శనిగ్రహ దోష నివారణకు ఏం చేయాలి..?

By Sindhu
Subscribe to Boldsky

నవగ్రహాలలో ఏడవ వాడైన శనీశ్వరుడు సూర్యభగవానునికి ఛాయాదేవికి కలిగిన కుమారుడని శాస్త్రాలు చెబుతున్నాయి. నిజానికి శని భగవానుడిని మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాలనుంచి గట్టెక్కించే కళంకములేని కరుణామూర్తి శనీశ్వరుడని పండితులు అంటున్నారు.

మనలో చాలామంది కళ్యాణ దోషం, కాలసర్ప దోషం, దుష్టమానవుల దృష్టి దోషాలు, వాస్తుదోషాలు, నవగ్రహ దోషాలు - ఇలా అనేక రకాల దోషాలతో బాధపడుతుంటారు. గ్రహల్లో శని ప్రభావం చాలా ఎక్కువ, శని దోషం ఉన్నవారు సుఖశాంతులు లేకుండా బాధపడుతుంటారు. శని దోషం వల్ల ఏవో కష్టనష్టాలు పట్టి పీడిస్తుంటాయి. శని దోషం నుండి బయట పడేందుకు దేవాలయాల్లో అర్చకులు ఉపశాంతి చేస్తుంటారు. నవగ్రహారాధన, ప్రత్యేకంగా శని గ్రహారాధన సూచిస్తుంటారు. శని గ్రహ పూజలతో పాటు, శని ధ్యానం చేసినా దోష నివారణ అవుతుంది.

Ways To Get Rid Of Shani Mahadasha

READ MORE:ఏ రాశి అబ్బాయితో మ్యారేజ్ లైఫ్ సంతోషంగా ఉంటుంది ?

శని అంటే నవగ్రహాలలో ఒక అతి ముఖ్యమైన గ్రహం. జాతకంలో శని సంబంధిత నక్షత్రాలు అంటే 'పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర. ప్రతి ఒక్కరి జాతకంలో ఈ ఏల్నాటి శని, అర్ధాష్టమ, అష్టమ శనులు వస్తూ వుంటాయి. వాటి ప్రభావాన్ని చూపెడుతుంటాయి. వారి కర్మానుసారం (వారి వారి జన్మలగ్నాలను బట్టి) ప్రతి ఒక్కరూ ఎంతో కొంత శని వలన బాధలు పడుతుంటారు. అయితే పరిహారాలు సక్రమంగా చేసుకొని, క్రమ శిక్షణాయుతమైన జీవనాన్ని గడిపి, 'శని''గాడు అని ఎవర్నీ దూషించకుండా వుంటే చాలా వరకు ఇబ్బందులు అధిగమించవచ్చు.

మనిషికి అనుకోని చిక్కులు, ఇబ్బందులు, టెన్షన్స్‌ అన్నీ కూడా శని వల్ల జరుగుతా యి. మనసులలో జోక్యం, అనారోగ్యా లు, చేద్దామనుకున్నన పనులన్నీ వాయిదాలు పడటం మానసిక శాంతి అన్నీ శని దేవుని ఘనతే అని చెప్పాలి. ప్రతి చోట ప్రతి వారితో ఏదో రూపంలో మోసపోవటం, నష్టపోవటం, మానసిక ఘర్షణ అన్నిటికీ సూత్రధారి. ఏలినాటి శనిలో ముఖ్యంగా జన్మ శని, వ్యయ శని, ద్వితీయ శనిలో దాదాపుగా 2 1/2 సం చొప్పున 7 1/2 సం శని వుండటం వలన ఖర్చులు, చిక్కులు, అవమానాలు, బంధుమిత్రులతో విద్వేషాలు, 'నా' అన్న వారితో వైరాలు, మంచికెడితే చెడు ఎదురవ్వటం, అప్పులు, హాస్పిటల్‌ దర్శనాలు ఇలా అనేకరకమైన ఇ్బందులు.

READ MORE:శరీరానికి ఎనర్జీ ఎలా వస్తుంది ? చక్రాలకు, ఎనర్జీకి సంబంధమేంటి ?

