For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మకర సంక్రాంతి సమయంలో మనం నువ్వులు ఎందుకు వాడతాము

By Gandiva Prasad Naraparaju
|

భారతదేశంలో పెరిగిన చాలామందికి, పండుగతో అనుసంధానించబడి ఒక ప్రత్యేకమైన పండు, కూరగాయ లేదా ఒక పదార్ధం ఉంటుంది. ఇది పండగలకు నిజమైన రుచిని ఇచ్చే ఒక ప్రత్యేక ఆహరం పదార్ధం అని చెప్పటంలో తప్పేమీ లేదు.

ఏ పండుగతో ఏ ప్రత్యేకమైన ఆహార వస్తువుకి అనుసంధానం ఉంది అనేదానిగురించి మనం ఇపుడు మాట్లాడుకుంటున్నాము, ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన మొట్టమొదటి విషయం ఏమిటంటే, ఆ పండుగ జరుపుకునే నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంపై ఆధారపడి ఉంటుంది.

Use of Sesame in Makar Sankranti

పండుగ ఏ సమయంలో లేదా ఏ కాలంలో జరుపుకుంటున్నాము అనేది తరువాత ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే సంవత్సరం పొడవునా అన్నిరకాల ఆహారపదార్ధాలు అందుబాటులో ఉండవు కాబట్టి.

అందువలన, వేసవిలో జరుపుకునే పండుగలకి, ఆ సమయంలో సులభంగా అందుబాటులో ఉండే పండ్లు, కూరగాయలు, పప్పుధాన్యాలు అనుసంధానించబడతాయి.

అలాగే శీతాకాలంలో కూడా ఇదే మంచిది.

మకర సంక్రాంతి పండుగకు నువ్వులు ఎందుకు ప్రధాన అంశంగా ఉంటాయనేది ఖచ్చితంగా చెప్పాల్సిన అంశం. వీటి గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి చదవండి.

నువ్వుల నూనెతో మర్దనా చేయడం

నువ్వుల నూనెతో మర్దనా చేయడం

మకర సంక్రాంతి పండుగ రోజు నదివద్ద సాంప్రదాయ స్నానం ఆచరించక పోతే పూర్తికానట్టు భావించబడుతుంది. ఈ పవిత్ర స్నానం తరువాత, నువ్వులనూనె తో శరీరాన్ని మర్దనా చేసుకోవాలి. దీనివల్ల కేవలం ఉపశమనం పొందడమే కాకుండా శరీరాన్ని పునరుద్ధరించుకుని, శుభ్రపరుచుకోవచ్చు కూడా.

 నువ్వుల సమర్పణ

నువ్వుల సమర్పణ

సాంప్రదాయ రాగి పాత్రలో తయారుచేసే నువ్వులు, బెల్లం మిశ్రమాన్ని పంచకపోతే ఈ పండుగ సంపూర్ణం కాదు. ఈ పనిని బ్రాహ్మలు నిర్వహిస్తారు. మరో ముఖ్యమైన అంశం ‘సుహాగన్’ సమర్పించడం, ఆరోజు వివాహమైన హిందూ స్త్రీలు చేస్తారు. నువ్వులు ఇందులో అంతర్భాగంగా ఉంటాయి.

MOST READ: మకర సంక్రాంతి స్పెషల్ : సంక్రాంతి రోజును ఖచ్చితంగా చేయాల్సిన పనులు..!! MOST READ: మకర సంక్రాంతి స్పెషల్ : సంక్రాంతి రోజును ఖచ్చితంగా చేయాల్సిన పనులు..!!

పవిత్రమైన మంటల్లో నువ్వులను వేస్తారు

పవిత్రమైన మంటల్లో నువ్వులను వేస్తారు

సంప్రదాయంగా జరిగే పవిత్రమైన మంటల్లో నువ్వులను వేయడం అనేది ఒక సంపన్న భవిష్యత్తును సూచిస్తుంది. ఇది వారి అహాన్ని తగ్గిస్తుంది. కాబట్టి, ఈ ప్రత్యేకమైన పండుగరోజు, ఈ ఆచారాన్ని నిర్వర్తిస్తారని నిర్ధారించడమైనది.

ఫేస్ పాక్ లో నువ్వుల ఉపయోగం

ఫేస్ పాక్ లో నువ్వుల ఉపయోగం

ఈ పండుగ తీవ్రమైన శీతాకాలంలో జరుగుతుంది, ఈ కాలంలో చర్మం పొడిబారి పోవడం సహజం. కాబట్టి, ఇంట్లోతయరుచేసిన ఈ నువ్వుల ఫేస్ పాక్ ని మకర సంక్రాంతి పండుగలో ఒక భాగంగా ప్రోత్సహిస్తారు.

ఆహరంలో నువ్వులు

ఆహరంలో నువ్వులు

పళ్ళెంలో నువ్వులు పోసే పద్ధతిలో, గజక్ లేదా రేవరి రూపంలో తయారవుతుంది. ఆరోగ్యకరమైన, పోషక విలువలతో పాటు, ఖచ్చితంగా మీ రుచి మొగ్గలకి కూడా విజ్ఞప్తి చేస్తుంది. అందుకే నువ్వులతో తయారుచేసిన ఆహార పదార్ధాలు వివిధ వయసుల వ్యక్తులచే ప్రేమించబడతాయి.

నువ్వుల దానం

నువ్వుల దానం

పైన చెప్పినట్టు, హిందూ సంప్రదాయం ప్రకారం నువ్వులు చాలా పవిత్రమైనవిగా భావించబడతాయి. కాబట్టి, నువ్వులు దానం చేస్తే, ఇతరులు అదృష్టవంతులు కావాలని కోరుకున్నట్లు నమ్ముతారు. కాబట్టి, ఈ పండుగ రోజు, నువ్వులను బ్రాహ్మలకు లేదా పేదవారికి దానం చేస్తారు.

MOST READ:మకర సంక్రాంతి గురించి మీకు తెలియని 7 ఆశక్తికర విషయాలు !MOST READ:మకర సంక్రాంతి గురించి మీకు తెలియని 7 ఆశక్తికర విషయాలు !

నువ్వులతో ఎర్ర ఆవును పూజించడం

నువ్వులతో ఎర్ర ఆవును పూజించడం

ఈ పండుగ చుట్టూ జరిగే అంశాలలో ఇది ముఖ్యమైన భాగం. హిందువుల నమ్మకం ప్రకారం, ఆవు మద్దతు, సహాయం వల్లే పంటలు బాగా పండుతాయి అనేది బాగా స్థిరపడిన వాస్తవం. ఎందుకంటే దీన్ని దేవుళ్ళతో సమానంగా పూజిస్తారు కాబట్టి. ఎర్ర ఆవుకు నువ్వులు, బెల్లం ఇచ్చే సాంప్రదాయ సమర్పణ లేకపోతే ఈ పండుగ పూర్తికాదు.

English summary

Use of Sesame in Makar Sankranti

Sesame seeds hold a special importance in Sankranti. In North India, using sesame seeds, ladoos are prepared and in South India, sesame seeds are added along with the other ingredients. So read to know more about the significance of sesame seeds in Makara Sankranti.
Desktop Bottom Promotion