For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Kurnool Mahanandi Temple:‘మహానంది’లో ఎన్నో మిస్టరీలు..కార్తీక మాసంలో నవ నందులను దర్శిస్తే...

‘మహానంది’లో మిస్టరీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

|

మన పూర్వీకుల కాలంలో నిర్మించిన ఆలయాల్లో ఎన్నో అందాలు, అద్భుతాలు, రహస్యాలు దాగి ఉన్నాయి. వాటిలో మనం కొన్ని విషయాలను మాత్రమే తెలుసుకున్నాం. అయితే మనకు తెలియని మిస్టరీలు చాలానే ఉన్నాయి.

Unknown Facts About Kurnool Mahanandi Temple in Telugu

అందులోనూ మన తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల్లో అనేక అద్భుతాలు దాగి ఉన్నాయి. అందులో ఒక దేవాలయమే మహానంది పుణ్యక్షేత్రం. కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలో ఉండే ఈ ఆలయంలో ఇప్పటికీ వీడని మిస్టరీలెన్నో ఉన్నాయి. ఇక్కడ 365 రోజుల పాటు నీరు స్వచ్ఛంగా, పరిశుభ్రంగా ఉంటుంది. ఇక్కడి నీటిని తీర్థంగా భావిస్తారు. ఈ సందర్భంగా మహానంది ఆలయ విశిష్టత, ఇక్కడ ఉండే ఆలయ రహస్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం...

ఆర్థిక సమస్యల నివారణకు కార్తీక పౌర్ణమి నాడు ఈ పూజా విధి విధానాన్ని పాటిస్తే....ఇష్టార్థ సిద్దిస్తుంది..!ఆర్థిక సమస్యల నివారణకు కార్తీక పౌర్ణమి నాడు ఈ పూజా విధి విధానాన్ని పాటిస్తే....ఇష్టార్థ సిద్దిస్తుంది..!

శివలింగం ప్రత్యేకత..

శివలింగం ప్రత్యేకత..

కర్నూలు జిల్లా నల్లమల అడవుల్లో మహానంది పుణ్యక్షేత్రంలో కొలువై ఉన్న శివలింగానికి ఎంతో ప్రత్యేకత ఉంది. పురాణాల ప్రకారం.. ఇక్కడ పుట్టలో కొలువై ఉన్న స్వామి వారికి గోవు పాలు ఇస్తుండగా.. ఓ యజమాని ఆవును కొట్టబోతుంటే.. అది అదుపు తప్పి అక్కడున్న స్వామిని తొక్కుతుంది.

ఆవు పాదముద్ర..

ఆవు పాదముద్ర..

దీంతో స్వామి వారి శివలింగంపైన ఆవు యొక్క పాదముద్ర పడుతుంది. అందుకే ఇక్కడ ఉన్న శివలింగం ఎత్తుగా కాకుండా కొంచెం తక్కువ ఎత్తులో ఉంటుంది. ఈ లింగం కింద నుండి నీరు ఊరుతూ.. ఆ నీరు పుష్కరిణిలో చేరుతుంది.

స్వచ్ఛమైన నీరు..

స్వచ్ఛమైన నీరు..

అక్కడకు వచ్చే నీరు గాలి గోపురం ముందు వైపు రెండు గుండాల ద్వారా బయటకు ప్రవహిస్తుంది. ఈ నీరు బయటకు ప్రవహించే మార్గాల అమరిక వల్ల అక్కడుండే పుష్కరిణిలో నీరు ఎల్లప్పుడూ స్వచ్ఛమైనదిగా.. పరిశుభ్రంగా ఉంటుంది. శివుని యొక్క లింగం నుండి వచ్చే ఈ నీళ్లు సంవత్సరం పొడవునా ఎన్నో ఔషధాలు ఉన్న నీరు ప్రవహిస్తూ ఉంటాయి. ఇవి వేసవికాలంలో చల్లగా.. చలికాలంలో వెచ్చగా.. వర్షాకాలంలో మలినాల్లేకుండా చాలా పరిశుభ్రంగా ఉంటాయి.

స్పష్టంగా కనిపించే నాణేలు..

స్పష్టంగా కనిపించే నాణేలు..

ఇక్కడ ఉన్న నీటిలోకి మనం ఏదైనా నాణేన్ని వేసినా.. లేదా చిన్న గుండుసూది వేసినా కూడా ఐదు అడుగుల లోతులో ఉన్న నీటిలో నుండి అవి చాలా స్పష్టంగా కనిపిస్తాయి. ఈ దేవాలయం ఆవరణంలోని బావులలోకి ఈ స్వచ్ఛమైన నీరు మనకు కనబడుతుంది. ఈ నీటిని భక్తులందరూ తీర్థంగా భావిస్తారు. ఈ మహానంది క్షేత్రంలోని నీరే సుమారు 3 వేల ఎకరాలకు సాగునీరు అందజేస్తోంది.

