For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఓర్పు, సహనానికి మారుపేరైన సీతను వెంటాడిన వివాదాలు !!

By Swathi
|

రామాయణంలో సీతమ్మ తల్లిది చాలా ముఖ్యమైన పాత్ర. పవిత్రతకు, కట్టుబాట్లకు, ఓర్పు, సహనానికి, భర్తపై అనన్య భక్తి, ప్రేమకు ప్రతిరూపం సీత. వాల్మీకి మహర్షి రామాయణ మహాగ్రంథాన్ని రాయక ముందు సీతమ్మ జనక మహారాజు దత్తత తీసుకున్న కూతురని తెలుస్తోంది. లక్ష్మీదేవి అవతారమైన సీత తన భర్తతో పాటు 14 ఏళ్లు వనవాసానికి వెళ్లింది. దీంతో సీతకు మహోన్నతమైన మహిళగా, భర్తపై విశ్వాసం కలిగిన అతివగా, అత్యంత ఓర్పు కలిగిన తల్లిగా కీర్తి పొందింది.

ద్రౌపది గర్భం నుంచి పుట్టలేదా !? మరి ఎలా పుట్టింది ?ద్రౌపది గర్భం నుంచి పుట్టలేదా !? మరి ఎలా పుట్టింది ?

అయితే రామాయణం ఒకటి లేదు. గౌతమీ తులసీదాస్ ఈ గ్రంథాన్ని మళ్లీ రాశారు. ఇలా తులసీదాస్ గ్రంథం లాగే.. 300 వందలకు పైగా రామాయణ మహా గ్రంథాలున్నాయి. ప్రతి గ్రంథంలోనూ రాముడు, సీత, రావడణుడి గురించే రాసినప్పటికీ.. కొన్ని కొన్ని విషయాలు విభిన్నంగా ఉంటాయి. ఈ 300 వందలకు పైగా ఉన్న రామాయణ గ్రంథాలన్నీ.. సీత గురించి, ఆమె పుట్టుక, మరణం గురించి, వివాదాల గురించి ప్రస్తావించాయి. ఈ గ్రంథాలన్నింటి ఆధారంగా సీతను చుట్టుముట్టిన వివాదాలేంటో తెలుసుకుందాం..

దత్త పుత్రిక

దత్త పుత్రిక

సీతమ్మ జనకమహారాజుకి పుట్టిన బిడ్డ కాదు. సీతను జనక మహారాజు దత్తత తీసుకున్నారట.

రావణుడి కూతురు

రావణుడి కూతురు

రామాయణ గ్రంథం ప్రకారం రావణుడు, మండోదరి కూతురు. కానీ ఆమె పుడితే.. వాళ్ల వినాశనానికి కారణమవుతుందని జ్యోతిష్యులు రావణుడికి వివరించారు.

వదిలేయడం

వదిలేయడం

తమ వినాశనానికి కారణమయ్యే తమ బిడ్డను వదిలేయాలని భావించాడు రావణుడు. సుదూరంగా మట్టిలో ఆ బిడ్డను కప్పిపెట్టేయమని తమ అనుచరులను ఆదేశించారు. అలా.. జనక మహారాజుకి సీత దొరికింది. ఆయన కూతురిగానే పెరిగి పెద్దదైంది.

రావణుడు సీతను అపహరించలేదు

రావణుడు సీతను అపహరించలేదు

అసలు సీతను రావణుడు అపహరించలేదని కొన్ని వెర్షన్ల రామయణ గ్రంథాలు చెబుతున్నాయి. తాను తీసుకెళ్లిన మహిళ మాయా సీత.

పార్వతి ప్లాన్

పార్వతి ప్లాన్

ఇలా మాయా సీతను అపహరించేలా రావణుడిని మాయ చేసే ప్లాన్ పార్వతీ దేవిదని రావణాసురుడికి తెలియదు. యుద్ధం పూర్తయ్యే వరకు నిజమైన సీతను ఆమె తనదగ్గరే పెట్టుకుంది. ఈ మాయా సీత తర్వాత జన్మలో ద్రౌపదిగా జన్మించింది.

జన్మ స్థలం

జన్మ స్థలం

సీత పుట్టిన స్థలంపై చాలా అయోమయం కూడా ఉంది. సౌత్ నేపాల్ లోని జనక్ పూర్ కి చెందిన మిథిలాలో పుట్టిందని కొన్ని వెర్షన్ల రామాయణ గ్రంథాలు చెబుతుంటే.. మరికొన్ని బీహార్ లోని సీతామర్తిలో జన్మించిందని చెబుతున్నాయి.

వేదవతికి పునర్జన్మ

వేదవతికి పునర్జన్మ

రామాయణం ప్రకారం రావణుడు లైంగికంగా హింసిందిన అత్యంత అందమైన మహిళ వేదవతియే.. తర్వాత జన్మలో సీతగా జన్మించిందని తెలుస్తోంది. దీంతో రావణుడిపై పగ తీర్చుకోవడానికే సీత మళ్లీ జన్మించిందని పురాణం చెబుతోంది.

పద్మా

పద్మా

ఆనంద రామాయణం ప్రకారం మహారాజు పద్మాక్ష కూతురు పద్మా. ఒకప్పుడు ఆమె తపస్సులో ఉండగా.. అగ్ని ఆమెను చుట్టుముట్టింది. అదే సమయంలో రావణుడు ఆమెను లైంగికంగా వేధించడానికి ప్రయత్నించాడు.

పద్మా

పద్మా

ఈ సంఘటన తర్వాత పద్మా తనకు తానే నిప్పు పెట్టుకుంది. అదే ప్రదేశంలో ఐదు వజ్రాలు కనిపించాయి. వాటిని రావణుడు ఒక పెట్టెలో పెట్టుకుని లంకకు తీసుకెళ్లాడు.

పెట్టెలో బిడ్డ

పెట్టెలో బిడ్డ

ఇంటికి తీసుకెళ్లిన వజ్రాల పెట్టెను మండోదరి తెరిచి చూడగా.. వజ్రాల స్థానంలో పాప కనిపించడంతో ఆమె ఆశ్చర్యపోయింది. ఆ తర్వాత ఆ పాప రావణుడి మరణానికి కారణమవుతుందని భావించిన మండోదరి.. ఈ రాజ్యంలో ఉండటానికి వీలులేదని చెప్పింది.

జనకుడికి

జనకుడికి

మండోదరి ఆదేశాల ప్రకారం సహచరులు ఆ పాపతో పాటు, పెట్టెను తీసుకెళ్లి మిథిలా రాజ్యానికి సమీపంలో వదిలిపెట్టారు. అలా.. జనకుడికి సీత దొరికింది.

English summary

Unknown Controversies around Sita

Unknown Controversies around Sita. Sita is one of the principal characters in the Ramayana. All versions of Ramayana has raised controversies for the original one time-to-time.
Story first published: Thursday, June 2, 2016, 13:05 [IST]
Desktop Bottom Promotion