Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
Varalakshmi Vratham 2022:పెళ్లికాని ఆడపిల్లలు వరలక్ష్మీ వ్రతం చేయొచ్చా?
వరలక్ష్మీ వ్రతం 2022:పెళ్లి కాని మహిళలు వరలక్ష్మీ వ్రతాన్ని చేయొచ్చా లేదా అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
హిందు సంప్రదాయం ప్రకారం శ్రావణ మాసం అంటే పండుగల మాసంగా పరిగణిస్తారు. ఈ నెలలో హిందువుల ఇళ్లలో అంతా పండుగ వాతావరణం నెలకొని ఉంటుంది.

తమ కుటుంబ శ్రేయస్సు కోసం మహిళలు అనేక రకాల వ్రతాలు చేస్తుంటారు. ముఖ్యంగా తమ భర్త క్షేమం కోసం చేసే మంగళ గౌరీ వ్రతంతో పాటు కుటుంబం మొత్తం ఐశ్వర్యారోగ్యాలతో జీవించాలని, కష్టాలన్నీ తొలగిపోవాలని కోరుకుంటూ శ్రావణ శుక్రవారం(Friday)రోజున వరలక్ష్మీ వ్రతం జరుపుకుంటారు.

ఈ వ్రతానికి మన తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాధాన్యత ఉంది. పురాణాల ప్రకారం, ఆనందం, ఐశ్వర్యం, సంపద తదితర వాటి కోసం వరలక్ష్మీ వ్రతం రోజున ఉపవాసం పాటిస్తారు. ఈరోజున ఉపవాసం ఉండే వారి ఇంట్లో డబ్బు, ధాన్యంతో పాటు సకల సంపదలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు.

అంతేకాదు ఈరోజున వ్రతం ఆచరించడం వల్ల సరస్వతీ దేవితో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుందని చాలా మంది నమ్ముతారు. అయితే ఈ వ్రతాన్ని కేవలం వివాహం చేసుకున్న మహిళలు మాత్రమే చేయాలని పండితులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో పెళ్లి కాని మహిళలు వరలక్ష్మీ వ్రతాన్ని ఎందుకు చేసుకోకూడదు.. ఎందుకని పెళ్లి కాని మహిళలకు ఈ వ్రతం చేయడాన్ని నిషేధించారనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

వివాహితలకు మాత్రమే..
హిందూ ఆచారాల ప్రకారం, వరలక్ష్మీ వ్రతాన్ని కేవలం పెళ్లయిన మహిళలు మాత్రమే వరలక్ష్మీ వ్రతాన్ని చేయాలని పండితులు చెబుతున్నారు. ఈ వ్రతాన్ని కన్యలుగా ఉండే అమ్మాయిలు చేయడాన్ని నిషేధించారు. ఎందుకంటే వివాహితులు తమ కుటుంబం యొక్క ఆనందం, సంతోషం, శాంతి, శ్రేయస్సు కోసం ఈ వ్రతాన్ని చేస్తారు. ఈ పర్విదినాన వారి కుటుంబంలోని అత్త, భర్త ఇతర కుటుంబసభ్యులకు సేవ చేయడం ద్వారా, లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల ఆదర్శంతమైన మహిళా జీవితాన్ని గడుపుతారు.

కన్యలకు నిషేధం..
పెళ్లి కాని మహిళలకు అత్త, మామ, భర్త, ఇతర కుటుంబ సభ్యులకు సేవ చేసుకునే అవకాశం లేదు కాబట్టి.. మీకు మెట్టినింటితో ఎలాంటి సంబంధం ఉండదు కాబట్టి.. కన్యలుగా ఉండే అమ్మాయిలు ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించకూడదని పండితులు చెబుతున్నారు.

నచ్చిన వారితో..
మరో కథనం ప్రకారం.. శ్రావణ మాసంలో వచ్చే రెండో శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్ని పెళ్లికాని అమ్మాయిలు కూడా చేయొచ్చట. పెళ్లి కాని కన్యలు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల తమ మనసుకు నచ్చిన వారితో పెళ్లి జరుగుతుందని నమ్మకం.

ముత్తైదువులు..
వరలక్ష్మీ వ్రతం చేసేటప్పుడు హిందువుల ఇళ్లన్నీ పండుగ వాతావరణం సంతరించుకుంటాయి. ఈ పవిత్రమైన రోజున లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పూలు, పళ్లు, ప్రసాదాలతో అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారు. ఈ వ్రతం చేసేటప్పుడు మంగళ సూత్రాన్ని పూజలో ఉంచి దాన్ని ధరించడం వల్ల సుఖసంతోషాలు వెల్లివిరిసి.. దీర్ఘ సుమంగళిగా ఉంటారని పండితులు చెబుతారు.

పూజ పూర్తయ్యాక..
వ్రతం సమయంలో నేవైద్యాలు అర్పించి.. చేతికి కంకణం కట్టుకుని.. అక్షింతలు తలపై వేసుకొని పూజను పూర్తి చేయాలి. ఆ తర్వాత ముత్తైదువులందరికీ తాంబూలాలు ఇచ్చి తీర్థ ప్రసాదాలు ఇవ్వాలి. అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని ఆరోజే తినేయాలి. అలాగే రాత్రి వరకూ ఉపవాసం ఉండాలి. ఇంతకన్నా ఈ వ్రతానికి పెద్దగా నియమనిష్టలంటూ ఏమీ లేవని పండితులు చెబుతున్నారు.



Click it and Unblock the Notifications