ఇతర ఆలయాలు..

ఇతర ఆలయాలు..

ఇదే పుణ్యక్షేత్రంలో కోదండ రామాలయం, కామేశ్వరీ దేవి ఆలయం ఇతర దర్శనీయ ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఇక్కడే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుని రుద్ర పుష్కరిణులు ఉన్నాయి. గర్భాలయం ఎదుట ఉన్న పెద్ద నంది దాని ఎదుట ఉన్న చక్కని పుష్కరిణి వీటిని కలిపి ఈ క్షేత్రానికి మహానంది అనే పేరు వచ్చింది. ఈ మహా నందికి 18 కిలోమీటర్ల దూరంలో తొమ్మిది నంది ఆలయాలు కూడా ఉన్నాయి.

కార్తీక మాసంలో..

కార్తీక మాసంలో..

ఈ తొమ్మిది నంది ఆలయాలను కలిపి నవ నందులని అని అంటారు. కార్తీక మాసంలో సోమవారం రోజున నంద్యాల చుట్టూ కొలువై ఉన్న నవ నందులను దర్శిస్తే సకల పాపాలు తొలగిపోతాయని పెద్దలు చెబుతారు. అలాగే సూర్యోదయం నుండి సూర్యాస్తమయం లోపు ఈ నవ నందులను దర్శిస్తే ఎంతో పుణ్యం లభిస్తుందని, సిరి సంపదలు పెరుగుతాయని.. ఆరోగ్యకరంగా ఉంటారని చాలా మంది నమ్ముతారు. 14వ శతాబ్దంలో నంద మహారాజు కాలంలో ఈ నవ నందుల నిర్మాణం జరిగినట్లు తెలుస్తోంది.

FAQ's
  • మహానంది ఆలయం ఎక్కడుంది?

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా నంద్యాల మండలానికి 14 కిలోమీటర్ల దూరంలో మహానంది ఆలయం ఉంది.

  • మహానంది ఆలయంలో ఏ దేవుళ్లు కొలువై ఉన్నారు?

    మహానంది ఆలయంలో శ్రీ మహానందీశ్వరుడు, కామేశ్వరీ దేవి అమ్మవారు కొలువై ఉండగా.. శివ లింగం కింద నుండి భూమిలో ఐదు నీటి ఊటలు ఉన్నాయి.

  • మహానందిలో ఎన్ని నందులు, ఎన్ని పుష్కరిణులు ఉన్నాయి?

    ఇదే పుణ్యక్షేత్రంలో కోదండ రామాలయం, కామేశ్వరీ దేవి ఆలయం ఇతర దర్శనీయ ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఇక్కడే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుని రుద్ర పుష్కరిణులు ఉన్నాయి. గర్భాలయం ఎదుట ఉన్న పెద్ద నంది దాని ఎదుట ఉన్న చక్కని పుష్కరిణి వీటిని కలిపి ఈ క్షేత్రానికి మహానంది అనే పేరు వచ్చింది. ఈ మహా నందికి 18 కిలోమీటర్ల దూరంలో తొమ్మిది నంది ఆలయాలు కూడా ఉన్నాయి. ఈ తొమ్మిది నంది ఆలయాలను కలిపి నవ నందులని అని అంటారు. కార్తీక మాసంలో సోమవారం రోజున నంద్యాల చుట్టూ కొలువై ఉన్న నవ నందులను దర్శిస్తే సకల పాపాలు తొలగిపోతాయని పెద్దలు చెబుతారు. అలాగే సూర్యోదయం నుండి సూర్యాస్తమయం లోపు ఈ నవ నందులను దర్శిస్తే ఎంతో పుణ్యం లభిస్తుందని, సిరి సంపదలు పెరుగుతాయని.. ఆరోగ్యకరంగా ఉంటారని చాలా మంది నమ్ముతారు. 14వ శతాబ్దంలో నంద మహారాజు కాలంలో ఈ నవ నందుల నిర్మాణం జరిగినట్లు తెలుస్తోంది.

English summary

Unknown Facts About Kurnool Mahanandi Temple in Telugu

Here are the unknown facts about kurnool mahanandi temple in Telugu. Have a look
Desktop Bottom Promotion