For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

యాగంటి బసవయ్య ఎన్నెళ్లకు ఒకసారి పెరుగుతాడో తెలుసా...!

యాగంటి బసవయ్య దేవాలయంలో నంది గురించి మనం నమ్మలేని నిజాలను తెలుసుకుందాం.

|

కలియుగాంతంలో కర్నూలు జిల్లాలోని యాగంటిలో ఉండే బసవయ్య (నంది) లేచి రంకెలేస్తుందని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ణానంలో ఉంది. అందులో పేర్కొన్నట్టుగా.. అక్కడ ఉండే నంది రోజురోజుకు కొంత పెరుగుతుందని భక్తుల నమ్మకం.

Unknown facts about yaganti basavayya temple in telugu

ఈ నంది విగ్రహంలో కూడా జీవకళ ఉట్టిపడుతుంది. లేచి రంకెలేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఈ ఆలయంలో దీంతో పాటు మరికొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

20 ఏళ్లకు ఒకసారి..

20 ఏళ్లకు ఒకసారి..

వీరబ్రహ్మం కాలజ్ణానం ప్రకారం, ప్రతి ఇరవై సంవత్సరాలకు ఒకసారి యాగంటిలోని బసవయ్య ఒక అంగుళం పెరుగుతాడు(పొడవు, వెడల్పు, ఎత్తు) అన్ని వైపులా పెరుగుతాడు. ఇలా పెరుగుతూ పోయిన నంది ఇప్పటికే మండపం పరిధిని దాదాపుగా ఆక్రమించేసింది. ఒకప్పుడు ఈ నంది మండం మధ్యలో ఉండి చుట్టూ ప్రదక్షిణ చేసే విధంగా ఉండేదట. ఇప్పుడు పూర్తిగా పెరిగిపోయి స్తంబాలలో స్థలం సరిపోవడం లేదు.

పురావస్తు పరిశోధనల ప్రకారం..

పురావస్తు పరిశోధనల ప్రకారం..

భారతదేశంలోని పురావస్తు శాఖ అధికారులు జరిపిన పరిశోధనల్లో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. 20 సంవత్సరాలకు ఒక్కసారి కేవలం ఒక్క అంగుళం మాత్రమే పెరుగుతోంది. అంటే సంవత్సరానికి ఒక్క మిల్లీమీటర్ చొప్పున నంది ఎదుగుతోంది. అయితే దీని వెనుక ఒక శాస్త్రీయ కారణం కూడా ఉంది. దాని గురించి తెలుసుకోవాలంటే.. ముందుగా రొమెనియాలో పెరిగే రాళ్ల గురించి తెలుసుకోవాలి.

పెరిగే రాళ్లు..

పెరిగే రాళ్లు..

రొమేనియాలోని ఈ రాళ్లు పుట్టిన పిల్లల మాదిరి పెరుగుతూ ఉంటాయి. కొన్ని రోజుల తర్వాత అవి బాగా ఎదిగి తల్లి రాయి నుండి విడిపోతాయి. అవి మళ్లీ కింద పడి పెరుగుతాయి. వాటి ద్వారా మరికొన్ని రాళ్లు ఏర్పడతాయి. అలా రాళ్లు తమ ఉత్పత్తిని చేస్తాయి. అయితే, వీటిలో జీవం ఉండదు. కేవలం రసాయానిక క్రియ వల్లే అది సాధ్యం. అయితే అక్కడి రాళ్లు పెరగాలంటే వర్షాలు కురవాలి.

గాలిలోని తేమతో..

గాలిలోని తేమతో..

ఎండాకాలంలో ఇవి సాధారణంగానే ఉంటాయి. కానీ, వర్షాకాలం వచ్చేసరికి క్రమేణా ఎదుగుదల ప్రారంభమవుతుంది. ఈ రాళ్లలో ఉండే కాల్షియం కార్బొనేట్, సోడియం సిలికేట్ ఎక్కువ పరిమాణంలో ఉంటాయి. వర్షం కురవగానే రసాయనిక చర్య జరిగి రాళ్ల మధ్య చిన్న చిన్న ఖాళీలు ఏర్పడతాయి. ఒత్తిడి వల్ల రాళ్లు క్రమేనా పెరుగుతాయి. అయితే, రొమేనియా రాళ్లలో ఉండే కాల్షియం కార్బొనేట్, సోడియం సిలికేట్ల వల్లే యాగంటి నంది విగ్రహంలో కూడా ఉన్నాయి. కాకపోతే ఇవి తక్కువ స్థాయిలో ఉన్నాయి. అందువల్లే దీని ఎదుగుదల నెమ్మదిగా ఉంటుంది. పైగా ఈ నంది ఆలయంలో ఉండటం వల్ల నేరుగా వర్షంలో తడవదు. కేవలం గాలిలోని తేమను గ్రహించి మాత్రమే రసాయన క్రియకు గురవుతుంది. ఇలాంటి ప్రక్రియ మిగిలిన రాళ్లలో కూడా కనిపిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.