అర్ధాష్టమ, అష్టమ శనులు నడి చేటపుడు కార్యాల యందు అసంతృప్తి, మోకాలు, స్పాండిలైటిస్‌, నరాలు మొదలైన ఇబ్బందులు (దంతరోగాలు కూడా), ఇష్టం లేని ప్రదేశాలకి వృత్తిపరమైన మార్పులు, వైరాగ్యం, అనుకోని పరిచయాల వల్ల వూహించని పరిణామాలు, మనసు అంతా వెలితి... ఏదో పోగొట్టుకున్న భావన. అంతా వున్నా... అందరి మధ్యవున్న, మంచి హోదా ఉన్నా తెలీని ఆందోళన, అసంతృప్తి, వేదన. మరి ఆ శనిని సంతృప్తి పరచటానికి మార్గాలు చాలా అవసరం.

శనిగ్రహ దోష పరిహార మార్గాలు:

1. నీలం:

1. నీలం:

శని వల్ల ‘నీలం' ధరిస్తే ఇబ్బందులు అధిగమించవచ్చు అనుకోవటం సరి కాదు. పూర్తి జాతకం చూపించుకున్నాక, అవసరమైతే తప్పక ధరించాలి.

2. ఉదయం నడక సాగించాలి :

2. ఉదయం నడక సాగించాలి :

శని శ్రమ కారకుడు కావున సోమరితనాన్ని విడనాడి ప్రతిరోజు ఉదయాన్నే మార్నింగ్ వాక్ చెయ్యాలి. సాద్యమైనంతవరకు వాహనాలను వాడకుండా నడక ద్వారా పనులు చేసుకుంటే మంచిది.

3. నువ్వుల నూనె:

3. నువ్వుల నూనె:

శనివారం రోజు శరీరం మొత్తానికి నువ్వులనూనె వ్రాసుకొని కొంత సమయం తరువాత వేడి నీటితో స్నానం చెయ్యాలి.

4. తడికాళ్ళతో నిద్రవలదు:

4. తడికాళ్ళతో నిద్రవలదు:

తడికాళ్ళతో నిద్రించరాదు.పరిసరాలను పరిశుబ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా పూజ గది, బెడ్రూం, పరిశుభ్రంగా ఉండాలి. సుఖవంతమైన నిద్ర కోసం బెడ్రూంలో నీలం బల్బు బెడ్ లైట్ వేసుకోవాలి.

5. చీమలకు ఆహారం :

5. చీమలకు ఆహారం :

శ్రమ జీవులు అయిన చీమలకు తేనే గాని చెక్కెర గాని వెయ్యాలి. ఆవుకి బెల్లంతో కలిపిన నువ్వులను తినిపియ్యాలి. నల్ల కుక్కలకి, కాకులకి ఆహారం వెయ్యాలి.

6. మెడిటేషన్:

6. మెడిటేషన్:

ప్రతిరోజు కొంత సమయం మంత్రోపాసన చెయ్యాలి. మెడిటేషన్ చేస్తూ గాలి పీల్చటం,వదలటం చేస్తే వాయు కారకుడు అయిన శని తృప్తి పడతాడు. ముసలివాళ్ళకి, మానసిక వికలాంగులకి, పశుపక్షాదులకి సహాయం చెయ్యాలి. సేవకులను అకారణంగా దూషించకూడదు.

7. కాళికాదేవి లేదా శివున్ని :

7. కాళికాదేవి లేదా శివున్ని :

శని స్తోత్రం, శని చాలిసా, శని అష్టాత్తర, సహస్రనామ స్తోత్రం పారాయణ చాలా మేలు. అమావాస్య రోజున కాళీ స్తోత్రం చదువుకోవాలి.ఇనుముతో చేసిన శివలింగాన్ని గాని, కాళికాదేవిని గాని పూజించాలి. ఏడమచేతి మద్యవేలికి గుర్రపు నాడా రింగ్ దరించాలి. అయ్యప్ప దీక్ష దారణ చెయ్యటంగాని, అయ్యప్ప భక్తులకు భోజనం పెట్టటంగాని చెయ్యాలి.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Ways To Get Rid Of Shani Mahadasha

    To overcome all these bad effects of Shani Mahadasha, there are a few effective remedies which you can try out. These remedies may not completely help in getting rid of the Mahadasha.
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more