For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ జీవితంలో సానుకూలతను నింపుకోవడానికి ఐదు ఉత్తమ మార్గాలు!

|

ఉరుకుల పరుగుల గజిబిజి జీవితంలో, సంతోషంగా ఉండే స్వేచ్ఛను కూడా కోల్పోయామేమో అని కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది. మన కొరకు మనం సమయం వెచ్చించకపోవడమే దీనికి కారణమా? లేదా ప్రతికూల స్పందనలు అనుకూల స్పందనలను అధిగమిస్తున్నందునా? కారణం ఏది అయినా, మీరు సంతోషంగా ఉండటానికి మీరు పాటించదగిన సులభమైన చిట్కాలు ఇక్కడ మీకు అందిస్తున్నాం. ఒక లుక్కేయండి!

1. ఇతరుల ఆనందంలో మీ ఆనందాన్ని కనుగొనండి:

1. ఇతరుల ఆనందంలో మీ ఆనందాన్ని కనుగొనండి:

సంతోషంగా ఉండటం కొరకు ఇప్పటి వరకు కనుగొన్న అత్యుత్తమ పద్ధతుల్లో "ఇవ్వడం" ఒకటి. ఇది అనుకూలత వైపు మనం వేసే మొట్టమొదటి చిన్న అడుగు. పిల్లవాడిని లేదా వృద్ధులను రోడ్డుని దాటించడం మొదలుకుని, బిచ్చమెత్తుకునే పేద పిల్లవాడికి భోజనాన్ని పెట్టించడం లేదా భోజనం చేసే సమయంలో మీతో పాటు, కొత్తగా మీ కార్యాలయంలో అడుగుపెట్టిన సహోద్యోగిని మీతో పాటు తినడానికి ఆహ్వానించడం, ఇలా రాసుకుంటూ పోతే ఈ జాబితా మీకు కావలసినంత చిన్నదిగా లేదా పెద్దదిగా మార్చుకోవచ్చు. వీటి వెనుక ఉన్న ఒకే ఒక్క ఆలోచన ఎదుటి వ్యక్తి యొక్క ముఖం మీద ఒక చిరునవ్వు తీసుకురావడమే! సులువుగా చెప్పాలంటే, చిరునవ్వు ఒక అంటువ్యాధి వంటిది, కనుక పేద పిల్లవాడికి మీరు ఆహారం అందించేటప్పుడు, మీకు తన నవ్వును కానుకగా ఇస్తాడు. మీరు అప్పుడు కలిగే ఆనందాన్ని తట్టుకోలేరు. ఆ సమయంలో మీరు మీ బాధను మర్చిపోయి ఆనందంగా ఉంటారు.

 2. ప్రపంచంను మరియు మిమ్మల్ని మీరు ప్రశంసించుకోవడం ప్రారంభించండి:

2. ప్రపంచంను మరియు మిమ్మల్ని మీరు ప్రశంసించుకోవడం ప్రారంభించండి:

మీరు సానుకూలంగా భావనలు పొందాలనికుంటే, దాని కొరకు వెలుపల వెతక్కుండా మీలోనే శోధించుకోండి. మన ఆలోచనలే మన మాటలుగా మారతాయి మరియు మాటలు నెమ్మదిగా పనులుగా మారతాయి. ఈ చర్యలు నెమ్మదిగా మన వ్యక్తిత్వాన్ని మారుస్తాయి. అనుకూలత మన లోపల నుండి ప్రారంభమవ్వాలి. బాహ్యప్రపంచం చాలా అందమైనది. మనలోని ప్రతికూలతల వలన దానిని చూడలేకపోతున్నాము. మీరు మీ ఇంటికి సమీపంలో ఉన్న తోటలోని పువ్వుల అందమును ఆస్వాదించినప్పుడు, లేదా సైకిల్ తొక్కడానికి ఒక పసివాడి చేష్టలను చూసి నవ్వుకున్నప్పుడు లేదా మీరు అస్సలు ఇష్టపడని వ్యక్తి లోని మంచి లక్షణాలను గుర్తించటానికి ప్రయత్నించినపుడు, మీలో ప్రతికూలత తొలగి సానుకూల ప్రకంపనలు ప్రవేశిస్తాయి. మీరు ప్రపంచాన్ని ఒక అందమైన ప్రదేశంగా చూడటం మొదలుపెట్టినప్పుడు, దానిలోని అందం, మీకు ఆనందం కలిగిస్తుందని గ్రహిస్తారు.

