Latest Updates
-
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్‌లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి! -
ఎండల తీవ్రత: ఢిల్లీ స్కూళ్లలో 'వాటర్ బెల్'.. మీ పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడుకోవడం ఎలా? -
గంగా సప్తమి రోజున ఈ చిన్న తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ ముహూర్తాలు తప్పనిసరి! -
నోరూరించే స్టఫ్డ్ టమాటో కర్రీ.. తక్కువ శ్రమతో అదిరిపోయే రుచి!
సింపుల్ టిప్స్ ఫాలో అయితే సంపాదన స్థిరంగా ఉంటుంది, ధనవంతులవుతారు
సాధారణంగా ధనలక్ష్మిని భక్తులు అధికంగా ఆరాధిస్తూ వుంటారు. ఆ తల్లిని పూజించడం వలన దారిద్ర్యం నశిస్తుంది .. సంపద పెరుగుతుంది. జీవితంలో ఎన్నో కష్టనష్టాలు .. బాధలు .. సమస్యలు ఎదురవుతూ వుంటాయి. వాటిలో అత్యధికంగా బాధించేది ఆర్ధికపరమైన సమస్య అని చెప్పవచ్చు. ఆర్ధికంగా బలంగా లేనప్పుడు అవసరాలు తీరవు .. ఆశలు నెరవేరవు. పైగా అవమానాలు ఎదుర్కోవలసి వస్తుంది .. ఆత్మాభిమానాన్ని పణంగా పెట్టవలసి వస్తుంది.
సంపద లేని కారణంగా సంతోషం .. ఆరోగ్యం మాత్రమే కాదు బంధుగణమంతా దూరమవుతుంది. అందుకే సంపదకు అంతా అంతటి ప్రాముఖ్యతను ఇస్తారు. అలాంటి సంపద చేకూరాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం వుండాలి. అయితే లక్ష్మీదేవి ఒకచోట స్థిరంగా వుండదు కదా అనే అభద్రతా భావం కలుగుతూ వుంటుంది. లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే .. విష్ణుమూర్తిని సదా పూజిస్తూ వుండాలని చెప్పబడుతోంది.

తనని మాత్రమే కాదు .. తన భర్త అయిన విష్ణుమూర్తిని అనునిత్యం పూజిస్తూ ఉండేవారి పట్ల లక్ష్మీదేవి మరింత ప్రీతిని కలిగి ఉంటుందట. అందువలన ఎక్కడైతే నిరంతరం విష్ణునామ సంకీర్తనం జరుగుతూ వుంటుందో, అక్కడ ఆ తల్లి సంతోషంగా .. స్థిరంగా ఉండిపోతుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అలా అమ్మవారు స్థిర నివాసం చేస్తే, అక్కడ సిరిసంపదలకు .. సుఖసంతోషాలకు కొదవేం వుంటుంది?
డబ్బు... అది ఉంటేనే నేటి తరుణంలో ఏదైనా సాధ్యమవుతుంది. ప్రస్తుత సమాజంలో డబ్బుతో సాధ్యం కానిదేదీలేదు. అంటే డబ్బు అవసరం లేని పనులు కొన్ని ఉంటాయనుకోండి, అది వేరే విషయం, కాకపోతే పైసాకే ఇప్పుడు ఎక్కువ విలువుందని చెబుతున్నామన్నమాట. అయితే కొందరు డబ్బు సంపాదించడంలో అందరికన్నా ముందు వరుసలో దూసుకుపోతుంటారు. వారు పట్టిందల్లా బంగారమవుతుంటుంది.
కానీ కొందరు మాత్రం ఎంత సంపాదించినా అది ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతుంటుంది. ఆర్థిక స్థిరత్వం అనేది వారికి ఉండదు. వీరితోపాటు అధిక శాతం మంది డబ్బు సంపాదించేందుకు బాగా కష్టపడుతుంటారు. అయితే కింద ఇచ్చిన పలు సూచనలు పాటిస్తే ఎవరికైనా ఆర్థిక స్థిరత్వం లభిస్తుందట. వారు డబ్బు సంపాదించడంలో ముందుంటారట. దీంతోపాటు ధనవంతులుగా ఎదిగేందుకు కూడా అవకాశం ఉంటుందట. ఆ సూచనలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

ఎల్లో కౌరీస్
ఎల్లో కౌరీస్ (Yellow Cowries) అని పిలవబడే ఓ రకమైన గవ్వలను ఏడింటిని తీసుకుని జేబులో పెట్టుకోవాలట. దీంతో ఆర్థిక స్థిరత్వం లభిస్తుందట.

