For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

vastu tips : ఆగ్నేయాన్ని ఎందుకని ప్రతికూలమైనదిగా భావిస్తారు...

ఒక టాయిలెట్, బెడ్ రూమ్ మరియు ప్రవేశ ద్వారం వంటివి ముఖ్యంగా ఈ దిశలో ఉండకూడదు. అంతేకాకుండా ఈ దిశలో అద్దం అమర్చబడకూడదు. ఈ దిశలో ఉన్న తలుపులు కుటుంబ సభ్యుల మధ్య అసూయా ద్వేషాలకు కారణం కావొచ్చు.

|

ఇంటి ఆగ్నేయ దిశను ప్రతికూల ప్రదేశంగా చెప్పడం జరుగుతుంది. ఈ దిశ ప్రధానంగా అసూయ, ద్వేషం వంటి ప్రతికూల లక్షణాలను కలిగి ఉన్న వ్యక్తులను ఆహ్వానిస్తుందని చెప్పబడింది. ఈ దిశలో ఉన్న వ్యక్తి ఆందోళన మరియు ఉద్రిక్తతలకు లోనవడం జరుగుతుంటుంది. కొన్ని కీలక సందర్భాలలో, ఈ దిశలో ఉన్న వ్యక్తి సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం మరియు విశ్వాసం కోల్పోవడం వంటి ప్రతికూలతలను సైతం ఎదుర్కొనవచ్చు. ఈ దిశను అగ్ని దిశగా కూడా పిలువబడుతుంది, ఈ దిశలో వాస్తు శాస్త్రం సూచించిన ప్రకారం వివిధ రకాల నియమాలు ఉన్నాయి. సరిగ్గా ఉపయోగించిన పక్షంలో, ఈ దిశ కూడా అత్యంత ఉపయోగకరంగా మారగలదు. ఈ దిశలో వాస్తు నియమాల గురించిన జాగ్రత్తలు తప్పనిసరి. కావున మరింత తెలుసుకోవడానికి వ్యాసంలో ముందుకు సాగండి.

తూర్పు దిశకి సంబంధం ఉన్న తలుపులు

అన్ని దిశలు వివిధ రకాల తలుపులుగా (వాస్తు శాస్త్రంలో నైరూప్య తలుపులు) విభజించబడతాయని చెప్పబడింది. తలుపు సంఖ్య 6 మరియు 7 అనేవి ఆగ్నేయ దిశలో ఉంటాయి. ఒక వైపున, ఈ దిశ నిర్ధారణ అనేది, సత్యం మరియు శక్తితో సంబంధం కలిగి ఉంటుంది, మరోవైపు కోపంతో కూడా సంబంధం కలిగి ఉంటుంది. ఈ దిశ భుజాలలో నొప్పికి కారణం అవుతుంది.

ఆగ్నేయ దిశలో వాస్తు సమస్యలు :

ఆగ్నేయ దిశలో వాస్తు సమస్యలు :

ఈ దిశ తీవ్రమైన ఆలోచనలకు కూడా కారణమవుతుంది, పైగా ఆ ఆలోచనలు సత్ఫలితాన్ని కూడా ఇవ్వలేవు. అందువల్ల ప్రతికూల ప్రభావాల పరంగా దీనిని ఆందోళనల తలుపుగా కూడా చెప్పడం జరుగుతుంటుంది. ఈ దిశ నుండి వచ్చిన ప్రతికూల ప్రభావాల వలన చేసే పనిలో కూడా సమస్యలు ఏర్పడతాయి. అవి వృత్తిపరమైన సమస్యలు మరియు తోటి ఉద్యోగులతో విభేదాలు వంటి వాటికి దారి తీస్తుంది. క్రమంగా ఉద్యోగం కూడా త్యజించవలసిన పరిస్థితులు నెలకొంటాయి.

అంతేకాకుండా కొన్ని ప్రతికూలతలు, ప్రధానంగా ఆర్థికపరమైన, మరియు వృత్తిపరమైన సమస్యలకు సంబంధించినవిగా ఉంటాయి., అనగా ఆశించిన ఉద్యోగం లభించకపోవడం, చేసే ఉద్యోగం సంతృప్తిని ఇవ్వకపోవడం వంటివిగా ఉంటాయి. ఆరోగ్యపరంగా గుండె జబ్బులు మరియు నిరాశ వంటి హృదయ సంబంధిత తీవ్ర పరిస్థితులకు కూడా దారితీస్తుంది. భార్యా భర్తల మద్య వివాదాలకు కూడా కారణమవుతుంది, కొన్ని సందర్భాలలో, విడాకులు లేదా అక్రమ సంబంధాల వంటి భయంకరమైన పరిణామాలకు కూడా దారితీయవచ్చు.

