For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వినాయక చవితి వ్రతం : వ్రతవిధానం, లాభాలు

|

వినాయక చవితి వ్రతం ప్రతి నెలా శుక్ల మరియు కృష్ణ పక్షం నాల్గవ రోజున వస్తుంది. క్రమంగా హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి నెలలో రెండు వినాయక చవితులు వస్తుంటాయి. కృష్ణ పక్షం సమయంలో వస్తున్న వినాయక చవితిని సంకష్ట హర చతుర్ధిగా పిలవడం జరుగుతుంది. అదేవిధంగా శుక్ల పక్షం సమయంలో వచ్చే చతుర్ధిని, వినాయక చతుర్ధిగా పిలవడం జరుగుతుంటుంది. మరియు ఈరెండింటిలో ప్రత్యేకంగా, వినాయక చవితి రోజున భక్తులు ఉపవాస దీక్షను అనుసరించడం గమనించవచ్చు.

క్రమంగా ఒక సంవత్సరంలో పన్నెండు వినాయక చతుర్థులు ఉన్నాయి. ఈ వినాయక చతుర్థిలలో ప్రత్యేకించి, ఒకదాన్ని ప్రసిద్ధమైన ఉత్సవంగా చేయడం జరుగుతుంటుంది. మిగిలిన వినాయక చతుర్దిలు ఉపవాస దీక్షను అనుసరించే రోజులుగా గమనించవచ్చు. వినాయక చవితి ఉపవాస దీక్ష కొరకు పాటించవలసిన విధివిధానాలను ఇక్కడ పొందుపరచడం జరిగింది. మరిన్ని వివరాలకోసం వ్యాసంలో ముందుకు సాగండి.

ఫిబ్రవరిలో వినాయక చవితి వ్రతం తేదీ సమయం :

ఫిబ్రవరిలో వినాయక చవితి వ్రతం తేదీ సమయం :

ఫిబ్రవరిలో వినాయక చవితి వ్రతం 8 ఫిబ్రవరిన వస్తుంది. భాద్రపద శుద్ధ చతుర్థి నాడు వస్తున్న ఈ పవిత్రమైన రోజున, పూజా వేళలుగా ఉదయం 11.30 నుండి మద్యాహ్నం 1.41 వరకు ఉండనుంది. మరియు ఫిబ్రవరి 22 న సంకష్ఠ హర చతుర్ధి రానుంది. అదేవిధంగా మార్చిలో వినాయక చవితి వ్రతం 10 వ తేదీన వస్తుంది.

వినాయక చవితి వ్రతం విధి విధానాలు :

వినాయక చవితి వ్రతం విధి విధానాలు :

భక్తులు వేకువజామునే లేచి బ్రహ్మ ముహూర్తం సమయంలో స్నానం చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత ఎరుపు రంగు దుస్తులను ధరించడం ఆనవాయితీ. త్వరగా నిద్రలేయడం వలన, కేవలం వినాయకుడు మాత్రమే కాకుండా, దేవతలందరి ఆశీర్వాదాలు పొందే యోగ్యత లభిస్తుందని చెప్పబడింది. అంతేకాక బ్రహ్మ ముహూర్తంలో మేల్కొనడం ఆలోచనా శక్తిని, మంచి ఏకాగ్రతను ఇవ్వగలదని చెప్పబడింది.

గణేశుని విగ్రహ ప్రతిష్ఠ :

గణేశుని విగ్రహ ప్రతిష్ఠ :

పూజ జరిగే ప్రదేశంలో గణేశుని విగ్రహాన్ని స్థాపించడం ఎంతో ముఖ్యమైన అంశంగా ఉంటుంది. విగ్రహాన్ని ఏ లోహంతో అయినా (బంగారం, వెండి, రాగి, జింక్, మొ. లేదా మట్టితో కూడా) తయారు చేయవచ్చు. ఉపవాసం ప్రారంభించాక, గణపతి విగ్రహానికి పూజ చేసి, హారతిని అందివ్వవలసి ఉంటుంది. వినాయకుడికి కుంకుమ సమర్పించడం తప్పనిసరి. పూజ జరిగే సమయంలో ఓం గం గణపతయే నమః మంత్రోచ్చారణను అనుసరించాలి.

