For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మాంగళీక(కుజ) దోషంలో పుడితే...కొన్ని వాస్తవాలు

By Super
|

మీ పండిట్ జీ మీ కుజ దోషం గురించి మీ తల్లిదండ్రులను భయపెడతారని తెలుసా? మీ తల్లిదండ్రులు వరుడు కనుగొనటానికి ముందు ఒక చెట్టును కనుగొంటారు. కాబట్టి జాతకం ప్రకారం మీకు కుజ దోషం ఉందని ప్రకటించారు.

మేము అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ వివాహం ముందు కుజ దోషం అనే పదాన్ని వినలేదు.ఐశ్వర్య అభిషేక్ బచ్చన్ ను వివాహం చేసుకోవటానికి ముందు ఒక పీపాల్ చెట్టును వివాహం చేసుకున్నారు. ఈ విషయాన్నీ పత్రికలు మరియు చానల్స్ ప్రసారం చేసాయి. ఇది కుజ దోషం అనే దురదృష్టంను రద్దు చేయడం కొరకు ఒక జ్యోతిషశాస్త్ర పరిష్కారం.

ఐశ్వర్య చెట్టును వివాహం చేసుకోకపోతే, అది తిరిగి అప్పుడు మరియు ఎల్లప్పుడూ కుజ దోషం వధువు చుట్టూనే పెరుగుతుంది. కాబట్టి,ఇక్కడ నిజం ఉంది,మీరు కుజ దోషమలో జన్మించటం గురించి తెలుసుకోవాలి.

మీకు కుజ దోషం గురించి తెలుసా?

మీకు కుజ దోషం గురించి తెలుసా?

మొదట మరియు అన్నిటికంటే, సరిపోలని కుజ దోష జంటలు సరిపోలిన వారి కంటే తక్కువ సంతోషంగా ఉంటారు. కానీ అలా చెప్పటానికి ఎటువంటి పరిశోధన మరియు శాస్త్రీయ రుజువు లేదు.

ఒక జ్యోతిషశాస్త్ర సంప్రదాయాల ద్వారా తరం నుండి ఆమోదించబడిన శాస్త్రాల ఆధారంగా దీని గుర్తు ఉంటుంది. చాలా మంది హిందువులు కుజ నక్షత్రం లేదా కుజ దోషంలో జన్మించి ఉంటే , వారి వైవాహిక జీవితం తీవ్రమైన సమస్యలతో ఉంటుందని భావిస్తున్నారు. నిజానికి, అనేక హిందూ మత పూజారులు కూడా విడాకులు లేదా ఘోరంగా ఉంటుందని లేదా వివాహం తర్వాత మీ భర్త మరణిస్తాడని చెప్పుతారు.

కుజ దోషం అంటే ఏమిటి?

కుజ దోషం అంటే ఏమిటి?

వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, అతని లేదా ఆమె జాతకంలో కుజుడు క్రియాశీలంగా ఉంటే కుజ దోషం ఉందని చెప్పవచ్చు. ఈ గ్రహం 1వ, 2వ, 4వ, 7వ, 8 వ లేదా వారి చాంద్రమాన చార్ట్ 12 వ హౌస్ లో గాని ఉంటే వారికీ కుజ దోషం ఉందని చెప్పుతారు. ఈ వివిధ ఇళ్ళు జీవితం యొక్క వివిధ కోణాలకు ప్రాతినిధ్యం వహిస్తాయి. అటువంటి సంతోషం మరియు మానసిక శాంతి (4), వివాహం (7), దీర్ఘ జీవితం (8) వంటి వాటి మీద ప్రభావం ఉంటుంది.

 కుజ దోషంను అర్థం చేసుకోవడం

కుజ దోషంను అర్థం చేసుకోవడం

కుజ దోషం అంగారక గ్రహంనకు సంబంధం ఉంది. అంగారకుడు ఆత్మగౌరవం, స్వభావం, అహం, కలహాలను సూచిస్తుంది. ఇది ఒక ఉగ్రమైన గ్రహంగా ఉంది. జన్మ పట్టికలో (కుండలి) కొన్ని నిర్దిష్ట ప్రాంతాల్లో ఉన్నప్పుడు, మీరు దూకుడు మరియు హింసాత్మకం కావచ్చు. అలాగే బహుశా వైవాహిక అసమ్మతికి కూడా దారి తీయవచ్చు. ఈ కుజ దోష సిద్ధాంతం ఈ విధంగా వచ్చింది.

 కుజ దోషంను విశ్వసించే వారు

కుజ దోషంను విశ్వసించే వారు

కుజ దోషంను విశ్వసించే వారు, కాబోయే వధువు మరియు వరుడు మధ్య అనుకూలత కొద్దిగా తక్కువగా ఉంటుందని భావిస్తారు.ఎందుకంటే కుజ ప్రభావం పాడుచేస్తుందని నమ్ముతారు. మీకు కుజ దోషం ఉందో లేదో మీ జాతకం ద్వారా గుర్తిస్తారు. మీ పుట్టిన తేదీ, సంవత్సరం, సమయం మరియు స్థలం ఆధారంగా మీ జాతకాన్ని చూస్తారు.

