Latest Updates
-
దాబా స్టైల్ భూనా చికెన్ మసాలా..స్పైసీగా, జ్యూసీగా కేక టేస్ట్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
విష్ణు సహస్రనామ స్తోత్రం చదివినా, విన్నా చాలు.. గ్రహ దోషాల నుంచి సత్వర ఉపశమనం.! -
ఒకే స్థానంలో గురు, రాహు గ్రహాలు.. గురు చండాల యోగంతో జీవితంలో ఈ కష్టాలు తప్పవు.! -
బెండకాయ ఎప్పుడు వండినా జిగురుగా ఉంటుందా.?..ఈ పద్ధతిలో ట్రై చేస్తే అస్సలు వదిలిపెట్టరు.! -
ఆకలినే ఆయుధంగా మార్చి 20 రోజులుగా నిరాహార దీక్ష.. ఎందుకీ ఉద్యమం, ఎవరీ సోనం వాంగ్ చుక్.! -
గ్రహాల శక్తితో పాటు దైవానుగ్రహం.. పూజలో ఈ రంగు వస్త్రాన్నే ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా.? -
రాత్రి పూట స్వీట్ తినాలనిపిస్తుందా? ఓవెన్ అక్కర్లేకుండానే ఇంట్లోనే బేకరీ స్టైల్ బనానా బ్రెడ్ చేసుకోండిలా.. -
పిల్లలు, వృద్ధుల ఎముకల బలానికి రాగి, మునగాకు రోటి.. రోజూ ఒక్కటి తింటే చాలు.! -
మగవారిలో వీర్య కణాల సంఖ్య దారుణంగా పడిపోవడానికి ఈ పది ఆహార పదార్థాలే కారణం.! -
పప్పుచారులోకి బెస్ట్ సైడ్ డిష్.. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ వడ.. 10 నిమిషాల్లో చేసేయండిలా
హిందు పురాణాల ప్రకారం : మహా శివుని వివిధ రూపాలు
మహాశివుడు హిందువులకి ఉన్న ముఖ్యమైన దేవుళ్ళలో ఒకరు. "శైవులు" లేదా మహాశివుని భక్తులు ఆయనను ఒక మహోన్నతమైన శక్తిగా కొలుస్తారు."ఓంకారం" లేదా అస్థిత్వానికి ముందునుండి ఉనికిలో ఉన్న శబ్ధమే మహా శివుని మూలం అని చెబుతారు.
మొట్టమొదటి దైవ రూపం ఎమిటి అన్నదానిపై హిందూ పురాణాలు కూడా తరచూ వివాధపూరితమైన చర్చగానే మిగిలినా, శైవులు మాత్రం మహాశివుడినే మొట్టమొదటి దైవ రూపంగా నమ్ముతారు. ఈ విశ్వంలొ మొట్టమొదటి మరియు అత్యంత శక్తివంతమైన దేవుడిగా నమ్మబడే మహాశివుడు, నిరాకారుడు , లింగాకారుడు మరియు అనంతుడు.
సృష్టిలొని పంచ భూతాలైన పృధ్వి , గాలి , నీరు ,అగ్ని, ఆకాశాలకు పరమ శివుడు అధ్యక్షుడు. ప్రకృతిలొని ఈ రూపాలు అన్ని కలిపితే శివ లింగం అని అంటారు.
శివ పురణం ప్రకారం మహాశివునికి 64 రూపాలు ఉన్నాయి. శివ లింగం అత్యంత సాధారణంగా గుర్తించబడే మహాశివుని రూపం. 64 రూపాలలో సాధారణ మనుషులమైన మనకు చాలా వరకు తెలియవు. అందుకనే ఎంతో ఆసక్తికరమైన మహాశివుని 6 రూపాల గురించి ఇప్పుడు తెలుసుకుందామా? అయితే ఆలస్యం చేయకుండా చదివేయండి మరి.

లింగోద్భవ
లింగోద్భవ లేదా ' కొలతకు అందని వాడు ' అన్న పరమ శివుని రూపం మాఘ మసంలో వచ్చే కృష్ణ చతుర్దశి నాడు ప్రదర్శితమైనది. బ్రహ్మ , విష్ణువులకు మహా శివుడే అంతిమ ఆధ్యాత్మిక రూపమని వ్యక్త పరచడం కోసం లింగోద్భవ రూపం ప్రదర్శితమైనది. పురాణాల ప్రకారం లింగోద్భవ అంటే అంతులేని కాంతి పుంజం అని అర్ధం.
ఆలయాలలొని లింగోధ్భవ ప్రతిరూపాలలో నిలబడి ఉన్న చతుర్భుజ ఆకారం కనిపిస్తుంది. ఆ ఆకారంలొని పై రెండు చేతులలొ ఒకదానితొ లేడిని మరొక చేతితొ గొడ్డలిని పట్టుకుని కనిపిస్తాయి. మిగిలిన రెండు చేతులు భక్తులను దీవిస్తూ ఉంటాయి. ఈ ప్రతిరూపాలు సాధారణంగా శివాలయాల పడమటి గోడలపై కనిపిస్తాయి.

