For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  ఈ అక్షయ తృతీయను పురస్కరించుకుని ఈ దానాలు చేసి మీ ఆనందాన్ని పదింతలు చేసుకోండి!

  |

  "ఇంత ఉరుకులు పరుగుల జీవితంలో మీకు మీ కొరకు అసలు సమయం ఎలా దొరుకుతుంది?" అనే ప్రశ్న ఈ రోజుల్లో మీకు తరచుగా వినిపిస్తుంది.

  ఇప్పుడు మన ధ్యాసని మన కొరకు ఒక రోజును వెచ్చించుకోవడం నుండి అవసరాల్లో ఉన్న వేరొకరి కొరకు వెచ్చించడం పైకి మరలుద్దాం, నిజమైన అవసరాలు ఉన్న ఒకరి కొరకు. ఆ రోజు సంవత్సరం మొత్తం మీద ఏ రోజైన కావచ్చు. అది ఒక శుభప్రదమైన రోజున ఎందుకు కాకూడదు? అది ఈ సంవత్సరంలో ఏప్రిల్ 18వ తేదీన అక్షయ తృతీయ జరుపుకునే రోజు కూడా కావచ్చు.

  ఈ అక్షయ తృతీయ నాడు మన సంపాదనలో కొంత భాగం మంచి కారణానికై వెచ్చించి మన చుట్టూ ఉన్నవారికి ఆనందాన్ని పంచువచ్చు. దానధర్మాలు చేయడానికి ఈ దినం అత్యంత ప్రాశస్త్యం అయినది. విష్ణుమూర్తిని కొలిచేటప్పుడు దానధర్మాలు చేస్తే పుణ్యం ప్రాప్తించి మరణాంతరం స్వర్గలోక ప్రవేశం లభిస్తుంది అని భక్తులు నమ్ముతారు.

  This Akshay Tritiya, Multiply Your Happiness By Donating These Things

  హిందు మత గ్రంధాలన్నీ ఆర్తులకు దానం చేయడం యొక్క విశిష్టతను తెలుపుతున్నాయి. మీరు దానం చేసినది ఏదైనా పదింతలుగా మారి తిరిగి మీ వద్దకు వస్తుంది. అయితే ఇప్పుడు మీ మనసులో ఏమి దానం చేయాలనే ప్రశ్న మెదులుతుంది కదా!

  ఈ క్రింద మనం ఏమి దానం చేయవచ్చో, దాని వలన ఏమి ఫలితం కలుగుతుందో విశదీకరించబడినది.

  1. ఆహారం:

  1. ఆహారం:

  2017 లెక్కల ప్రకారం,భారతదేశంలో 190.7 మిలియన్ల ప్రజలు ఆహారలేమితో అలమటిస్తున్నారు. భారతదేశం ఆహారలేమితో బాధపడుతున్న అత్యధిక జనాభాకు ఆవాసం. ప్రపంచంలో ఉత్పత్తి అయిన ఆహారంలో మూడవ వంతు నిరుపయోగంగా మారిపోతుంది.

  ఆకలితో అలమటించే వారికి అన్నదానం చేసేవారికి ముక్తి లభిస్తుందని విశ్వాసం. ఆకలికి సంబంధించిన గణాంకాలు మరియు అన్నదాన ప్రాముఖ్యత తెలుసుకున్నాక, అన్నదానంతో సమాజంలో ఒక సమతౌల్యం సాధించే దిశగా ఆ అడుగు మనమే ఎందుకు వేయకూడదు అని అనిపిస్తుంది కాదా!

  2. వస్త్రాలు:

  2. వస్త్రాలు:

  దారిద్ర్య రేఖ దిగువున ఉన్న జనాభా నిష్పత్తి భారతదేశంలో అధికమనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆదిత్య పురాణంలో వస్త్రదానం యొక్క ప్రాశస్త్యం గురించి చెప్పబడినది. దీనిలో బెల్లం, నెయ్యి, పరవణ్ణం మరియు వస్త్రాలు దానం చేస్తే చంద్రుడు ప్రసన్నుడవుతాడని చెప్పబడింది.

  3. నీరు:

  3. నీరు:

  పద్మ పురాణంలో నీటిని నువ్వులతో పాటుగా దానము చేస్తే సర్వ పాపాలు తొలగిపోతాయని చెప్పబడింది. నేరపూరిత స్వభావంతో తప్పులు చేసేవారు క్షమార్హులు కానప్పటికిని, అజ్ఞానం వలన చిన్న చిన్న పొరపాట్లు చేసేవారికి మాత్రం తన కర్మఫలానికి ఈ పొరపాట్లు ప్రతిఫలం జాతకూడకుండా ఉండాలి. ఇలా జరగాలంటే ఆ పరమాత్ముని క్షమించమని వేడుకోవడానికి మించి మార్గం లేదు. ఈ అక్షయ తృతీయ నాడు జలదానం చేసి భగవంతుని మీ తప్పులనుండి క్షమాపణ కోరుకోండి.