కుజ దోషం మీద అపోహలు

కుజ దోషం మీద అపోహలు

కాబోయే వధువు లేదా వరుడుకి కుజ దోషం ఉందా లేదా అని చాలా ప్రాముఖ్యతను ఇస్తారు. ఆ విధంగా కొద్ది తప్పుడు నమ్మకాలు అలాగే ఉన్నాయి. ఇక్కడ అత్యంత సాధారణంగా కనిపించే కొన్ని ఉన్నాయి.

మంగళవారం పుడితే ఖచ్చితంగా కుజ దోషం ఉన్నట్టు నమ్మకం

మంగళవారం పుడితే ఖచ్చితంగా కుజ దోషం ఉన్నట్టు నమ్మకం

మీరు మంగళవారం లేదా అంగారక గ్రహం పాలించిన రోజు జన్మిస్తే కుజ దోషం ఉందని చాలా మంది నమ్ముతారు. అయితే ఇది జ్యోతిషశాస్త్ర పరంగా నిజం కాదు.

కుజ దోషం ఉన్నవారు కుజ దోషం ఉన్నవారినే వివాహం చేసుకోవాలి

కుజ దోషం ఉన్నవారు కుజ దోషం ఉన్నవారినే వివాహం చేసుకోవాలి

ఈ 'ప్రసిద్ధ' నమ్మకం వెనుక ఏటువంటి శాస్త్రం లేదా హేతుబద్ధమైన వాదన లేదు. ఇది కేవలం రామ్ గోపాల్ వర్మ షోలే రీమేక్ వంటిది. ఆగ్ - అతార్కికమయిన మరియు నిరాధారమైనది!

చెట్టుతో వివాహం తర్వాత భర్తతో వివాహం

చెట్టుతో వివాహం తర్వాత భర్తతో వివాహం

కుజ దోషానికి సంబందించిన అన్ని సమస్యలు మొదటి వివాహానికి మాత్రమే ఉంటాయని పూజారులు సాదారణంగా చెప్పుతారు. కాబట్టి మీరు మీ రెండో వివాహంలో సమస్యలు రాకుండా ఉండటానికి మొదట చెట్టును వివాహం చేసుకుంటారు.

 మీ భర్త లేదా అతని సన్నిహిత బంధువు చనిపోతారు

మీ భర్త లేదా అతని సన్నిహిత బంధువు చనిపోతారు

ఇది పూర్తిగా అవాస్తవంగా ఉన్న మరో విశ్వాసం. మీకు కుజ దోషం ఉండుట వలన మీ భర్త లేదా అతని సన్నిహిత బంధువు చనిపోతారు.

వివాహం విడాకులతో ముగుస్తుంది

వివాహం విడాకులతో ముగుస్తుంది

మీ వివాహం విజయవంతం కావటానికి మీరు మరియు మీ భాగస్వామి యొక్క అనుకూలత మరియు అవగాహన మీద ఆధారపడి ఉంటుంది. మీ వివాహం దీర్ఘ కాలం ఉండటానికి కుజ దోషం నిర్ణయించదు.

 మా ముగింపు

మా ముగింపు

కుజ దోషం నిజమైతే కేవలం హిందువులకు మాత్రమే ఎందుకు పరిమితం అయింది? సరే హిందువులకు మాత్రమే వర్తించటంలో ఆశ్చర్యమేమీ లేదు? జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మానవ ప్రపంచంలో ఖగోళ దృగ్విషయం మరియు సంఘటనలకు మధ్య సంబంధం మీద ఆధారపడి ఏదో ఉంది. కాబట్టి, ఈ పదం జ్యోతిష్య శాస్త్రంలో ఉన్నట్లయితే, అది అన్ని మతాలు మరియు సమాజం యొక్క అన్ని విభాగాలలో ప్రబలంగా ఉండాలి. అయితే, ఇది అలా కాదు! ఇది కేవలం ఒకే ఒక మతంనకు పరిమితం.

 అందువలన,కుజ దోషం అనే పదం జ్యోతిష్య శాస్త్రంలో ఎక్కువగా ఒక మతంలో మాత్రమే కనపడుతుంది.

అందువలన,కుజ దోషం అనే పదం జ్యోతిష్య శాస్త్రంలో ఎక్కువగా ఒక మతంలో మాత్రమే కనపడుతుంది.

హిందూ మత పూజారులు కుజ దోషాన్ని పారద్రోలటానికి వివిధ మార్గాలను సూచిస్తారు. అయితే వివాహం అనేది ప్రేమ మరియు రెండు వ్యక్తుల యొక్క అవగాహన మీద ఆదారపడి ఉంటుంది. జాతక ఆచారాలు మరియు జ్యోతిషశాస్త్ర ముందు జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కూడా అనేక వివాహలు విఫలమయ్యాయి. అయితే, చాలా వివాహాలు జాతక చక్రాలు లేకుండా కూడా మనుగడ సాగిస్తున్నాయి.

Story first published: Monday, January 26, 2015, 11:17 [IST]
Desktop Bottom Promotion