For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం దేవాలయ నీడ ఇంటి మీద పడితే మంచిదా? కాదా?

|

మనలో చాలా మంది వాస్తుశాస్తాన్ని ఫాలో అవుతారు. అయితే ప్రస్తుత ఆధునిక కాలంలో కేవలం కొందరు మాత్రమే వీటిని నమ్ముతున్నారు. కానీ కొత్తగా ఇల్లు కట్టించేవారు మాత్రం వాస్తు శాస్త్రం నియమాలను, పద్ధతులను తూచ తప్పకుండా పాటిస్తారు.

వాస్తు ప్రకారమే.. ఇల్లు నిర్మించడం.. ఇంట్లో వస్తువులను సెట్ చేసుకోవడం వంటివి చేస్తుంటారు. ఇలా చేస్తే ఆర్థిక పరంగా.. ఆరోగ్య పరంగా ఎలాంటి సమస్యలు ఉండవని నమ్ముతారు.

ఇదిలా ఉండగా.. మీ ఇల్లు దేవాలయానికి సమీపంలో ఉందా? అలా ఉన్నప్పుడు ఆ గుడి నీడ మీ ఇంటి మీద పడితే మంచిదా.. కాదా అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

శ్రావణ మాసం: ఇష్టార్థ సిద్ధి కోసం శివుడికి ఏ పుష్పం సమర్పించాలి?

గుడి లోపల..

గుడి లోపల..

మన చుట్టుపక్కల ఏ దేవాలయాన్ని చూసినా.. దేవాలయం లోపల చూసినా దైవిక వాతావరణం, ఆలయంలో గంట మరియు భజనల యొక్క శ్రవ్యమైన శబ్దం, ధూపదీపాలు, కర్రల తాజా సుగంధ వాసన ఈ ఆహ్లాదకరమైన కారకాలన్నీ మనలో సానుకూల శక్తిని పెంపొందిస్తాయి.

గుడి దగ్గర గూడు..

గుడి దగ్గర గూడు..

మనలో చాలా మంది ఏదైనా దేవాలయానికి సమీపంలో ఇంటిని కట్టుకోవాలని భావిస్తూ ఉంటాం. ఎందుకంటే ఇది సానుకూలతను వ్యాప్తి చేస్తుంది మరియు మన జీవనోపాధిలో ఆనందాన్ని ఇస్తుంది కానీ అది పూర్తిగా నిజం కాదు. వాస్తు శాస్త్రం ప్రకారం, గుడి దగ్గర ఇల్లు కొనడం వల్ల లేదా నిర్మించడం వల్ల ప్రతికూలమైన ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు.

ప్రతికూల ఫలితాలు..

ప్రతికూల ఫలితాలు..

వాస్తు శాస్త్రం ప్రకారం, పవిత్ర స్థలానికి సమీపంలో ఇంటికి నిర్మించడం లేదా మీరు నివసించడం వంటివి చేయొద్దని పండితులు సూచిస్తున్నారు. ఎందుకంటే మీరు ఎప్పుడైనా అనారోగ్యానికి గురైనప్పుడు లేదా మీ కుటుంబ సభ్యులకు ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పుడు లేదా కుటుంబ వివాదాలు వంటివి ఎక్కువగా జరుగుతాయట. మీరు ఆలయ సమీపంలో నివసించడం వల్ల మీకు సానుకూలం కంటే ప్రతికూల ఫలితాలే ఎక్కువగా ఉన్నాయట.

Shravana Amavasya 2021: శ్రావణ అమావాస్య ఎప్పుడు? ఈ అమావాస్య ప్రత్యేకతలేంటి?

గుడి నీడ పడితే..

గుడి నీడ పడితే..