 ఆగ్నేయ దిశలో వాస్తు సంబంధిత సమస్యలు ఉన్న ఎడల :

ఆగ్నేయ దిశలో వాస్తు సంబంధిత సమస్యలు ఉన్న ఎడల :

ఒక టాయిలెట్, బెడ్ రూమ్ మరియు ప్రవేశ ద్వారం వంటివి ముఖ్యంగా ఈ దిశలో ఉండకూడదు. అంతేకాకుండా ఈ దిశలో అద్దం అమర్చబడకూడదు. ఈ దిశలో ఉన్న తలుపులు కుటుంబ సభ్యుల మధ్య అసూయా ద్వేషాలకు కారణం కావొచ్చు. ఈ దిశలో నిద్రపోవడం వలన మత్తుపదార్థాలు, మద్యపానం లేదా లైంగికపరమైన వ్యసనాలకు దారితీయవచ్చు.

ఈ ప్రదేశం నుండి విస్తరించబడిన లేదా కత్తిరించబడిన భూమి స్థలం నిరుపయోగంగా పరిగణించబడుతుంది. అంతేకాకుండా, ఆందోళనలను మరియు సందేహాలకు దారితీస్తుంది. అదేవిధంగా, ఈ దిశలో ఉన్న గదిని కూడా బార్యా భర్తలు పంచుకోరాదు. లేనిచో, వారి మధ్య అభిప్రాయ భేదాలు రావచ్చు. ఇంట్లో ఈ దిశలో ఒక వాలు (స్లోప్) కూడా ఉండకూడదు.

 ఆగ్నేయ దిశలో వాస్తు ప్రణాళిక :

ఆగ్నేయ దిశలో వాస్తు ప్రణాళిక :

ఈ దిశలో ఒక వాషింగ్ మెషీన్, మిక్సర్ వంటి యంత్రాలను ఉంచవచ్చు. కామధేనువు చిత్రాన్ని ఉంచడం ద్వారా ప్రతికూలతలు ఏర్పడకుండా జాగ్రత్తపడవచ్చు. ఇది సంపద పెరుగుదలకు కూడా కారణమవుతుంది. ఈ దిశలో గోడలు లేదా గదులు, క్రీమ్ లేదా ఆకుపచ్చ రంగులో పెయింట్ చేయబడి ఉంటే ఇది పవిత్రమైనదిగా భావించబడుతుంది.

కుందేళ్ళను ఉంచడం

కుందేళ్ళను ఉంచడం

ఈ దిశలో ఒక జంట కుందేళ్ళను ఉంచడం కూడా పవిత్రమైనవిగా భావిస్తారు. ఏది ఏమైనా దిశలో ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం మాత్రం ఎన్నటికీ సరైనది కాదు. అంతేకాకుండా, పని కోసం ఏర్పాటు చేసిన కుర్చీ మరియు టేబుల్ యొక్క కూడా అసమర్థ నిర్ణయంగా భావించబడుతుంది. ఈ స్థలంలో స్టోర్ రూమ్ మరియు షూ -రాక్ వంటివి ఉంచడం కూడా ఉత్తమమైనదిగా చెప్పబడుతుంది.

Most Read :గరుడ పురాణం ప్రకారం వాళ్ల ఇళ్లలో అన్నం తినకూడదు, వ్యభిచారిణి, దొంగలు ఇలా చాలా మంది ఇళ్లలో తినొద్దుMost Read :గరుడ పురాణం ప్రకారం వాళ్ల ఇళ్లలో అన్నం తినకూడదు, వ్యభిచారిణి, దొంగలు ఇలా చాలా మంది ఇళ్లలో తినొద్దు

 మీకు నచ్చినట్లయితే

మీకు నచ్చినట్లయితే

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, వాస్తు సంబంధిత, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, ఆరోగ్య, జీవనశైలి, మాతృత్వ, శిశు సంబంధ, ఆహార, లైంగిక, వ్యాయామ, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

Vastu Shastra: Why South East Direction Is Considered Inauspicious

Why South East Direction Is Considered Inauspicious
Desktop Bottom Promotion