Latest Updates
-
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.!
Varalakshmi Vratam 2022: పరమ పవిత్రమైన వరలక్ష్మీ వ్రతం ఎందుకు చేయాలో తెలుసా..?
పరమ పవిత్రంగా భావించే వరలక్ష్మీ దేవిని ఎందుకు ఆరాధించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
హిందూ సంప్రదాయం ప్రకారం శ్రావణ మాసంలో శుక్ల పక్షం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం చేయడం ప్రతి ఏటా ఆనవాయితీగా వస్తోంది.

తమ ఇంటికి సకల భోగాలు, సంపదలు అందాలని కోరుకుంటూ శ్రీమతిగా ఉండే మహిళలు చేసే వ్రతమే వరలక్ష్మీ వ్రతమే ఇది.

వర అంటే వరాలిచ్చే లక్ష్మీ.. అంటే దేవత అని అర్థం. సిరులిచ్చే దేవతను పూజించే పండుగ కాబట్టే దీనిని వరలక్ష్మీ వ్రతం అని పండితులు చెబుతారు. అయితే శ్రావణ మాసంలోని తొలి శుక్రవారమే ఈ వ్రతం ఎందుకు చేయాలి.. లక్ష్మీదేవి ఈ మాసంలోనే ఎందుకు ఆరాధించాలి.. దీని వెనుక ఉన్న ఆసక్తికరమైన కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం...

అష్టలక్ష్ముల రూపం..
వరలక్ష్మీ వ్రతం రోజున చాలా మంది ఉదయం నుండి ఉపవాసం ఉంటారు. ఈ సందర్భంగా అష్టలక్ష్ములందరూ కలిసిన రూపమైన వరలక్ష్మీ దేవతను పూజిస్తారు. ఇలా పూజించడం వల్ల కుటుంబం మొత్తానికి ఆరోగ్యం, ప్రేమ, చదువు, తెలివి, ఐశ్వర్యం, సంతోషం వంటివన్నీ లభిస్తాయని భక్తులందరూ నమ్ముతారు.

వ్రతం చేస్తే ఏం జరుగుతుంది..
ఈ వ్రతాన్ని ఆచరిస్తే ఏం జరుగుతుందని అనుకుంటున్నారా? అయితే దీని కంటే ముందు వరలక్ష్మీ కథ గురించి తెలుసుకోవాలి. దీని గురించి మనం ఇంతకుముందు ఆర్టికల్ లోనే తెలుసుకున్నాం కదా..

కరుణా కటాక్షలను పొందండి..
అమ్మవారి అలంకరణను విభిన్నంగా చేస్తూ... విశేష పూజలు చేయాలనుకునే వారు ప్రస్తుతం కరోనా కారణంగా అలా చేయలేకపోవచ్చు.

అలా పూజించినా..
ప్రస్తుతం కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా అమ్మవారికి కేవలం కలశం పెట్టుకుని పూజించినా కూడా ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం వంటి వాటితో పాటు సకల శుభాలు కలుగుతాయి. కాబట్టి ప్రస్తుత కరోనా కాలంలో పెద్దగా నియమనిష్టలు పాటించాల్సిన అవసరం కూడా పెద్దగా లేదు. అలా లక్ష్మీదేవిని పూజించి మాత కరుణా కటాక్షలను పొందండి.

ముక్తి లభిస్తుందని..
వరలక్ష్మీ దేవి వ్రతాన్ని శ్రావణ మాసంలో తొలి శుక్రవారమే చేస్తే సకల సౌభాగ్యాలతో పాటు సిరి సంపదలు కలిగి, సుఖజీవనం గడిని ముక్తిని పొందుతారని పండితులు చెబుతున్నారు. అయితే ఈ వ్రతం చేయలేని వారు.. కనీసం ఈ వ్రతం యొక్క కథను విన్నా కూడా ఆయురారోగ్యాలు కూడా సిద్ధిస్తాయని చాలా మంది నమ్ముతారు.



Click it and Unblock the Notifications
