For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కల్పవృక్ష వాహనంపై శ్రీవారు ఎందుకు దర్శనమిస్తారో తెలుసా..

|

కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో నాలుగో రోజు కల్పవృక్ష వాహనంపై కనిపించి భక్తులను కనువిందు చేశారు. ఈ అద్వితీయమైన దృశ్యాలను చూసి లక్షలాది మంది భక్తులు పరవశించిపోయారు. ఈ సృష్టిలో ఎన్ని వృక్షాలు ఉన్నా అన్నింటిలో ఉత్తమమైనది కల్పవృక్షం. అందుకే భక్తులందరూ తాము కోరుకున్న కోరికలను కల్పవృక్షం తీరుస్తుందని వారి నమ్మకం. పురాణాల ప్రకారం క్షీరసాగర మదనంలో ఉద్భవించిన కల్పవృక్షం చెంత చేరిన వారికి ఆకలి, దాహం అనేవే అస్సలు ఉండవు. అష్ట ఐశ్వరాలు కూడా సిద్ధిస్తాయి. ఇదే రోజు రాత్రి సర్వభూపాల వాహనంపై స్వామివారు భక్తులందరికీ దర్శనమివ్వనున్నారు. ఈ సందర్భంగా శ్రీవారి గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం.

1) శ్రీవారికి ఎన్నో పేర్లు..

1) శ్రీవారికి ఎన్నో పేర్లు..

శ్రీవారిని చూసేందుకు ప్రపంచం నలుమూలల నుండి నిత్యం లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. ఈ స్వామి వారిని ఏడుకొండల వాడు, కలియుగ వైకుంఠ దేవుడు, అఖిలాండ బ్రహ్మాండ కోటి నాయకుడు, ఈ విశ్వాన్ని శాసించే అనంత శక్తి స్వరూపుడు అని ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పిలుస్తుంటారు. కానీ స్వామివారిని ఏ పేరుతో పిలిచినా భక్తుల మొరను ఆలకిస్తారని చాలా మంది నమ్ముతారు.

2) స్వామివారి ప్రతిమ గురించి..

2) స్వామివారి ప్రతిమ గురించి..

స్వామివారి ప్రతిమను ఒక్కసారి పరిశీలిస్తే శ్రీవారి కుడి చేయిలో వరద ముద్ర ఉంటుందని పండితులు చెబుతున్నారు. అంటే తన కుడి అరచేతిని తెరచి కిందకు చూపుతుంటారు. ఆయన పాదాలను ఆశ్రయించడం పరమోన్నత భక్తికి నిదర్శనమని చెప్పేందుకు ఇది సూచికంగా ఉంటుందని పండితులు చెబుతారు.

3) స్వామి వారి ఖడ్గం..

3) స్వామి వారి ఖడ్గం..

శ్రీ మహావిష్ణువు యొక్క పంచ ఆయుధాల్లో ప్రధానమైనది ఖడ్గం. దీనికి నందకం, సూర్యకుమారి అని పేర్లు ఉన్నట్టు పురాణాల్లో పేర్కొనబడింది. దుష్టులను శిక్షించి, శిష్టులను రక్షించేందుకు విష్ణుదేవుడుకు సహకరించే ఈ ఆయుధం కలియుగంలో తన భక్తులను ఇబ్బంది కలిగించేవారి భరతం పట్టడానికి స్వామివారు ఈ సూర్యకటారిని ధరించినట్టు పండితులు చెబుతున్నారు. అలాగే శ్రీ వేంకటేశ్వరస్వామి గురించి కీర్తనలు రాసేందుకు, ప్రపంచంలో పాపలతలను ఖండించేందుకు నందక ఖడ్గం అంశంతో పద కవితా పితామహుడైన తాళ్లపాక అన్నమాచార్యులు ఆవిర్భవించినట్లు కథనాలు ఉన్నాయి. మనషుల్లోని అజ్ఞానం, అజాగ్రత్త, అలక్ష్యాలను తొలగించుకోవాలని ఈ ఖడ్గం ద్వారా స్వామివారు సందేశం ఇచ్చినట్లు పండితులు చెబుతున్నారు.

4) అత్యంత శాంతమూర్తి..

4) అత్యంత శాంతమూర్తి..

శ్రీ వేంకటేశ్వరస్వామి యొక్క పై రెండు చేతుల్లో శంఖు చక్రాలు ధరించి ఉంటారు. మొదట్లో వక్షస్థల లక్ష్మీదేవితో స్వామి అత్యంత శాంతమూర్తిగా కొలువుదీరి ఉండేవారట. తర్వాత కాలంలో రామనుజుల వారు వీటిని ఏర్పాటు చేసినట్లు చెబుతారు.

5) తులసీ దళాలతో..

5) తులసీ దళాలతో..

శ్రీనివాస ప్రభువు యొక్క వక్షస్థలంపై శ్రీ మహాలక్షీ దేవి కొలువుదీరి ఉంటుంది. అభిషేక సమయంలో మాత్రమే అమ్మను స్పష్టంగా చూడొచ్చు. లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన శుక్రవారాభిషేకాన్ని ఆమె హృదయంలో ఉండటంతో మొత్తం విగ్రహానికి అభిషేకం నిర్వహిస్తారు.

ప్రతిరోజూ స్వామివారికి మూడుసార్లు సహస్రనామ, అష్టోత్తర శతనామార్చనానంతరం అమ్మవారిని ‘వరాహ పురాణం‘లో పేర్కొన్న 24 నామాలతో పూజిస్తారు. దీన్ని చతుర్వింశతి నామ పూజగా పిలుస్తారు ఇందులో స్వామి వారిని అర్పించిన అనంతరం శ్రీవారి పాదాాల వద్ద ఉన్న తులసీ దళాలతో అమ్మవారిని పూజిస్తారు. తన దేవేరికి హృదయంలో స్థానం ఇవ్వడం ద్వారా ఇల్లాలి స్థానం ఏంటో స్వామివారు లోకానికి చాటి చెప్పారు.

6) తొలి వాహనం..

6) తొలి వాహనం..

స్వామి వారి రెండు భుజాలకు కింది వైపు, మోచేతులకు పై భాగంలో నాగాభరణాలను ధరించి దర్శనమిస్తారు. ఈ ఆభరణాలు ఆదిశేషుడికి ప్రతీకగా ఉంటాయి. తనకు అనుచరుడైనా తన శరీరంలో భాగం చేసుకోవడం ద్వారా స్వామి తాన దయా హృదయుడని చాటి చెప్పారు. బ్రహ్మోత్సవాల్లో తొలి వాహన సేవ శేషుడే కావడం విశేషం.

7) కటిపై కనిపించే స్వామి..

7) కటిపై కనిపించే స్వామి..

చతుర్భుజుడైన శ్రీవారు ఎడమ హస్తాన్ని నడుము కింది భాగంలో కటిపై పెట్టుకుని భక్తులకు దర్శనమిస్తారు. ఇక్కడే జీర్ణ, జననేంద్రియ వ్యవస్థలు ఉంటాయి. ఇవి మనిషి మనుగడకు అవసరమైన భాగాలే అయినా, దేనిపై అతిగా వ్యామోహం పెంచుకోవద్దని సూచిస్తున్నట్టు ఉంటుందని పండితులు చెబుతున్నారు.

English summary

Tirupati Bramhotsavam 2019 : Puja Vidhi for Lord Balaji On Day 4

During the Brahmotsav fesival takes place over a span of nine days and is also termed as the bramha's utsavam or lord brahma's. In 2019, it will be held from 30th september to 8th october 2019.
Story first published: Thursday, October 3, 2019, 15:13 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more