For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవాలయం ఏదో తెలుసా... ఆ గుడిలో ఆరో గదిని ఎందుకు తీయలేదంటే...

|

ఈ లోకంలో ఎన్నో రహస్యాలు ఉన్నాయి. అందులోనూ మన దేశంలో చాలా ఎక్కువగా ఉన్నాయి. పూర్వకాలం నుండి నేటి వరకూ దేవాలయాల గురించి చాలా విషయాలు మిస్టరీగానే మిగిలిపోయాయి. అలాంటి వాటి గురించి మనం వింటున్నప్పుడు.. వాటి గురించి తెలిసినప్పటికీ ఎన్నిసార్లు విన్నా కూడా కొత్తగానే ఉంటాయి. ఆ విషయాల గురించి మాట్లాడుతున్నప్పుడంతా మనలో ఏదో తెలియని ఆసక్తి కలుగుతూ ఉంటుంది.

అలాంటి మిస్టరీలో కేరళలోని పద్మనాభ స్వామి ఆలయంలోని చివరి తలుపు ఒకటి. ఈ ఆలయం మన దేశంలోని కేరళ రాష్ట్రంలో ఉంది. ప్రపంచంలోనే అత్యంత ధనిక ఆలయాల్లో ఇదొకటి. ఈ ఆలయంలోని నేలమాళిగల్లో ఆరు రహస్య గదులు ఉన్నాయని, ఇందులో టన్నుల కొద్దీ వజ్ర వైడుర్యాలు, బంగారు ఆభరణాలు, స్వర్ణ విగ్రహాలున్నాయని చరిత్రకారులు కనుగొన్నారు. ఈ సందర్భంగా ఆ ఆలయం గురించి మనం నమ్మలేని నిజాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

Holi 2021 : ఈ ఏడాది హోలీ ఎప్పుడొచ్చింది? ఈ పండుగ వెనుక ఉన్న రహస్యాలేంటో తెలుసా?

ధనిక దేవాలయంగా..

ధనిక దేవాలయంగా..

ఇప్పటికీ ఈ పద్మనాభ స్వామి ఆలయం ప్రపంచంలోనే ధనిక దేవాలయాల్లో ఒకటి ప్రసిద్ధి గాంచింది. ఈ దేవాలయం కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో ఉంది. శ్రీ మహావిష్ణువు 108 దివ్యక్షేత్రాల్లో ఒకటైన ఈ దేవాలయంలో ఆ హరినారాయణుడు శేషపాన్పుపై పవళిస్తున్న రూపాన్ని మనం చూడొచ్చు.

కొన్ని సంవత్సరాల క్రితం..

కొన్ని సంవత్సరాల క్రితం..

కొన్ని సంవత్సరాల క్రితం ఈ దేవాలయం యొక్క నేల మాళిగల్లో బయటపడిన బంగారం వల్ల ఈ దేవాలయం గురించి దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. ఇందులో కొన్ని లక్షల కోట్లు విలువ చేసే సంపద ఉంటుందని అంచనా వేశారు.

పురాణాల ప్రకారం..

పురాణాల ప్రకారం..

పురాణాల ప్రకారం.. ఈ దేవాలయంలో బలరాముడు శ్రీమహా విష్ణువును ఆరాధించినట్లు భాగవతం ద్వారా తెలుస్తోంది. స్వామి వారి గురించి 12 మంది అళ్వారుల్లో ఒకరైన నమ్మళ్ల్వారు అనేక రచనలు కూడా చేశారు. కలియుగ ప్రారంభంలో ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. అయితే ఇది ‘ట్రావెన్ కోర్' కుటుంబ వంశీకుల ఆధీనంలో నడుస్తోంది. వీరే ఈ దేవాలయ వ్యవహారాలను చూసుకుంటారు.

హిందువులకు మాత్రమే..

హిందువులకు మాత్రమే..

ఈ ఆలయంలోకి హిందువులుగా ఉన్నవారికి మాత్రమే ప్రవేశం ఉంటుంది. హిందుత్వాన్ని బలంగా నమ్మడమే కాదు.. ఇక్కడి దేవాలయంలోకి ప్రవేశించే ముందు భక్తులందరూ ఇక్కడి ప్రత్యేకమైన వస్త్ర నిబంధన కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది.

ఒకేసారి చూడలేం..

