Latest Updates
-
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
లాక్ డౌన్ ఎఫెక్ట్ : కరోనా వల్ల మరికొన్ని రోజులు కోవెలలో దైవ దర్శనాలు లేనట్టే...!
కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల దేశంలోని అన్ని దేవాలయాలతో పాటు మన తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలన్నీ దాదాపు మూతపడ్డాయి.
మన దేశంలో ఏ దేవాలయం అయినా కేవలం గ్రహణం సమయంలో మూసివేస్తుంటారు. అంతే తప్ప ఎలాంటి విపత్కర సమయాల్లో అయినా తెరిచే ఉంచుతారు. భక్తులందరినీ అనుమతించి ఆలయంలో అన్ని రకాల పూజలు నిర్వహిస్తుంటారు. అయితే కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల దేశంలోని అన్ని దేవాలయాలతో పాటు మన తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలన్నీ దాదాపు మూతపడ్డాయి.

కరోనా వైరస్ ప్రభావంతో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తిరుమల వెంకన్న ఆలయం, విజయవాడ కనకదుర్గమ్మ, శ్రీశైలం మల్లికార్జున ఆలయంతో పాటు అనేక దేవాలయాలన్నీ భక్తులు లేక నిర్మానుష్యంగా మారిపోయాయి.

పురాణాలు, గ్రంథాల ప్రకారం బ్రహ్మం గారు ఒక నాలుగు రోజులు శ్రీవారి ఆలయం మూతపడుతుందని చెప్పిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం అంతకన్నా ఎక్కువ రోజులే భక్తులందరికీ శ్రీవారి దర్శనాలు దక్కడం లేదు.

ఈ కరోనా వైరస్ ప్రభావం ఇంకా ఎన్ని రోజులు ఉంటుందో.. తమకు దైవ దర్శన భాగ్యం ఎప్పుడు కలుగుతుందోనని యాత్రికులు ఎంతో ఆశగా నిర్వహిస్తున్నారు.

తొలిసారిగా భక్తులు లేకుండా..
కరోనా వైరస్ దెబ్బకు దేశంలోని ప్రధాన ఆలయాలన్నీ భక్తులు లేకుండా బోసిపోతున్నాయి. భక్తుల సమక్షంలో జరగాల్సిన పూజలు, మంగళహారతులు, అర్జిత సేవలు అన్నింటికీ బ్రేకులు పడ్డాయి. ప్రస్తుతం కొందరు ప్రధాన అర్చకులు మాత్రమే పూజలు నిర్వహిస్తున్నారు.

ఉగాది పండుగను కూడా
తిరుమలలో ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్త సందోహం మధ్య జరిగే ఉగాది వేడుకలు కాస్త ప్రస్తుతం కరోనా వైరస్ దెబ్బకు కేవలం పూజారులు, కొందరు అధికారుల సమక్షంలో మాత్రమే జరిగింది.

శ్రీరామ నవమిని ఏకాంతంగానే..
ఇటీవల శ్రీరామ నవమి పండుగను సైతం తిరుమల, కడప జిల్లా ఒంటిమిట్టలో భక్తులను ఆంక్షలు ఉండటంతో పూజారులందరూ కలిసి శ్రీరామ నవమి వేడుకలను ఏకాంతంగానే నిర్వహించారు. భద్రాచలంలో అతి కొద్ది మంది భక్తులను అనుమతించినప్పటికీ సాదాసీదాగానే వేడుకలు జరిగాయి.

తిరుపతి సమీప గ్రామాల్లో..
తిరుమలలో భక్తులను అనుమతించని అధికారులు, అక్కడి భోజన కేంద్రంలో ఆహారాన్ని తయారు చేసి ప్యాకెట్ల రూపంలో తిరుపతి సమీప గ్రామాలకు సరఫరా చేస్తున్నారు.

ముందు జాగ్రత్త చర్యగా..
సాధారణంగా దేవాలయాలను గ్రహణ సమయాల్లోనే మూసివేస్తారు. అయితే మన దేశ చరిత్రలో ఇన్నిరోజులు ఆలయాలను మూసివేయటం ఇదే తొలిసారి. అయితే కరోనా వైరస్ నేపథ్యంలోనే ముందు జాగ్రత్త చర్యగా దేవాలయాల్లోకి భక్తులను అనుమతించడం లేదు.

నిర్మానుష్యంగా ఆలయ ప్రాంగణాలు..
కరోనా వైరస్ వల్ల భక్తులను దేవాలయ దర్శనాలకు అనుమతించకపోవడంతో ఆలయ ప్రాంగణాలన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. దీంతో ఆలయాల సన్నిధిలో అంతా ప్రశాంతత కనిపిస్తోంది.

జంతువుల హడావుడి..
ఎప్పుడూ భక్తులతో రద్దీగా ఉండే తిరుమల ఘాట్ రోడ్ లో, నడక దారిలో ప్రస్తుతం ప్రశాంతంగా ఉండటంతో జింకలు, పులులు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. ఇంకా కొన్ని జంతువులు కూడా రోడ్ల మీదే సేద తీరుతున్నాయి.



Click it and Unblock the Notifications
