For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతికూల శక్తి తొలగిపోవాలంటే ఈ చిట్కాలు పాటించండి...

|

ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి మనసులో మనం అనుకోకుండానే సానుకూల మరియు ప్రతికూల ఆలోచనలు వస్తుంటాయి. మనం ఎంత కోరుకున్నప్పటికీ వాటిని నియంత్రించలేకపోతాం.

అయితే మీ మనసులో సానుకూల ఆలోచనలను మరియు ప్రతికూల ఆలోచనల గురించి తెలియజేయడానికి వాస్తు శాస్త్రం ఉపయోగపడుతుంది. వాస్తు శాస్త్రం అనేది ఒక సూక్ష్మ శక్తి. అది మన జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.

అయితే వాస్తు శాస్త్రం ప్రకారం, మీ ఇల్లు మరియు మీరు పనిచేసే చోట వాతావరణాన్ని సానుకూలంగా ఉంచుకుంటే, మీ మనసు కూడా సానుకూల ఆలోచనలతో నిండి ఉంటుంది. దీని కారణంగా, మన పని మరియు ప్రవర్తన కూడా మనల్ని సానుకూల జీవితం వైపు నడిపిస్తాయి. ముఖ్యంగా వాస్తుకు సంబంధించి కొన్ని చిట్కాలను పాటిస్తే బెటర్ అండ్ పాజిటివ్ లైఫ్ ను మీ సొంతం చేసుకోవచ్చు. ఇంతకీ ఆ చిట్కాలేంటో చూసేయ్యండి మరి...

మిమ్మల్ని ప్రేమించే వారే భాగస్వామి కావాలనుకుంటే... ఈ పరిహారాలను పాటించండి...

ప్రధాన ద్వారం వద్ద..

ప్రధాన ద్వారం వద్ద..

వాస్తు శాస్త్రం ప్రకారం, మీ ఇంట్లోని ప్రధాన ద్వారం శక్తి యొక్క ప్రధాన వనరు. ఈ మార్గం గుండానే మంచి మరియు చెడు శక్తులు ప్రయాణిస్తాయి. మీ ఇంట్లోకి నెగిటివ్ శక్తి రాకుండా ఉండాలంటే, మీ ప్రధాన ద్వారం అతి పెద్దగా ఉండాలి. అలాగే ఇంట్లోని తలుపులను ఎలాంటి శబ్దం లేకుండా పూర్తిగా తెరిచి ఉంచాలి. లోపలి డోర్లను ఎప్పటికీ మూసిఉంచకూడదని గుర్తుంచుకోండి. అలాగే ప్రధాన ద్వారం వద్ద ఎల్లప్పుడు స్వస్తిక్, తోరాణాలు వంటివి అమర్చాలి. దీని వల్ల మనం సానుకూల శక్తిని ఆహ్వానించవచ్చు.

ఇంటి లోపల అలంకరణ..

ఇంటి లోపల అలంకరణ..

మన శరీరంలో ఉండే రక్తకణాలలో ప్రసరించే శక్తి ఉన్నందున, ఇంటి లోపల అలంకరణ మరియు గాలి కూడా మనపై అదే ప్రభావన్ని చూపుతాయి. సాధారణంగా మన శరీరాన్ని మనం ఎలాగైతే కలుషితం కాకుండా కాపాడుకుంటామో.. అదే విధంగా ఇంట్లోని ప్రతి వస్తువులను ఒక క్రమబద్ధంగా ఉంచుకోవాలి. దీని వల్ల మీ ఇంట్లో శక్తి సానుకూలంగా ఉంచేందుకు సహాయపడుతుంది. ఇంట్లో గాలి యొక్క నిరంతర కదలిక, తగిన కాంతి మరియు వాతావరణంలో నుండి వచ్చే సువాసన ఇంట్లో ముఖ్యమైన శక్తి ఉనికిని సూచిస్తాయి.

గాలి కదిలేలా..

గాలి కదిలేలా..

మీ ఇంట్లోకి ప్రవేశించే ప్రతికూల శక్తికి పడకగదిలో మంచానికి చాలా అవినాభవ సంబంధం ఉంటుంది. చాలా మంది ప్రజలు మంచం కింద తయారు చేసిన పెట్టేలో వస్తువులను ఉంచుతారు. చాలా సంవత్సరాలుగా ఉపయోగంలో లేని వాటిని ఉంచడం వల్ల ప్రతికూల శక్తిని మీరు ఆహ్వానిస్తున్నట్లే. అలా కాకుండా మీరు మంచం కింద గాలి వీచడానికి తగినంత స్థలం ఉండేలా చూసుకోవాలి.

ఆ ఆలయంలోని మంటలను ప్రత్యక్షంగా చూస్తే.. పక్షవాతం నయమవుతుందట...!

పాత వస్తువులను..

పాత వస్తువులను..

మీ ఇంట్లో పాత బొమ్మలను మరియు ఇంట్లో ఏవైనా దుమ్ముగా ఉండే వస్తువులను నిల్వ ఉంచినప్పుడు కూడా ప్రతికూల శక్తి వాటిలో పేరుకుపోతుంది. పాత గడియారాలు, సంగీత వాయిద్యాలు, మొబైల్ ఫోన్లు మరియు ఇతర గ్యాడ్జెట్లను ఇంటి వెలుపల ఉంచాలి. లేదా వాటిని పారవేయడం మంచిది. పాత వస్తువుల వల్ల శక్తి కలుషితం అవుతుంది. ఇంకా కొంతమంది ఇళ్లలో బూట్లు మరియు చెప్పులను మంచం కింద ఉంచుతారు. అది కూడా ఇంట్లోని వాస్తు లోపాలను సూచిస్తుంది.

సానుకూల శక్తి కోసం..

సానుకూల శక్తి కోసం..

మీ ఇంట్లో సానుకూల శక్తి ప్రవేశించడానికి మీరు ఇంటికి ఆగ్నేయంలో లేదా వాయువ్యంలో ఉన్న వంటగది ఇంటికి సానుకూల శక్తిని నింపుతుంది. ఏదైనా ఆహారం తయారు చేసేటప్పుడు, ఇంటి లక్ష్మి తన ముఖంతో తూర్పు వైపు ఆహారాన్ని సిద్ధం చేస్తే, మీ ఇంటికి సానుకూల శక్తి ఆ ఆహారం ద్వారా వస్తుంది. అది మీ శరీరంలోకి కలిసిపోతుంది.

ప్రతికూల శక్తి నాశనమయ్యేందుకు..

ప్రతికూల శక్తి నాశనమయ్యేందుకు..

వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతికూల శక్తి మీ ఇంటి వరకు రాకుండా, మీరు మీ ఇంటి ప్రాంగణంలో లేదా బాల్కనీలో చంపా చెట్టును నాటడం వంటివి చేయాలి. ఇది మీ ఇంటికి సానుకూల శక్తిని ఇస్తుంది. అదే సమయంలో మీ ఇంటి నుండి ప్రతికూల శక్తిని కూడా తొలగిస్తుంది. ఇలాంటి చిన్న చిన్న సులభమైన పనులతో మీ ఇంటిని సానుకూల శక్తికి కేంద్రంగా మార్చడం ద్వారా మీరు పురోగతి మార్గంలో పయనించవచ్చు.

English summary

Vastu Tips For Better and Positive life in telugu

Here are the vaastu tips for better and positive life in telugu. Take a look.