శని జయంతి రోజు చేయాల్సిన పనులు ?!

Posted By: Gandiva Prasad Naraparaju
Subscribe to Boldsky

భారతదేశంలోని చాలా ప్రదేశాలలో అమావాస్య రోజున అమావాస్య తిధిరోజు శని జయంతిని జరుపుకుంటారు.

దేశంలోని ఇతర ప్రాంతాలలో, వైశాఖ మాసం లో అమావాస్య తిధినాడు శని జయంతిని జరుపుకుంటారు. ఈ తేడా ఎందుకంటే వారు వివిధ రకాల పంచాంగాలను అనుసరిస్తారు కాబట్టి.

శనిజయంతి పూజ సమయాలు ఈ కింద ఇవ్వబడ్డాయి:

శనిజయంతి ని శనిదేవుని పుట్టినరోజు గా జరుపుకుంటారు. శనిదేవుడు నవగ్రహాలలో ఒకటైన శనిగ్రహానికి అధిపతి. శని దేవుడు మన భవిష్యత్తుని రూపొందించడంలో, మన జీవితానికి మార్గాన్ని ఇవ్వడంలో ప్రధాన పాత్రను పోషించే ముఖ్యమైన దివ్యమూర్తులలో ఒకరు.

బర్త్ చార్ట్ లో దీర్ఘకాలిక దశలలో ఇదొకటి. ప్రతి ఒక్క మనిషీ కనీసం తమ జీవితంలో ఒక్కసారైనా ఈ శని ప్రభావానికి లోనుకాక తప్పదు. శని క్రూరమైన, హానికరమైన గ్రహం అని ముద్రపడినా, ఇది ఎల్లప్పుడూ నిజం కాదు.

శనిగ్రహ పవిత్ర స్ధానాలు అపారమైన ఫలితాలు కలిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి, శని ప్రభావానికి భయపడకపోవడం మంచిది.

మీరు శని దుష్ప్రభావాల వల్ల బాధపడుతుంటే, వాటిని సరిదిద్దే కొన్ని పనులు చేయడానికి శనిజయంతి సరైన రోజు.

శనిజయంతి రోజు శనికి హోమాలు, యజ్ఞాలు, పూజలు చేయడం మంచిది. శనిజయంతి రోజు శని తైలాభిషేకం (శనికి నూనెతో అభిషేకం చేయడం), శని శాంతిపూజ వంటివి చేయడం ముఖ్యమైన సంప్రదాయం.

శని ప్రభావాన్ని పోగొట్టుకోవడానికి లేదా తగ్గించుకొనే కొన్ని ఇతర పనులు కూడా ఉన్నాయి. శనిజయంతి రోజు శనిని శాంతింప చేసే మరిన్ని విషయాలను చదివి తెలుసుకోండి. ఇవి శనిజయంతి రోజు చేయాల్సిన వివిధ పనులు.

నూనె ఇవ్వడం

నూనె ఇవ్వడం

హనుమంతుడు శనిదేవుడి లోని అహంకారాన్ని నాశనం చేసినపుడు, అతని శరీరంపై మచ్చలు, గాయాలు అయ్యాయి. ఆ దెబ్బల నొప్పి పోయి సున్నితంగా తయారవడానికి హనుమంతుడు ఇచ్చిన నూనె సహాయపడింది. శనిదశ దుష్ప్రభావాలతో బాధపడేవారు ఎంతో భక్తితో శనిదేవునికి నూనె సమర్పిస్తే చెడు ఫలితాలు పోతాయని హామీ ఇచ్చాడు. కాబట్టి, శనిజయంతి రోజు శనికి చమురును అందించడాన్ని పవిత్రమైనదిగా భావిస్తారు. ఆవనూనెను శనికి సమర్పించడం ఉత్తమంగా భావిస్తారు.

నల్ల వస్తువులు దానం చేయడం

నల్ల వస్తువులు దానం చేయడం

శనిదేవతను ప్రతిబింబించే నల్ల వస్తువులను శనిజయంతి రోజు దానమివ్వాలి. నల్ల ధాన్యాలు, నల్ల మినప్పప్పు, నల్ల నూనెలు, నల్ల ఆవులు, నల్ల బట్టలు మొదలైనవాటిని శనిజయంతి రోజు దానమివ్వదగ్గ వస్తువులలో కొన్ని మంచి ఉదాహరణలు. ఈ వస్తువులను దానం ఇస్తే శనిదశ లోని చెడు ప్రభావాలు తొలగిపోవడానికి సహాయపడుతాయి. మీ కష్టానికి బహుమతులు, గుర్తింపు పొందడం జరుగుతుంది. ఆర్ధికపరమైన మెరుగుదలను కూడా మీరు చూస్తారు.

నల్ల కుక్కను పోషించడం

నల్ల కుక్కను పోషించడం

నలుపు రంగు, కుక్క రెండూ శనిగ్రహానికి చెందుతాయి. నల్లకుక్కను పోషిస్తే శనిదేవుడు శాంతిస్తాడు. ఆవనూనేతో వేయించిన గోధుమపిండి రొట్టెలు తయారుచేయండి. ఈ రొట్టెలను నల్ల కుక్కకు తినిపించండి, ఇలా చేస్తే మంచి ఫలితాలను త్వరగా పొందుతారు.

నవగ్రహ ఆలయాన్ని దర్శించండి

నవగ్రహ ఆలయాన్ని దర్శించండి

నవగ్రహ ఆలయం లేదా శనిదేవుని ఆలయాన్ని దర్శించండి. పంచామృతాలు, నూనె, గంగాజలం, నీటితో శనికి అభిషేకం చేయండి. ఇలా చేస్తే శని సంతోషించి, తన బారి నుండి మిమ్మల్ని విడుదల చేస్తాడు.

నవరత్న హారం

నవరత్న హారం

శనిగ్రహ దుష్ప్రభావాలతో మీరు ఎక్కువ బాధపడుతుంటే, శనికి తొమ్మిది రత్నాలతో కూడిన హారాన్ని ఇవ్వండి. నవరత్న హారం లేదా తొమ్మిది రత్నాలతో తయారుచేసిన హారాన్ని పూజా సమయంలో శనికి సమర్పించాలి.

హనుమంతుడిని ప్రార్ధించండి

హనుమంతుడిని ప్రార్ధించండి

హనుమంతుని ఆలయాన్ని దర్శించి, ఆరోజు పూజలు నిర్వహించండి. హనుమంతుని భక్తులు ఎప్పటికీ శనిదేవుని వల్ల బాధపడరు, కష్టపడరు.

English summary

Things To Do On Shani Jayanti | When Is Shani Jayanti | Shani Jayanti 2017 | What To Do On Shani Jayanti | Significance Of Shani Jayanti

This year, Shani Jayanti falls on 25th of May and it is celebrated on the Amavasya tithi of Vaishaka month. It is the birth anniversary of Lord Shani, who is also known as the 'Karmafal Daata' Offering oil, donating black clothes, feeding a black dog, etc., are few of the things to be done on Shani Jayanti.
Story first published: Thursday, December 14, 2017, 13:30 [IST]