For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దేవాలయాల్లో ఇతరులకు నమస్కారం చేయకూడదు... ఎందుకో తెలుసా...

దేవాలయాల్లో ఎలాంటి పనులు చేయకూడదో తెలుసుకోండి.

|

భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం అనే విషయం ప్రపంచానికంతటికీ తెలుసు. అందుకే ప్రపంచంలోని అనేక దేశాలు మనల్ని ఇప్పటికీ గౌరవిస్తూ ఉంటాయి.

Things not to do in temples

అందులోనూ ఇక్కడ హిందూ దేవాలయాలు చాలా పురాతనమైనవి. ఎంతో విశిష్టత కలిగి ఉన్నవి.ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగిన, ప్రసిద్ధి గాంచిన దేవాలయాలను కొన్ని వేల సంఖ్యలో మన దేశంలో చూడొచ్చు. కేవలం హిందూ మతంలోని దేవాలయాలు మాత్రమే కాదు.. ఇతర మతాలలోని దేవాలయాలు కూడా చాలా పవిత్రమైన ప్రదేశాలుగా ప్రజలందరూ భావిస్తారు.

Things not to do in temples

శ్రీవైఖానస శాస్త్రం ప్రకారం భక్తుల రక్షణార్థం దేవుడు అర్చారూపియై ఈ భూమి మీదకు అడుగుపెట్టాడు. ప్రతి గుడిలోనూ ద్వారపాలకులు, పరివార దేవతలు, ప్రాకార దేవతలు ఆయా స్థానాలలో ఆవాహన చేయబడి ఉంటారు.చారిత్రకంగా దేవాలయాలు చాలా ప్రాధాన్యత కలిగి ఉన్న ప్రదేశాలు.క్రీస్తు శకం 1వ శతాబ్దం నాటి నుండి నిర్మించిన అనేక దేవాలయాలు ఉత్తర భారతం కన్నా దక్షిణ భారతంలోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇలాంటి దేవాలయాల్లో అడుగుపెట్టే మనకు అక్కడ ఎలాంటి పద్ధతులు పాటించాలి.. దేవుడిని ఎలా పూజించాలనే విషయాలను పండితులు, పెద్దలు, పూజారులు తరచుగా చెబుతూ ఉంటారు. కానీ దేవాలయాల్లో ఎలాంటి పనులు చేయకూడదనే విషయాలను చాలా తక్కువ మందే చెబుతారు. ఈ సందర్భంగా దేవాలయాల్లో ఎలాంటి పనులు చేయాలి.. ఎలాంటి పనులు చేయకూడదనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

దేవాలయాల్లో రకాలు..

దేవాలయాల్లో రకాలు..

ఈ దేవాలయాలు హిందూ యుగపు చరిత్రను, చరిత్రకారుల ఆలయాల గురించి చరిత్ర రాసేందుకు ఉపయోగపడుతున్నాయి. ఇక ఈ దేవాలయాలు ఎన్ని రకాలలో ఉంటాయి.. వీటి నిర్మాణం ఎందుకంటే అందరికంటే విభిన్నంగా ఉంటుందో చూద్దాం రండి.

పంచమ రకాలు..

పంచమ రకాలు..

దేవాలయాలు పంచ(ఐదు) రకాలుగా ఉంటాయి. వాటిలో ఒకటి స్వయంవ్యక్త స్థలాలు - భగవంతుడే స్వయంగా వెలసినవి.. దివ్య స్థలాలు - దేవతలచే ప్రతిష్టింపబడినవి.. సిద్ధ స్థలాలు - మహర్షులు, తపస్సు చేసి సిద్ధి పొందిన స్వాములు ప్రతిష్టించినవి. పౌరాణ స్థలాలు - పురాణాలలో చెప్పబడి ప్రసిద్ధిగాంచినవి.. మానుష స్థలాలు - రాజుల చేత, భక్తుల చేత ప్రతిష్ట చేయబడి ఉంటాయి.

దేవాలయ గోపురాలు..

దేవాలయ గోపురాలు..

హిందూ దేవాలయాల్లో ఎక్కువగా గాలి గోపురాలు ఉంటాయి. గాలిగోపురం, ప్రధాన ద్వారం, వైకుంఠ ద్వారం, ధ్వజ స్తంభం, గర్భగుడి, ద్వారపాలకులు, వంటశాల తదితర విభాగాలు ఉంటాయి.

ఈ పనులు చేయకండి..

ఈ పనులు చేయకండి..

దేవాలయాల్లో ఆగమశాస్త్రం ప్రకారం పూజారులు, భక్తులు, అధికారులు ఏ విధంగా వ్యవహరించకూడదంటే.. ముఖ్యంగా ఆలయం లోపలికి ఎవ్వరూ కూడా వాహనాలలో రావడం.. చెప్పులు, బూట్లతో వంటి వాటితో తిరగడం చేయరాదు.

అప్పుడే లోపలికి ప్రవేశించాలి..

అప్పుడే లోపలికి ప్రవేశించాలి..

ఆలయాల్లో ప్రదక్షిణలు చేసి, ఆ తర్వాతే గుడి లోపలికి ప్రవేశించాలి. ఆలయంలో లోపలికి తలపాగా ధరించి వెళ్లకూడదు. అలాగే చేతుల్లో ఏవైనా ఆయుధాలను పెట్టుకుని అస్సలు ప్రవేశించకూడదు.

తినుబండారాలను తీసుకుని..

తినుబండారాలను తీసుకుని..

ఆలయంలోకి ఒట్టి చేతులతోగాని, కుంకుమ పెట్టుకోకుండా గాని, తాంబూల చర్వణం చేస్తూ గాని, తినుబండారాలేవైనా తింటూ గాని దేవాలయంలోకి ఎట్టి పరిస్థితుల్లో ప్రవేశించరాదు.

నిద్రపోరాదు..

నిద్రపోరాదు..

దేవాలయంలో అడుగుపెట్టిన తర్వాత నిద్రపోవడం, కాళ్లు చాపుకుని కూర్చోవడం వంటి పనులను కూడా చేయరాదు. అలాగే ఆలయ ప్రాంగణంలో మల, మూత్ర విసర్జన వంటి పనులు చేయకూడదు.

వివాదాలు పెట్టుకోరాదు..

వివాదాలు పెట్టుకోరాదు..

ఆలయాల్లో ఎవ్వరితోనూ.. ఎప్పటికీ వివాదం అనేదే పెట్టుకోరాదు. అలాగే దేవాలయ ప్రాంగణంలో ఏ జీవికీ హాని కలిగించడం లేదా హింసించడం వంటివి అస్సలు చేయరాదు.

పరనింద చేయకూడదు..

పరనింద చేయకూడదు..

దేవాలయ ప్రాంగణంలో అహంకారం, గర్వంతో, అధికార దర్పంతో అస్సలు ఉండకూడదు. దేవుని ఎదుట పరస్తుతిని, పరనింద వంటి పనులను చేయరాదు. ఒకే చేతితో నమస్కారం చేయరాదు. అధికార గర్వంతో దేవాలయ ప్రాకారంలో ప్రవేశించి అకాల సేవలను చేయరాదు. అలాగే, దేవుని ఎదుట ప్రుష్ఠభాగం చూపిస్తూ కూర్చోకూడదు. ఆలయాల్లో ఇతరులకు నమస్కారం చేయకూడదు. ఎందుకంటే భగవంతుని ముందు అందరూ సమానులే అని భావించాలి.

English summary

Things not to do in temples

Here are these things not to do in temples. Take a look
Desktop Bottom Promotion