దేవుడి మహిమే..

దేవుడి మహిమే..

ఈ నంది పెరుగుదల వెనుక శాస్త్రీయ కారణాలు చెప్పిన పరిశోధకులు మిగిలిన శివాలయాల్లో నందులు ఎందుకు పెరగడం లేదు అనే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయారు. యాగంటి మాదిరిగానే మిగిలిన నందుల్లో రసాయనిక ప్రక్రియ జరుగుతుందా? అవి ఎదగడానికి కారణాలేంటనే ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం దొరకడం లేదు. అందులోనూ ఆయా నంది విగ్రహాలపై పరిశోధనలు కూడా జరగలేదు. అందుకే, భక్తులు ఇప్పటికీ యాగంటి నంది ఎదుగుదలను దేవుని మహిమగా గట్టిగా నమ్ముతారు.

కాకి కనిపించదు..

కాకి కనిపించదు..

ఈ ఆలయం సమీపంలో ఒక్క కాకి కూడా కనిపించదు. దీనికి కూడా ఓ ప్రత్యేక కారణమే ఉంది. ఇది ఆశ్చర్యకరంగా ఉన్నప్పటికీ ఆశ్చర్యం కలిగిస్తుంది. పూర్వం ఈ ప్రాంతాన్ని దర్శించిన అగస్త్యుడు.. విగ్రహం బొటన వేలు విరగడం వెనుక తన లోపాన్ని తెలుసుకోడానికి తపస్సు చేశాడు. ఈ సమయంలో కాకులు ఆయన తపస్సుకు భంగం కలిగించాయి. దీంతో ఆ ప్రాంతంలో ఒక్క కాకి కూడా కనిపించకూడదని ఆయన శపించారు. అప్పటి నుండి అక్కడ కాకులే కనిపించడం లేదు.

శనీశ్వరుని ప్రతిన..

శనీశ్వరుని ప్రతిన..

పురాతన కాలం నుండి నేటి వరకు ఈ పుణ్యక్షేత్రం శని ప్రభావం లేని ప్రభావవంతమైన క్షేత్రంగా విలసిల్లుతోంది. అప్పట్లో శనీశ్వరుడు తాను ఈ క్షేత్రంలో అడుగుపెట్టనని ప్రతిన బూనాడు. అందుకే ఇక్కడ నవగ్రహాలు అనేవే ఉండవు. అందుకే ఇక్కడ మచ్చుకైనా ఒక్క కాకి కూడా కనిపించదు.

నీరు ఎక్కడి నుండి..

నీరు ఎక్కడి నుండి..

ఈ ఆలయంలో ఉండే కోనేరులోకి నీరు ఎక్కడి నుండి వస్తుందో ఇప్పటికీ తెలియదు. ఏడాదిలో 365 రోజుల పాటు ఇక్కడ నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. అదే నీరు గుడి బయటకు వచ్చిన తర్వాత మాయమవుతుంది. అది ఎక్కడకు వెళ్తుందో తెలియకపోవడం గమనార్హం. అంతేకాదు.. అక్కడ బోర్ వేసిన చుక్క నీరు కూడా పడదట. ఇన్ని మహిమలు ఉన్న ఈ క్షేత్రాన్ని కర్నూలు జిల్లాకు వెళ్తే తప్పకుండా సందర్శించండి. ఇది బనగానపల్లె నుండి ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది.

English summary

Unknown facts about yaganti basavayya temple in telugu

Here we are talking about the unknown facts about yaganti basavayya temple in Telugu. Read on
Story first published:Tuesday, March 30, 2021, 18:10 [IST]
Desktop Bottom Promotion