3. వాస్తవికంగా ఉండే లక్ష్యాలను నిర్ధారించుకోండి:

3. వాస్తవికంగా ఉండే లక్ష్యాలను నిర్ధారించుకోండి:

వాస్తవ దూరంగా ఉండే లక్ష్యాలు మనలో దుఃఖానికి కారణమని మీరు ఎప్పుడైనా గుర్తించారా? ఉదాహరణకు, ఈ వారం మీరు రెండు పుస్తకాలు చదవాల్సి వచ్చింది. మీరు మొదటి రెండు రోజుల్లోనే వాటిని చదవాలని నిర్ణయించుకుంటారు, కానీ మీరు దానిని సాధించలేకపోవచ్చు. ఇది మీకు విచారాన్ని కలిగిస్తుంది. కనుక చిన్నవిగా మరియు వాస్తవికంగా ఉండే లక్ష్యాలను ఏర్పరుచుకోండి.

దీని కొరకు మీరు మీ లక్ష్యంను మార్చుకోనవసరం లేదు, కానీ సాధించడానికి మీరు ఎన్నుకున్న మార్గాన్ని మార్చుకోవాలి. ఒక పెద్ద లక్ష్యాన్ని సాధించడానికి, కొన్ని చిన్న మైలురాళ్లను ఏర్పరుచుకుంటే, ఇది మీరు వాటిని చేరుకున్నప్పుడల్లా మీలో స్ఫూర్తిని పెంచుతుంది. చిన్న చిన్న విషయాలలో ఆనందం వెతుక్కోవడం వలన జీవితం మరింత సంతోషంగా ఉంటుంది. లక్ష్యాన్ని నిర్దేశించుకోవడమే కాదు, దానిని సాధించినప్పుడు మనకు ఎనలేని సంతోషం కలుగుతుంది. దీనికై మీ సాధనకు వీలైన లక్ష్యాన్ని ఎన్నుకోవడం నేర్చుకోవాలి. అంతేకాక, మీ సామర్థ్యాలను మీరు అర్థం చేసుకోవాలి. కాలక్రమేణా, శిక్షణతో మన సామర్థ్యం ఖచ్చితంగా పెరుగుతుంది. ఎవరో చెప్పినట్లుగా, రోమ్ నగరాన్ని కూడా ఒక రోజులో నిర్మించలేదని గుర్తుపెట్టుకోండి.

4. ప్రతి రోజు ఏదో ఒక కొత్త విషయం తెలుసుకోండి:

4. ప్రతి రోజు ఏదో ఒక కొత్త విషయం తెలుసుకోండి:

కొత్త విషయాలను నేర్చుకోవడం వలన మన మనస్సును ఎప్పుడూ బిజీగా ఉంటుంది. ఇది మనం ప్రతికూల అనుభవాలను మరచిపోయేలా చేస్తుంది. ఒక మనిషి తన చుట్టూ ఉండే అనుకూల వాతావరణాన్ని గుర్తించనంత వరకు, వారి మెదడు ప్రతికూల అంశాల గురించి మాత్రమే ఆలోచిస్తుంది. మెదడు సానుభూతి చెందుతుండటం ఎందుకు అంటే, మెదడు విషయాల యొక్క ఇతర వైపు చూడటం లేదు. మన మెదడు ప్రతి విషయంలో ప్రతికూలతలు వెతకడానికి అలవాటు పడిపోయింది. కనుక మనము మన మెదడుకు ఇదివరకు ఎరగని, ఏదైనా కొత్త విషయం నేర్చుకుంటున్నప్పుడు, దీర్ఘ-కాలంగా మన వైపు తొంగిచూడని సానుకూల స్పందనలు, మనలో ప్రవేశిస్తాయి.

5. మీలా ఉండే మంచి మరియు చెడులను మీరు అంగీకరించండి

5. మీలా ఉండే మంచి మరియు చెడులను మీరు అంగీకరించండి

మనని మనం ప్రేమించుకోవడమే సానుకూల దృక్పథం వైపుగా మనం వేసే ప్రధాన మరియు ప్రాథమిక అడుగు. మీరు అందమైన వారైనా కాకపోయినా, పొడవైన వారైనా కాకపోయినా, నేర్పరులైనా కాకపోయినా, నిజమైన మీరు అలానే ఉంటారు. మిమ్మల్ని మీరే అంగీకరించుకోలేకపోతే, ఎవరూ మిమ్మల్ని అంగీకరించలేరు. మీరు కావాలనుకుంటే, మిమ్మల్ని మీరు మార్చుకోండి. కానీ అంతకు ముందు నుండే, మీలో ప్రతి అంశాన్ని మీరు అంగీకరించి ప్రేమించండి. మనము మనపట్ల సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే ఇతరులను సంతోషపరచగలము.

English summary

Ways To Fill Yourself With Positivity

Positivity is the basic need of a happy and fulfilling life. But at times one gets into the trap of negativity and small acts might help you get your real self back. Starting with bringing happiness to the face of a person, you should start loving yourself as well as showing trust in your relationships.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more