For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వసంత పంచమి 2020 : చిన్నారులకు ఆ సమయంలో అక్షరాభ్యాసం చేయించాలా?

ఈ పంచమి రోజు నుండి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. పురాణాల ప్రకారం వసంతి పంచమి నాటి నుండి చలి అనేది బాగా తగ్గిపోతుంది.

|

సరస్వతీ మాత కటాక్షం కోసం వసంతి పంచమి నాడు ఆ దేవీ ఆలయాలను ఎందరో హిందువులు దర్శించుకుంటూ ఉంటారు. చాలా మంది తల్లిదండ్రులు తమ చిన్నారులకు ఈ ప్రత్యేకమైన రోజున అక్షరాభ్యాసం చేయిస్తుంటారు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల ప్రజల్లో చాలా మంది బాసరలోని సరస్వతి దేవి ఆలయానికి వెళ్తారు. అంతేకాకుండా మాటలు రాకపోయినా.. మాటలు నత్తిగా వస్తున్నా కూడా ఈ ఆలయానికి వెళ్తే అవన్నీ తొలగిపోతాయని చాలా మంది నమ్ముతారు.

Vasanta Panchami 2020

ముఖ్యంగా సరస్వతీ ఆలయానికి సమీపంలోని గోదావరి నదిలో స్నానం చేసి.. అమ్మవారిని దర్శించుకుని ఆ ఆలయ ప్రాంగణంలో ఒకరోజు నిద్ర చేసి వెళ్తుంటారు. ఇలా చేస్తే మంచి జరుగుతుందని అష్టదశ పురాణాలలో బ్రహ్మవైవక్త పురాణంలో సరస్వతీ దేవి గురించి చెప్పబడింది. దీంతో ఇంకా అనేక వివరాలు చెప్పబడ్డాయి. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈ వసంత పంచమిని శుభప్రదంగా భావిస్తారు. ఇక ఉత్తర భారతంలో వసంత పంచమిని చాలా ఘనంగా జరుపుకుంటారు. అక్కడ అమ్మవారికి పసుపు రంగు వస్త్రాలు ధరింపజేసి, చక్కగా పండుగలా చేస్తారు...

వసంత పంచమి 2020 తేదీలు..

వసంత పంచమి 2020 తేదీలు..

2020, జనవరి 29వ తేదీ నుండి ప్రారంభమవుతుంది. ఈరోజున ఉదయం 10:45 గంటలకు ప్రారంభమై, జనవరి 30 తేదీ మధ్యాహ్నం 1:18 గంటలకు ముగుస్తుంది.

పూజా ముహుర్తం : ఉదయం 10:45 నుండి మధ్యాహ్నం 12:35 గంటలకు ముగుస్తుంది.

సరస్వతీ మాత పూజ..

సరస్వతీ మాత పూజ..

వసంత పంచమిరోజున సరస్వతీ దేవిని ముఖ్యంగా పాఠశాలలు మరియు కళాశాలలతో పాటు అనేక విద్యాసంస్థల్లో పూజిస్తారు. అంతేకాదు అనేక మంది హిందువులు తమ ఇళ్లలో కూడా సరస్వతీ దేవిని పూజిస్తారు. ఈ పూజలు చేయడానికి ముందే ఉదయాన్నే స్నానం చేసి, పసుపు బట్టలు ధరిస్తారు. ఈ పసుపు దుస్తులలో ఆ దేవిని ఆరాధించడం వల్ల తమకు శుభం కలుగుతుందని వారి నమ్మకం. అలాగే సరస్వతీ దేవికి పసుపు రంగులో ఉండే పూలను సమర్పిస్తారు.

సరస్వతీ దేవి మంత్రాలు..

సరస్వతీ దేవి మంత్రాలు..

ఓం సరస్వత్వై నమ:

ఓం మహాభద్రాయై నమ:

ఓం మహా మాయామై నమ:

ఓం వర ప్రదాయై నమ:

ఓం శ్రీప్రదాయై నమ:

ఓం పద్మనిలయాయై నమ:

ఓం పద్మాక్త్వై నమ:

ఓం పద్మవక్త్రగాయై నమ:

ఓం శివానుజాయై నమ:

ఓం పుస్తకథ్రుతే నమ:

ఓం రమాయై నమ:

ఓం పరాయై నమ:

ఓం కామ రూపాయై నమ:

ఓం మహా విద్యాయై నమ:

ఓం మహాపాతకనాశిన్వై నమ:

వివాహం కోసం..

వివాహం కోసం..

వసంత పంచమిని అద్భుత ముహుర్తం అని జ్యోతిష్యశాస్త్రంలో ఉన్నట్లు పండితులు చెబుతున్నారు. ఏదైనా కొత్త పనిని ప్రారంభించడానికి, ఈరోజు చాలా మంచిగా ఉంటుంది. అలాగే వివాహం కోసం కూడా ఈ వసంత పంచమిని ప్రత్యేకంగా పరిగణిస్తారు. ఇంట్లో చేరేందుకు కూడా ఈరోజు చాలా పవిత్రంగా ఉంటుందట. ఈ ప్రత్యేకమైన రోజున పసుపు వంటకం తయారు చేసి, ఇతరులతో పంచుకుంటే మీ జీవితంలో ఆనందం వస్తుంది.

పిల్లల విద్యకు..

పిల్లల విద్యకు..

ఈ వసంత పంచమి నాడు తమ పిల్లలకు విద్య ప్రారంభానికి కూడా చాలా మంది శుభప్రదంగా భావిస్తారు. ఈరోజున చాలా చోట్ల నాలుకలో ఓం తయారు చేసే సంప్రదాయం ఉంటుందట. అందుకే ఈ ప్రత్యేకమైన రోజున పిల్లల తెలివి ఎక్కువగా ఉంటుందని చాలా మంది నమ్ముతారు. అందుకే ఈరోజున చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించాలని పండితులు చెబుతారు.

English summary

Vasanta Panchami 2020: Date, Muhurat Time, Signficance and Rituals

Saraswati Puja is also known as Shri Panchami, Saraswati Panchami and Basant Panchami. Know the auspicious time and date for Saraswati Puja on Vasant Panchami in the year 2020.
Story first published:Tuesday, January 28, 2020, 15:44 [IST]
Desktop Bottom Promotion