ఒకేసారి చూడలేం..

ఈ ఆలయంలో స్వామి వారి మూల విరాట్ ను మనం ఒకే చోట నుండి చూడలేం. ఎందుకంటే విగ్రహం పెద్దది కావడం వల్ల మనలం తలను, చేతిని, పాదాలను వేర్వేరు గదుల నుండి చూడాల్సి ఉంటుంది. ట్రావెన్ కోర్ మహారాజు రాజా మార్తాండవర్మ పాలనా సమయంలో వేల సామగ్రామాలతో స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఆ సమయంలో సుమారు 4 వేల మంది శిల్పాకారులు, ఆరు వేల మంది కార్మికులు, వంద ఏనుగులు ఆరు నెలల పాటు శ్రమించి ఈ ఆలయంలో ఎన్నో ఆక్రుతులను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

నేపాల్ నుండి శిలలు..

నేపాల్ నుండి శిలలు..

ఈ ఆలయంలోని శిలలను నేపాల్ దేశంలోని గండకి నది ఒడ్డు నుండి తీసుకొచ్చారని తెలుస్తోంది. పశుపతి నాథ దేవాలయంలో చేసే కొన్ని ప్రత్యేకమైన పూజలకు గుర్తుగా వాటిని అక్కడి నుండి తెచ్చారు. ఇక్కడ కొలువు దీరి ఉన్న శ్రీ పద్మనాభ స్వామిని ‘కటు సర్కార యోగం'తో కప్పబడి ఉంచారు. ఈ ‘కటు సర్కార' యోగం అనేది ఆయుర్వేద పద్ధతుల్లో తయారు చేసిన మిశ్రమం. ఇది ఎప్పుడు ఆ దేవుడిని పరిశుభ్రంగా ఉంచుతుందని చాలా మంది నమ్మకం.

అపారమైన సంపద..

అపారమైన సంపద..

ఈ ఆలయంలోని గదుల్లో అపారమైన సంపద ఉన్నట్లు 2011లో మరోసారి గుర్తించారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఆలయంలోని ఎ, బి, సి, డి, ఇ, ఎఫ్ అనే ఆంగ్ల అక్షరమాల ప్రకారం గదులకు పేర్లు కేటాయించారు. ముందుగా తొలి మూడు గదులను తెరవగా.. అందులో 20 పెద్ద జగ్గులు, బంగారంతో కూడిన ఒక జగ్గు, ఒక బంగారు కలం, 340 వరకు బంగారు జగ్గులు, 30 వెండి దీపాలు, శివుని విగ్రహాలు, ఇతర బంగారు ఆభరణాలను భారీ సంఖ్యలో గుర్తించారు.

వజ్రవైడుర్యాలు..

వజ్రవైడుర్యాలు..

ఈ ఆలయానికి ఉత్తరం వైపున డి, ఆగ్నేయంలో ఎఫ్ గదులను తెరిచారు. ఈ గదుల్లో కూడా అపారమైన బంగారం, వజ్రవైడుర్యాలు భారీగా లభించాయి. వీటి విలువ లక్షల కోట్లలో ఉంటుందని అంచనా వేశారు. దీంతో అప్పటివరకూ దేశంలో అత్యంత ధనిక ఆలయంగా ఉన్న తిరుమలను పద్మనాభ స్వామి ఆలయం వెనక్కి నెట్టింది. అయితే చివరి ద్వారాన్ని మాత్రం తెరవలేదు.

నాగబంధం..

నాగబంధం..

అయితే ఈ ఆలయంలోని చివరి గదిని మాత్రం ఇప్పటికీ తెరవలేదు. ఎందుకంటే ఈ గదికి నాగబంధనం చేసి ఉండటం తెరవటం సాధ్యం కాదని పండితులు చెబుతున్నారు. అయితే ఆ గదిలో మాత్రం ఇప్పటివరకు ఉన్న సంపద కంటే ఎక్కువ సంపద ఉంటుందని అంచనా వేస్తున్నారు. అందుకే అక్కడ ఉండే సంపద మిస్టరీగానే మిగిలిపోయింది.

English summary

Unknown facts about padmanabha swamy temple in Telugu

Here we are talking about the unknown facts about padmanabha swamy temple in Telugu. Read on
Story first published: Wednesday, March 24, 2021, 16:45 [IST]