద్వారా జరిగినందుకు ఒకింత గర్వపడి, తాను ప్రపంచం ముందు అంద విహీనంగానూ, కఠోరమైన, సూక్ష్మమైన బుద్ధిగల స్త్రీగానూ శూర్పణఖ మిగిలిపోయింది . కొన్ని కథల్లో విలన్లు కూడా హీరోలుగా చరిత్రలో మిగిలిపోతారు. అలాంటి పాత్రే శూర్పణఖది.

English summary

the untold story of ravanas sister surpanakha

the untold story of ravanas sister surpanakha
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more