Most Read : ఇప్పుడన్నీ శారీరక ప్రేమలే, డబ్బు కోసం ఏర్పడే ప్రేమలే, వాలెంటైన్‌ డేన మాత్రమే ప్రేమనా

వినాయక చవితి నైవేద్యం :

వినాయక చవితి నైవేద్యం :

గణపతి భగవానునికి నైవేద్య సమయంలో 21 దర్భలను సమర్పించవలసి ఉంటుంది. అంతేకాకుండా, గణేషునికి ఇష్టమైన లడ్డూలను 21 సంఖ్యలో నైవేద్యంగా అందివ్వవలసి ఉంటుంది. అందులో 5 లడ్డూలను ఒక పూజారికి దానం చేయడం ముఖ్యం. వినాయకుని విగ్రహం ముందు 5 లడ్డూలను ఉంచి, మిగిలిన వాటిని ప్రసాదంగా భక్తులకు పంపిణీ చేయడం మంచిది.

వినాయక చవితి నాడు గణేశ స్తోత్ర పారాయణం

వినాయక చవితి నాడు గణేశ స్తోత్ర పారాయణం

వినాయక చవితి నాడు గణేశ స్తోత్ర పారాయణం, అథర్వశీర్ష, సంకట నాశక స్తోత్ర పారాయణం తప్పనిసరి. ఒక పూజారిని అతిథిగా ఆహ్వానించండి, మరియు దక్షిణ సమర్పించండి. (సాధారణంగా డబ్బు లేదా సరుకులను ఇవ్వడం జరుగుతుంది). వ్రతం పూర్తయ్యాక, సాయంత్రం పూటగా భోజనం చేయడం లేదా రోజు మొత్తం ఉపవాసం ఆచరించి, మరుసటి రోజు ఆహారాన్ని తీసుకోవడం చేయవచ్చు. ఏది ఏమైనా ఆరోగ్యాన్ని అనుసరించి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. వ్రతం జరిగిన సాయంత్రం వినాయక చవితి కథ, గణేశ స్తుతి, శ్రీ వినాయక సహస్రనామావళి, గణేశ చాలీసా, గణేశ నామావళి, లేదా ఓం గణేశాయ నమః అను మంత్ర జపాన్ని అనుసరించవచ్చు.

వినాయక చవితి వ్రతం వలన కలిగే ప్రయోజనాలు :

వినాయక చవితి వ్రతం వలన కలిగే ప్రయోజనాలు :

గణేశుడు ఎల్లప్పుడూ తన భక్తులను అదృష్టంతో మరియు జ్ఞానముతో ఆశీర్వదిస్తాడని నమ్మబడింది. క్రమంగా ఈరోజున వ్రత దీక్షను పాటించే వారిని శ్రేయస్సుతో ఆశీర్వదిస్తాడని చెప్పబడింది. ఈ ఉపవాసం ఆచరిస్తున్న బాలికలు వివాహ సంబంధిత ప్రతికూలతలను దూరం చేసుకోగలరని కూడా భక్తుల విశ్వాసం. మరిన్ని వివరాలకు మీ ఆలయ పూజారిని సంప్రదించండి.

Most Read : మాంసాహారాన్ని ఆ రోజుల్లో అస్సలు తినకూడదు, మన పూర్వీకులు తీసుకొచ్చిన అద్భుతమైన సంప్రదాయం

మీకు నచ్చినట్లయితే

మీకు నచ్చినట్లయితే

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆద్యాత్మిక, జ్యోతిష్య, సౌందర్య, ఆరోగ్య, జీవనశైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, మాతృత్వ, శిశు సంబంధ, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

Vinayaka Chaturthi Vrat Benefits and Vrat Vidhi

There are twelve VInayaka Chaturthis in a year. One of these Chaturthis is observed as a very popular festival. All the other Chaturthis are observed as fasting days. Given below, are the further details required for the Vinayaka Chaturthi fast. Take a look.