For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Vrishabha Sankranti 2021: వృషభ సంక్రాంతి విశిష్టత ఏంటి.. ఆ రోజున ఏం చేస్తే విశేష ఫలితాలొస్తాయి...!

|

హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం 12 సంక్రమణాలు ఉంటాయి. వాటినే మాస సంక్రమణలు లేదా రాశి సంక్రమణలు అంటారు. ఇలా సూర్యుడు వృషభ రాశిలో ప్రవేశించే రోజునే వృషభ సంక్రాంతి అంటారు.

Vrishabha Sankranti 2021 Date, Story, Rituals & Significance

ఈరోజు ఎంతో పవిత్రమైనదిగా చాలా మంది హిందువుల నమ్మకం. ఈరోజు సూర్యభగవానుడిని ఆరాధించడం, జపించడం, దానం చేయడం వంటివి చేస్తే శుభఫలితాలొస్తాయట. ఈరోజు మీరు ఎవరికైనా దాహం ఉన్న వారికి నీరు దానం ఇస్తే.. ఒక వ్యక్తి యజ్ణం చేయడంతో సమానమట.

Vrishabha Sankranti 2021 Date, Story, Rituals & Significance

ఇదిలా ఉండగా.. ఈ ఏడాది సూర్యుడు వృషభంలోకి ఎప్పుడు ప్రవేశిస్తున్నాడు.. ఈ సమయంలో ఏమి చేస్తే ప్రత్యేక ప్రయోజనాలు కలుగుతాయి.. అసలు వృషభ సంక్రాంతి కథేంటి..

Vrishabha Sankranti 2021 Date, Story, Rituals & Significance

ఈ సంక్రాంతి రోజున ఎలాంటి ఆచారాలు పాటించాలి.. ప్రాముఖ్యత ఏంటి, వృషభ సంక్రాంతి విశిష్టత ఏంటి అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Vaisakha Amavasya 2021: వైశాఖ అమావాస్య ప్రత్యేకతలేంటో తెలుసా...Vaisakha Amavasya 2021: వైశాఖ అమావాస్య ప్రత్యేకతలేంటో తెలుసా...

వృషభ సంక్రాంతి ఎప్పుడు?

వృషభ సంక్రాంతి ఎప్పుడు?

సూర్యుడు మేష రాశి నుండి వృషభ రాశిలోకి ఈ నెల 14వ తేదీన ప్రవేశించనున్నాడు. అక్కడే సుమారు నెల రోజుల పాటు జూన్ 20వ తేదీ వరకు ఉంటాడు. ఆరోజునే వృషభ సంక్రాంతి పండుగ జరుపుకోనున్నారు. అంతేకాదు ఇదే రోజు పరశురాముని జయంతి, అక్షయ త్రుతీయ కూడా వచ్చాయి. దీంతో ఈరోజుకు ఎంతో ప్రత్యేకత ఏర్పడింది.

తీర్థయాత్రతో సమానం..

తీర్థయాత్రతో సమానం..

పురాణాల ప్రకారం, సూర్యదేవుడు ఆత్మ, గౌరవం, ఉన్నత స్థితి మొదలైన వాటికి కారకంగా పరిగణిస్తారు. వృషభ సంక్రాంతి రోజున పవిత్రమైన గంగా నదిలో లేదా ప్రవహించే నీటిలో స్నానం చేస్తే తీర్థయాత్రతో సమానంగా ఫలితం వస్తుందట. అలాగే ఈరోజున సూర్య భగవానుడిని భక్తిశ్రద్దలతో ఆరాధిస్తే.. జపం చేస్తే మరియు దానధర్మాలు చేస్తే ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయట.

Akshaya Trititya 2021: అక్షయ తృతీయ రోజున ఈ మంత్రాలు పఠిస్తే.. లక్ష్మీదేవి కటాక్షం గ్యారంటీ...!Akshaya Trititya 2021: అక్షయ తృతీయ రోజున ఈ మంత్రాలు పఠిస్తే.. లక్ష్మీదేవి కటాక్షం గ్యారంటీ...!

వృషభ యాణం అంటే ఏమిటి?

వృషభ యాణం అంటే ఏమిటి?

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రతి నెల తన దిశను మార్చుకుంటూ ఉంటాడు. ఇలా సూర్యుడు ఒక రాశి నుండి మరో రాశిలోకి ప్రవేశించడాన్ని సంక్రాంతి అంటారు. అదే సమయంలో సూర్య భగవానుడు మేషం నుండి తన ఆధిపత్య రాశిచక్రంలోకి అంటే వృషభంలోకి ప్రవేశించే సమయాన్నే వృషభ సంక్రాంతి అంటారు. ఈ సమయంలో వాతావరణంలో కూడా మార్పులు సంభవిస్తాయి.

వృషభ సంక్రాంతి ప్రాముఖ్యత..

వృషభ సంక్రాంతి ప్రాముఖ్యత..

వృషభ సంక్రాంతి రోజున సూర్యుని ఆరాధన, జపం, తపస్సుతో పాటు పేదలకు దానధర్మాలు చేస్తే విశేష ఫలితాలు వస్తాయి. ఈ నెలలో దాహం వేసిన వ్యక్తికి నీరు ఇవ్వడం ద్వారా లేదా ఇంటి బయట పానీయం వేయడం వంటివి చేస్తే, అది ఒక వ్యక్తి యజ్ణం చేయడానికి సమానం. ఈరోజున ‘‘ఓం నమో భగవతే వాసుదేవాయ'' మంత్రాన్ని విధిగా జపించాలి. ఇలా చేయడం వల్ల మీకు శుభ ఫలితాలు వస్తాయి.

తీవ్రమైన వేడి..

తీవ్రమైన వేడి..

వృషభ సంక్రాంతి సమయంలో సూర్యుడు రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించి, అక్కడే 15 రోజుల పాటు ఉంటాడు. ఈ సమయంలో తొలి తొమ్మిది రోజుల పాటు తీవ్రమైన వేడి ఉంటుంది. ఈ తొమ్మిది రోజులను ‘నవతాప' అంటారు. ఈ తొమ్మిది రోజులలో ఏ విధమైన వర్షం లేదా చల్లని గాలి వంటివి లేకపోతే, భవిష్యత్తులో మంచి వర్షం కురుస్తుందని చాలా మంది నమ్ముతారు.

English summary

Vrishabha Sankranti 2021 Date, Story, Rituals & Significance

Here we are taking about the vrishabha sankranti 2021 date, story, rituals & significance. Read on
Story first published:Wednesday, May 12, 2021, 10:57 [IST]
Desktop Bottom Promotion