వాస్తు శాస్త్రం ప్రకారం, మీ ఇంటి ముందు ఆలయం ఉంటే - మీ ఇంటిపై గుడి నీడ పడితే, అది మీకు ప్రతికూల ఫలితాలను తీసుకొస్తుంది. ఒకవేళ మీ ఇల్లు అలా ఉంటే మాత్రం మీరు ఆ దేవాలయంలోకి ప్రతిరోజూ వెళ్లి దేవుళ్లకు సంబంధించిన ప్రార్థనలు చేసేలా చూసుకోండి.

ప్రసాదం పంపిణీ..

ప్రసాదం పంపిణీ..

మీర ప్రతిరోజూ దేవాలయానికి వెళ్లడంతో పాటు ప్రతి అమావాస్య మరియు పౌర్ణమి రోజున దేవుడికి ప్రత్యేక నైవేద్యం సమర్పించాలి. అలాగే ప్రసాదాన్ని ప్రజలకు పంపిణీ చేస్తే మీకు సానుకూల ఫలితాలు వస్తాయి. మీరు దేవాలయానికి కొంచెం దూరంగా నివసిస్తుంటే, అది మీ బృహస్పతిని బలంగా చేస్తుంది. దీని వల్ల మీకు ప్రయోజనకరంగా ఉంటుంది.

మనసుపై ప్రభావం..

మనసుపై ప్రభావం..

గంటలు మరియు శంఖాలు మోగించే శబ్దం ఆలయం చుట్టూ వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది. సుగంధ ద్రవ్యాల సువాసన గుడి కాంప్లెక్స్ లోపల పర్యావరణాన్ని సానుకూలంగా ప్రభావితం చేస్తుంది. ఈ సానుకూల శక్తి ప్రవాహం మనం ఆలయంలోకి ప్రవేశించిన వెంటనే మన మనస్సుపై నేరుగా ప్రభావం చూపుతుంది.

Shravan Somvar : శ్రావణ సోమవారం 2021: తేదీలు, వ్రత నియమాలు మరియు ప్రాముఖ్యత

కొన్ని గ్రంథాలలో..

కొన్ని గ్రంథాలలో..

ఒక వ్యక్తి దేవాలయం లేదా ఏ ఇతర మతపరమైన స్థలానికి సమీపంలో తన ఇంటిని నిర్మించకుండా 'దేవ-వేద్' నుండి తప్పించుకోవాలని వివిధ మత గ్రంథాలలో సిఫార్సు చేయబడింది. దేవాలయాల దగ్గర తమ ఇళ్లను నిర్మించుకునే వ్యక్తులు ఆర్థిక సమస్యలతో బాధపడరు, కానీ వారు కొన్ని వ్యాధులతో బాధపడొచ్చు. మీరు ఒక శివాలయం సమీపంలో మీ ఇంటిని నిర్మిస్తే మీరు అదే పరిణామాలను ఎదుర్కోవచ్చు. మీరు ఒక జైన దేవాలయం సమీపంలో మీ ఇంటిని నిర్మించాలని ఎంచుకుంటే, మీ ఇల్లు దాని వైభవాన్ని కోల్పోవచ్చు.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

మీరు మీ ఇంటిని భైరవ్/కార్తికేయ/ బలి దేవుని ఆలయం లేదా దేవత ఆలయం సమీపంలో నిర్మిస్తే, కుటుంబ సభ్యుల మధ్య ఊహించని వివాదాలు తలెత్తడం వల్ల మీరు మీ కుటుంబ జీవితం బాగా దెబ్బతింటుంది. కాబట్టి వీలైనంత మేరకు దేవాలయం నుండి దూరంగా ఉండాలి మరియు ఇల్లు నిర్మించేటప్పుడు దేవాలయ సముదాయం నుండి ఎలాంటి రాళ్లు లేదా నిర్మాణ సామగ్రిని ఉపయోగించకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

English summary

Vastu Tips For a House Near a Hindu Temple in Telugu

Here we are talking about the vastu tips for a house near a hindu temple in Telugu. Have a look
Story first published: Friday, August 6, 2021, 14:38 [IST]