శనిదేవుని వాహనాలు మరియు అవి మీ రాశిచక్రంపై చూపే ప్రభావాలు

Written By: ChaitanyaKumar ARK
Subscribe to Boldsky

శనిదేవుని లార్డ్ ఆఫ్ జస్టిస్ గా పిలుస్తారు. అతను శని గ్రహం యొక్క రాజు. అతను ఒక మనిషి యొక్క గత జన్మల కర్మ ఫలితాలను నిర్ణయిస్తాడు. ఈ మద్దతు ఒక వ్యక్తికి అపారమైన విజయాన్ని తెచ్చినా, అతని ప్రతికూల ప్రభావాలు ఒకేసారి పూర్తిగా నాశనం చేయవచ్చు. అయితే, అనేక సార్లు, శని గ్రహం యొక్క ప్రభావo సాధించిన ఫలితాలు అతను ఒక రాశిచక్రంలో ప్రవేశించినప్పుడు, అతను స్వారీ చేసిన వాహనం మీద కూడా ఆధారపడి ఉంటుంది. శని దేవుని యొక్క ఏడు వాహనాలను శని చాలిసాలో పేర్కొన్నారు. అయితే, నిజానికి అవి తొమ్మిదిగా ఉన్నాయి.

ఇక్కడ, మేము శనిదేవుని వాహనాలను మరియు వాటిపై స్వారీ చేస్తూ ఒక రాశిచక్రంలో ప్రవేశించినప్పుడు కలిగే ప్రభావాల గురించి వివరించడం జరిగినది.

గాడిద :

గాడిద :

శని దేవుని వాహనంగా గాడిద ఉంటే, ఇది చాలా దురదృష్టకరమైనదిగా భావించబడుతుంది. ఇది ఒక వ్యక్తి జీవితంలో అనేక సమస్యలకు దారితీస్తుంది. అతను జీవితంలో చిన్న విషయాలకు కూడా అధికంగా పోరాటం చేయవలసి ఉంటుంది. ఏ విషయంలో అయినా విజయం అతనికి సులభంగా రాదు. ఒక్కోసారి విజయం అందని ద్రాక్ష పండుగానే ఉంటుంది.

గుర్రం :

గుర్రం :

గుర్రం శని దేవుని యొక్క వాహనం అయితే, ఇది చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. గుర్రం పురోగతికి చిహ్నంగా ఉంటుంది. ఈ సమయంలో వ్యక్తి సానుకూల శక్తి కలిగి మరియు అతని మేధస్సు ద్వారా శత్రువులను ఓడించడంలో విజయం దిశగా అడుగులు వేయగలుగుతాడు. అనేక ప్రతికూల సమస్యలు తొలగి, సానుకూల పవనాల దిశగా జీవితం సాగుతుంది.

ఏనుగు :

ఏనుగు :

శని దేవుని వాహనాలలో ఏనుగు అత్యంత అననుకూలమైనది(దురదృష్టం) గా చెప్పబడింది. కష్టపడి పనిచేసినప్పటికీ వ్యక్తి ఆశించిన ఫలితాలను సాధించలేడు. అందువలన అతను జీవితంలో అత్యధిక సాధన చేయాలి. ఓర్పు, సహనం ఎక్కువగా ఉండాలి, లేనిచో నిరాశా నిస్పృహలకు కేంద్ర బిందువుగా మారుతాడు.

ఎద్దు :

ఎద్దు :

శని దేవుని వాహనం ఎద్దుగా ఉంటే మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. అందువలన, జాగ్రత్త వహించాలి మరియు తీసుకునే నిర్ణయాల యందు అప్రమత్తతతో మెలగాలి. మిశ్రమ ఫలితాలు అనగా, ఒక్కోసారి అనుకూలమైనవిగా ఉంటే ఒక్కోసారి అననుకూలంగా ఉంటాయి.

సింహం :

సింహం :

శనిదేవుని వాహనం సింహమైతే అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. సింహం విజయం యొక్క స్వరూపoగా ఉంటుంది. అందువలన వ్యక్తి బలమైన శక్తి, నిర్భయత మరియు శక్తితో కూడిన ప్రయోజనాన్ని పొందుతాడని తెలుపబడినది. శని దేవుడు సింహ వాహన దారుడై ఉన్నప్పుడు, విజయానికి ఎటువంటి అవరోధాలు ఉండవు. ఎటువంటి క్లిష్ట పరిస్థితులనైనా ధైర్యంగా ఎదుర్కొని ముందుకు దూకే తత్వo అలవడుతుంది. తద్వారా ఆశించిన ఫలితాలు మీ సొంతమవడమే కాకుండా మీకు సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలను కూడా తెచ్చిపెడుతుంది.