నటరాజ
నటరాజ లేదా ' నాట్యానికి రాజు ' రూపంలో మహా శివుడు నాట్య రూపంలొ కనిపిస్తాడు. లయకారుడు లేదా విధ్వంసానికి ప్రభువుగా చెప్పబడే శివుడు ఈ రూపంలో జీవన మరణ చక్రమును ప్రతిబింబిస్తాడు.
పరమ శివుడు ' తాండవ నృత్యం ' గా పిలవబడే విధ్వంస నాట్యం చేసినప్పుడు, అందులో జనన, మరణ, పునర్జన్మల సారాంశం ఉంటుంది. పరమ శివుడు ఈ నాట్యం చేసినప్పుడు మెరుపులు మెరుస్తాయి , పెద్ద పెద్ద కెరటాలతో సముద్రాలు పోటెత్తుతాయి , విష సర్పాలు విషం కక్కుతాయి, అగ్నికి అన్ని ఆహుతవుతాయి. పరమ శివుడు ' ఆనంద నృత్యం ' గా పిలవబడే సృష్టి కారకమైన నృత్యం చేసినపుడు , ఈ అనంత విశ్వం ప్రశాంతంగా, సంపన్నంగా ఉంటుంది.

దక్షిణామూర్తి
దక్షిణామూర్తి లేదా దక్షిణానికి అధిపతి అంటే, సత్యమునకు మరియు జ్ఞానానికీ ప్రభువు. దక్షిణామూర్తి ప్రతిరూపం శివాలయాలలోని దక్షిణ గోడలపై కనిపిస్తుంది. ఈ రూపంలో శివుడు మర్రి చెట్టుకింద పీఠంపై కూర్చునట్టు కనిపిస్తాడు. ఆయన ఏడమ కాలు ముడుచుకుని ఉండి, కుడి కాలు ' ఆపస్మరుడు ' అనే రాక్షసుడిపై ఉంటుంది. ఆయన చెతులలొ త్రిశూలం, సర్పం, తాళపత్రం కలిగి ఉంటారు. ఆయన కుడి చేయి మాత్రం అత్యంత సుభప్రదమైన చిన్ముద్ర లో ఉంటుంది.

అర్ధనారీశ్వర
అర్ధనారీశ్వర రూపంలో జీవ సృష్టికి నిదర్శనంగా శివపార్వతులు ఇద్దరు కలిసి దర్శనమిస్తారు. సాధారణంగా ఈ రూపంలొ సగ భాగం స్త్రీ లాగా , మరొ సగం పురుషుడి లాగా నిలబడి ఉంటారు. ఈ రుపంలొ స్త్రి పురుషులు ఇరువురు సమానమని , ఎవరు వెరెవరికన్నా గొప్పవారు కాదని ప్రపంచానికి ఒక గొప్ప సందేశాన్నిస్తూ ఒక మంచి పాఠాన్ని కూడా నేర్పిస్తున్నారు.

గంగాధర
గంగాధర అంటే గంగను పట్టిన లేదా ధరించిన వాడని అర్ధం. భగీరధుడు పరలొకం నుండి గంగ కోసం వేచిచూస్తున్న సమయంలో, గంగ ఎంతొ అహంకారంతో పృధ్విని నాశనం చేసేంత శక్త్తి గల వేగంతొ వస్తానని చెప్పింది. అప్పుడు భగీరధుడి విన్నపం మేరకు పరమ శివుడు గంగను తన జఠజూఠంలో పట్టుకుని భూమిపైకి చిన్న ధారగా గంగా నదిగా వదిలాడు. ఈ విధంగా గంగకు అహంకారము నుండి విముక్తి లభించింది.

భిక్షాటన
భిక్షాటన అంటే యాచించడం లేదా భిక్షం అడగడం. కాని పరమ శివుని భిక్షాటన రూపం యొక్క ముఖ్య లక్ష్యం మనలొని అజ్ఞానాన్ని, అహంకారాన్ని నిర్మూలించడం. ఈ రూపంలో శివుడు నగ్నంగా మనల్ని ప్రేరేపించే విధంగా కనిపిస్తాడు. చతుర్భుజ సన్యాసిగా కనిపిస్తూ చేతులలొ త్రిశూలం, ఢమరుకం, పుర్రెతొ ఉంటాడు. అలాగే కుడి చేతితో జింకకు ఆహారమిస్తూ కనిపిస్తాడు.



Click it and Unblock the Notifications