Latest Updates
-
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.! -
పంద్రాగస్టు స్పెషల్ స్వీట్..చల్లారినా గట్టిపడని వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
Independence Day 2026: ఆగస్టు 15న ప్రధాని ప్రసంగానికి, జెండా వందనానికి ఎర్రకోటనే ఎందుకు ఎంచుకుంటారో తెలుసా? -
శ్రావణ మాసంలో ఈ ఐదు నక్షత్రాల వారికి తిరుగే ఉండదు.. గోల్డెన్ డేస్ ఆరంభం.! -
ఉదయం నిద్ర లేవగానే ఈ ఒక్క పని చేస్తే చాలు.. ఎన్నో సమస్యలకు చెక్ పెట్టొచ్చు.! -
ఆగస్టు 15న మనకే కాదు.. ప్రపంచవ్యాప్తంగా మరెన్నో దేశాలకు పండుగే..ఈ విషయాలు మీకు తెలుసా? -
పెళ్లయిన కొత్తలో కుర్రాళ్లు గూగుల్‌లో ఎక్కువగా వెతికే విషయాలు ఇవే!
వైకుంఠ ఏకాదశి 2020 : ఈ పర్వదినాన కచ్చితంగా చేయాల్సిన ముఖ్యమైన పనులివే...
ఈరోజు విష్ణువు పూజ చేసే వారు, ఆ స్వామిని జపించే వారు ధ్యానం, ఉపవాసం వంటి సాధనల ద్వారా తమ మనసును ఆ దేవ దేవుడిపై లగ్నం చేయాలి.
శ్రీ మహా విష్ణువు భక్తులకు వైకుంఠ ఏకాదశి చాలా ముఖ్యమైన రోజు. 2020 సంవత్సరంలోని జనవరి నెలలో 6వ తేదీన ఈ వైకుంఠ ఏకాదశి వచ్చింది. సూర్య భగవానుడు ఉత్తర స్థానంలోకి మారే ముందు వచ్చే ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. ఈ పర్వదినాన వైష్ణవ దేవాలయాలల్లో ముఖ్యంగా మన రాష్ట్రంలోని తిరుమల వెంకన్న స్వామిని ఉత్తర ద్వారం నుంచి దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తారు.

ఈరోజున ముక్కోటి దేవతలతో మహా విష్ణువు గరుడ వాహనం అధిరోహించి భూ లోకానికి దిగి వస్తారని, భక్తులకు దర్శనమిస్తారని చాలా మంది నమ్ముతారు. అంతేకాదు లార్డ్ విష్ణువుపై విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ పర్వదినాన కఠినమైన ఉపవాస దీక్షలను ఉండి శ్రీ విష్ణు దేవుడిని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. ఈరోజున ఉపవాసం ఉండి, ద్వాదశి రోజున అన్నదానం చేస్తే ఎంతో పుణ్యం వస్తుందని పండితులు చెబుతారు. ఈరోజు విష్ణువు పూజ చేసే వారు, ఆ స్వామిని జపించే వారు ధ్యానం, ఉపవాసం వంటి సాధనల ద్వారా తమ మనసును ఆ దేవ దేవుడిపై లగ్నం చేయాలి. ఇంతటి ముఖ్యమైన ఈ పర్వదినాన కచ్చితంగా ముఖ్యమైన పనులేంటో ఈ స్టోరీ ద్వారా తెలుసుకుందాం...

హరే క్రిష్ణ మహా మంత్రం...
వైకుంఠ ఏకాదశి రోజున హరే క్రిష్ణ శ్లోకం కనీసం 108 సార్లు జపించాలి.
హరే క్రిష్ణ హరే క్రిష్ణ క్రిష్ణ క్రిష్ణ హరే హరే హరే
హరే రామ హరే రామ రామ రామ హరే హరే
కలియుగంలో ఈ మంత్రాన్ని జపించడం వల్ల మీ మనసు శుద్ధి అవుతుంది. అంతేకాదు మీ జీవితంలోని అన్ని కష్టాల నుండి మీకు ఉపశమనం లభిస్తుంది. అలాగే ఆధ్యాత్మిక పరిపూర్ణతను సాధించడంలో సహాయపడుతుంది.

భగవద్గీత చదవండి...
వైకుంఠ ఏకాదశి రోజునే సాధారణంగా గీత జయంతి వస్తుంది. శ్రీకృష్ణుడు ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క సారాంశంలో అర్జునుడికి సూచించిన రోజు గీత జయంతి . భగవద్గీత చదవడం అనేది కూడా ఆధ్యాత్మిక కార్యకలాపాలలో ఒక పనిగా పండితులు చెబుతున్నారు. ఇందులో శ్రీ క్రిష్ణుడిని కీర్తిస్తూ రెండు రకాల సాహిత్యాలు ఉన్నాయి.

క్రిష్ణ మహిమలు..
అందులో ఒకటి క్రిష్ణుడి మహిమలు గురించి తెలియజేస్తుంది. ఇంకొకటి నేరుగా ఆ ప్రభువు చేత మాట్లాడబడుతుంది. భగవద్గీత గురించి నేరుగా క్రిష్ణుడే మాట్లాడేవాడు కాబట్టి గీతకు, క్రిష్ణుడికి తేడా లేదు.

విష్ణువు లేదా ఆయన అవతరాలను..
వైకుంఠ ఏకాదశి రోజున విష్ణువు ఆలయాన్ని లేదా మీ ప్రాంతంలో దగ్గర్లో ఉండే విష్ణుమూర్తి అవతరాలను సందర్శించాలి. ఈ పర్వదినాన జరిగే వేడుకలో మీరు తప్పకుండా పాల్గొనాలి.

వైకుంఠ ద్వారాల ద్వారా..
ఈరోజున వైకుంఠ ద్వారాలు తెరచుకుంటాయని చాలా మంది భక్తుల నమ్మకం. ఈరోజున శ్రీ మహా విష్ణువు ముక్కోటి దేవతలతో గరుడ వాహనం అధిరోహించి భూ లోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తారని హిందువులు నమ్ముతారు. అందుకే ఈరోజు వైష్ణవ ఆలయాలకు వెళ్లి వైకుంఠ ద్వారం అనే ప్రత్యేక ప్రవేశ ద్వారం ద్వారా స్వామి వారిని దర్శించుకోవాలి. మీ పరిసర ప్రాంతాల్లో విష్ణువు ఆలయం లేకపోతే, ఆయన దశావతారలలో ఏ రూపం ఉన్న ఆలయానికి వెళ్లి ఆ స్వామి వారి దర్శనం చేసుకోవాలి.

ఉపవాసంతో పాటు
ఈరోజున కచ్చితంగా ఉపవాసం ఉండాలి. దీని వల్ల మీ శరీరానికి, మనసుకు చాలా మంచి జరుగుతుంది. అంతేకాదు అనేక ఆధ్యాత్మిక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అలాగే ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు అసత్యం చెప్పకూడదు. చెడు పనులు, ప్రతికూల ఆలోచనలు చేయరాదు. ఈరోజున అన్నదానం చేయాలి. చివరగా ముక్కోటి ఏకాదశి రోజు రాత్రి జాగరణ చేస్తే మీకు సకల శుభాలు కలుగుతాయి.



Click it and Unblock the Notifications