నక్క :

నక్క :

నక్క మీద వాహన దారుడైన శని దేవుడు జన్మ కుండలిలో ప్రవేశించినట్లయితే, అది వ్యక్తికి చాలా అనర్హమైనదిగా భావిస్తారు. ఇది అతని జీవితంలో వివిధ రకాల హెచ్చుతగ్గులకు దారితీస్తుంది. మరియు అసంతృప్తి , ఉద్రిక్తతల వంటి ప్రతికూల ప్రభావిత అంశాలకు దారితీస్తుంది. ఉత్తమ ప్రయత్నాలు ఉన్నప్పటికీ, ఆశించిన ఫలితాలను పొందలేకపోవచ్చు. అందువల్ల అటువంటి సమయాల్లో మానసిక అప్రమత్తత తోడై, చురుకుదనంతో వ్యవహరించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా నక్క వాహన దారుడై జన్మ కుండలిలో ఉన్నప్పుడు, చేతిదాకా అందివచ్చిన వస్తువు నేలపాలయ్యే సమస్యలను ఎక్కువగా చవిచూడవలసి ఉంటుంది. మానసిక ప్రశాంతత కరువై, కుటుంబ సమస్యలకు కూడా దారి తీస్తుంది. సంఘoలో పేరు ప్రఖ్యాతలు కూడా సన్నగిల్లుతాయి. కావున సత్వర పరిష్కార మార్గం దృష్ట్యా మంచి జ్యోతిష్య నిపుణుని సంప్రదించుట మేలు.

కాకి :

కాకి :

శనిదేవుని నిజ వాహనం కాకి, వ్యక్తి జీవితంలో చాలా ఉద్రిక్తతలను, ప్రతికూల ప్రభావాలను సూచిస్తుంది. జీవితంలో వృత్తిపరమైన సమస్యలు మాత్రమే కాకుండా కుటుంబ జీవితం కూడా ప్రతికూలంగా ప్రభావితమవుతుంది. ఇంట్లో ఉద్రిక్తతలు వ్యక్తి యొక్క మానసిక అశాంతికి కారణం కావొచ్చు. మరియు వ్యక్తి తన లక్ష్య సాధనలో పని యందు అనేక సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది. అందువల్ల, ప్రశాంతతను కోల్పోవడం సర్వసాధారణం. కావున మంచి జ్యోతిష్య నిపుణుని సంప్రదించి, సరైన శాశ్వత పరిష్కార మార్గాల దృష్ట్యా సూచనలు తీసుకోవడం మంచిది.

నెమలి :

నెమలి :

నెమలి వాహన దారుడైన శనిదేవుడు జన్మ కుండలి నందు ప్రవేశించిన ఎడల అత్యంత పవిత్రమైనది గా చెప్పబడుతున్నది. ఇది వ్యక్తి యొక్క అన్ని కోరికలను నెరవేరుస్తుంది. ముఖ్యంగా అదృష్టం వరించడం, ఆర్ధిక అవసరాలు తీరడం, ఆరోగ్య సమస్యలు తొలగిపోవడం వంటివి సానుకూల అంశాలకు కేంద్ర బిందువుగా మారుతారు. మీ పనికి తగ్గ గుర్తింపు లభిస్తుంది. మేధస్సు మరియు సానుకూల దృక్పథం ద్వారా, ఎటువంటి క్లిష్ట పరిస్థితులనైనా చక్కగా పరిష్కరించగలిగే శక్తి ఆ వ్యక్తి సొంతమవుతుంది. శని దేవుని యొక్క ఆశీర్వాదం వ్యక్తి జీవితంలోని అన్ని రంగాలలో విజయం చేకూరుస్తుంది.

హంస :

హంస :

శని దేవుడు హంస వాహన దారుడై జన్మ కుండలిలో ప్రవేశించినప్పుడు, అతను వ్యక్తి యొక్క జీవితంలో మంచి విషయాలను తీసుకుని రాగలడు. హంస శనిదేవుని అన్ని వాహనాలలోనూ అత్యంత పవిత్రమైనదిగా చెప్పబడినది. ఎంతోకాలంగా పరిష్కారం కాని సమస్యలన్నీ తొలగిపోయి, పరిష్కార మార్గాలు కనిపిస్తాయి. అన్ని రకాల సమస్యలు తొలగి, భవిష్యత్తు మార్గాలకు సానుకూల ద్వారాలు తెరచుకుంటాయి. జీవితంలో ఆర్దిక , సామాజిక, కుటుంబ సమస్యలు దరికి రాకుండా చూడడo , తద్వారా సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరగడం సర్వసాధారణంగా ఉంటుంది.

English summary

Vehicles Of Shani Dev & Their Effects On The Zodiac

Riding on which vehicle Shani Dev enters a zodiac, also determines the good or bad results. While a donkey, elephant, jackal, crow as the vehicle of Shani Dev, are considered inauspicious in the life of the person, horse, lion, peacock and swan are considered very auspicious. A bull gives mixed results. Therefore, the birth chart must be analyzed well.
Story first published: Wednesday, May 16, 2018, 16:30 [IST]