గోమ్తి చక్ర అని పిలవబడే గవ్వలను
గోమ్తి చక్ర అని పిలవబడే గవ్వలను బేసి సంఖ్యలో దగ్గర ఉంచుకున్నా ఆర్థికంగా లాభం జరుగుతుందట. వీరికి శత్రువుల నుంచి బాధ కూడా తప్పుతుందట.

తామరపూవు విత్తనాలను
తామరపూవు విత్తనాలను దగ్గర పెట్టుకుంటున్నా ఆర్థిక స్థిరత్వం లభిస్తుందట. అలాంటి వారికి ఖర్చులు తగ్గుతాయట.

పిప్పళ్ల చెట్టు (రావి చెట్టు) ఆకును
పిప్పళ్ల చెట్టు (రావి చెట్టు) ఆకును ఒక దాన్ని శనివారం పూట తీసుకుని దాని నీటితో శుభ్రంగా కడిగి, ఆ ఆకుపై హ్రీ అని రాసి దగ్గర ఉంచుకోవాలి. దీంతో ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి.

రూ.20 నోటు ఒకటి, రెండు రూపాయి నోట్లు తీసుకుని
రూ.20 నోటు ఒకటి, రెండు రూపాయి నోట్లు తీసుకుని వాటిని వెండి తీగతో కలిపి చుట్టి తెలుపు రంగు పర్సులో పెట్టుకోవాలి. ఇలా చేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ఖర్చులు తగ్గుతాయి. ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది.

లక్ష్మీ దేవికి బియ్యంతో పూజ చేసి
లక్ష్మీ దేవికి బియ్యంతో పూజ చేసి అందులో కొంత బియ్యాన్ని దగ్గర ఉంచుకోవాలి. దీంతో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ధనం బాగా సమకూరుతుంది.

శ్రీయంత్రాన్ని
శ్రీయంత్రాన్ని ఎల్లప్పుడూ దగ్గర ఉంచుకున్నా అంతా మంచే జరుగుతుంది. అలాంటి వారికి డబ్బు పరంగా ఉన్న అన్ని సమస్యలు పోతాయి.

లక్ష్మీ దేవి ఫొటోను దగ్గర పెట్టుకున్నా, విష్ణువు పాదాలను ముట్టుకున్నా
లక్ష్మీ దేవి ఫొటోను దగ్గర పెట్టుకున్నా, విష్ణువు పాదాలను ముట్టుకున్నా అలాంటి వారికి అంతా మంచే జరుగుతుందట. వారికి ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయట.

. కోడిగుడ్డు ఆకారంలో ఉండే తెల్లని వైట్ స్టోన్‌ను
కోడిగుడ్డు ఆకారంలో ఉండే తెల్లని వైట్ స్టోన్‌ను దగ్గర ఉంచుకుంటే అది పాజిటివ్ శక్తిని ఇస్తుందట. అలాంటి వారికి ప్రశాంతత కూడా కలుగుతుందట. దీనికి తోడు వారి ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయట.

లక్ష్మీ దేవికి పూజ
ఏదైనా శుక్రవారం రోజు చిన్నపాటి కొబ్బరికాయతో లక్ష్మీ దేవికి పూజ చేసి ఆ కొబ్బరికాయను దగ్గర ఉంచుకోవాలి. ఇలా చేసినా ఆర్థిక సమస్యలు దూరమవుతాయి.



Click it and Unblock the Notifications