  4. మందులు:

  4. మందులు:

  కోట్ల కొలది ప్రజలు వివిధ రకాల వ్యాధులతో మగ్గుతున్నా చికిత్స చేయించుకోవడానికి తగిన ధనం తమ వద్ద లేక బాధపడుతున్నారు. పద్మ పురాణం మందులు మరియు నూనె దానం చేసిన దాతకు మంచి ఆరోగ్యం మరియు రోగవిముక్తి సంప్రాప్తిస్తుందని తెలుపుతుంది. మీరు ఎవరికైనా మందులు కొనిపెట్టడమో లేక చికిత్స చేయించడమో చేయవచ్చు.

  5. బియ్యం, వెండి, పంచదార:

  5. బియ్యం, వెండి, పంచదార:

  ఆదిత్య పురాణంలో, అవసరంతో ఉన్న వారికి బియ్యం, వెండి, పంచదార దానం చేయడం వల్ల కలిగే ఫలితాల గురించి తెలుపబడింది. ఈ దానాల వలన మీ జాతకంలో ఉన్న చంద్రుని యొక్క దుష్ప్రభావాలు తొలగిపోతాయి. వెండి దానం చేస్తే శివుడు సంతోషిస్తాడు.

  6. వాహనం:

  6. వాహనం:

  అగ్ని పురాణంలో వాహన దానం చేస్తే రాజసూయ యాగం వలన కలిగే ఫలితం కలుగుతుంది. బస్తీల్లో ఉండే ఆడపిల్లలకు సైకిళ్లు వంటివి వితరణ చేయవచ్చు. 2016 లో మానవ వనరుల మంత్రిత్వ శాఖ చెప్పినదాని ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రాధమిక స్థాయిలో 4.34%, మధ్యమిక స్థాయిలో17.86% విద్యార్థులు డ్రాపౌట్లుగా మారుతున్నారు. ఈ సంఖ్య బాలికల్లో మరీంత ఎక్కువగా ఉంటుంది. దీని వెనుక తల్లితండ్రులకు వయసొచ్చిన తమ ఆడపిల్లల భద్రత గురించిన ఆందోళన ముఖ్య కారణం. ఇటువంటి వారికి సైకిళ్లు ఇస్తే కొంత మార్పు రావచ్చు.

  జ్ఞానదానం:

  జ్ఞానదానం:

  మాట గ్రంధాల చరిత్రలో చూస్తే ఎంతో మంది మహారాజులు తమ అడ్డులేని అహం మూలంగా ఇక్కట్లుపాలైన ఉదాహరణలు కోకొల్లలు. మహా బలవంతులైన రావణాసురుడు, హిరణ్యకశిపుడు ఇంకా చాలామంది తమ అహానికి చిక్కి ఆ పరమాత్ముని చేతిలో నాశనమయ్యారు. ఈ భౌతికవాద ప్రపంచంలో ఆహానికి తలవంచడం పెద్ద ఆశ్చర్యకరమైన విషయం కాదు.

  ఇంకో ముఖ్యమైన నిజం ఏమిటంటే, భారతదేశ అక్షరాస్యత శాతం 74%. ఇది 84% ఉన్న ప్రపంచ సరాసరి అక్షరాస్యత శాతంతో పోలిస్తే చాలా తక్కువ.

  ఈ నిరక్షరాస్యులైన పిన్నలు మరియు పెద్దలకు మీ ఆహాన్ని విడిచిపెట్టి ఉచిత విద్యను అందించడం వలన మీకు పుణ్యం, వారికి జ్ఞానం ఉన్న వ్యక్తులుగా మారే అవకాశం లభిస్తుంది. ఇది వారికి జీవితకాలం పాటు నిలిచిపోయే బహుమతి అవుతుంది. సమాజానికి మీ సహకారంగా నిలిచిపోతుంది.

  సత్సంగం, ప్రవచనములు మొదలైన ఇతర మార్గాల ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానం పంచడం కూడా ఒక రకమైన జ్ఞానదానమే!

  విష్ణుభగవానుదీని మెప్పించడానికి

  విష్ణుభగవానుదీని మెప్పించడానికి

  విష్ణుభగవానుదీని మెప్పించడానికి దానాలనేవి ఉత్తమమైన మార్గం. అన్ని దానాలలోకెల్ల గొప్పది జ్ఞానదానం అంటారు.

  కృష్ణభగవానుడు ఒకసారి యుధిష్టరునితో ఒకసారి బంగారం, వెండి, ఆహారం, నీరు, గోవులు మొదలైనవి దానం చేయడం ముఖ్యమైనవి అయినప్పటికీ అత్యుత్తమమైనది మాత్రం జ్ఞానదానం అని చెప్పారు.

  కనుక మీరు కూడా ముందుకొచ్చి మేరకు చేతనైన సహాయం ఆర్తులకు అందించండి.

  English summary

  This Akshay Tritiya, Multiply Your Happiness By Donating These Things

  While Akshay Tritiya (18th April) is a day to worship Lord Vishnu, donating items of use holds prime importance. Donating food pleases Lord Vishnu, and water helps get rid of our past sins. Donate medicines to get good health, sugar, silver to please Moon God, and vehicle to earn the benefits of Rajsurya Yagnya. Donating knowledge is of highest significance.
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more