వారఫలాలు - ఏప్రిల్ 29 నుంచి మే 5 వరకు

Posted By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

మంచి చెడులు జీవితంలో భాగమే. భవిష్యత్తు ఎలా ఉండబోతోందో అన్న విషయంపై ఆసక్తి ఉండటం మానవసహాజం. ఆస్ట్రాలజీ అనేది భవిష్యత్తులో జరగబోయే విషయాలపై ఒక అంచనాను అందించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.

ఇక్కడ ప్రతి రాశికి చెందిన వారఫలాలు అందిస్తున్నాం. ఏప్రిల్ 29 నుంచి మే 5 వ తారీఖు వరకు రాశిఫలాలలను తెలుసుకోండి ఇక్కడ.

Weekly Predictions for each Zodiac sign 29th April to 5th May-

మేషరాశి: మార్చ్ 21 - ఏప్రిల్ 20

ఆర్థికంగా పురోగతిని సాధించేందుకు అవసరమైన ప్రణాళికలను మీరు సిద్ధం చేసుకోవచ్చు. రియల్ ఎస్టేట్ లో లేదా స్పెక్యులేటివ్ ఇన్వెస్ట్మెంట్స్ లో అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు. అలాగే, కేవలం వర్క్ మీదే కాన్సంట్రేట్ చేయడం మానేసి అప్పుడపుడు కుటుంబం అలాగే మిత్రులతో సమయాన్ని స్పెండ్ చేయడం వలన మీకు కాస్తంత రిలీఫ్ లభిస్తుంది. మీ భాగస్వామితో మంచి మూమెంట్స్ ను మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. అయితే, అతిగా వాగ్దానాలను చేయకపోవటం మంచిది. గుండె సమస్యలు ఉన్నవారు ఆహారం విషయంలో శ్రద్ధ వహించాలి.

వృషభ రాశి: ఏప్రిల్ 21 - మే 21

ఉన్నత చదువులు చదువుతున్న వారికీ అలాగే వివిధ సంస్కృతుల గురించి తెలుసుకుంటున్న వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతూ ప్రకృతిని ఆరాధించడం ద్వారా కాస్తంత రిలీఫ్ ను పొందగలుగుతారు. ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండడంతో బాలన్స్ ని మెయింటెయిన్ చేయగలుగుతారు. లేదంటే, మీ భాగస్వామి మీ పై అసంతృప్తిని వెళ్లగక్కే ప్రమాదం కలదు. తల్లిదండ్రుల దీవెనలను అందుకోవడం ద్వారా ఎటువంటి అవాంతరాలను లేకుండా పనులను పూర్తి చేసుకోగలుగుతారు. ఆరోగ్యం బాగుంటుంది.

మిథున రాశి: మే 22 - జూన్ 21

మీ వర్క్ ప్లేస్ లో మీ క్రియేటివిటీ ని వ్యక్తీకరించగలిగే అవకాశం మీకు సమృద్ధిగా లభిస్తుంది. ఈ అవకాశాన్ని వినియోగించుకోవడమనేది మీ చేతుల్లోనే ఉంది. స్నేహితుల ప్రభావంతో ఎక్కువగా డబ్బును ఖర్చు చేస్తే ఆ తరువాత ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొనే సూచనలు కలవు. వర్క్ ప్లేస్ లో ఒక కొలీగ్ పట్ల మీరు ఆకర్షణకు గురయ్యే అవకాశం ఉంది. అయితే, ఇది ఏ మాత్రం మంచిది కాదన్న విషయాన్ని మీరు గమనించాలి. వివాహితులు తమ భాగస్వామికి ఏదైనా గిఫ్ట్ ను ఇవ్వడం ద్వారా వివాహ జీవితంలోని కొత్త స్పార్క్ ను జోడించగలుగుతారు. సీజనల్ అలర్జీలు మిమ్మల్ని తాత్కాలికంగా ఇబ్బందికి గురిచేయవచ్చు.

కర్కాటక రాశి: జూన్ 22 - జులై 22

పెర్సనల్ లైఫ్ ని అలాగే ప్రొఫెషనల్ లైఫ్ ని బాలన్స్ చేసే క్రమంలో ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. అయితే, పని ఒత్తిడి గురించి భాగస్వామితో చర్చించడం వలన వారి నుంచి సహకారం అందే అవకాశాలు కలవు. ఆర్థికంగా ఈ వారం బలంగానే ఉంటారు. కొత్త ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ కలిసి వస్తాయి. షాపింగ్ లో మీరు విచ్చలవిడిగా డబ్బును ఖర్చుపెట్టే అవకాశం ఉంది కాబట్టి కొంతకాలం పాటు షాపింగ్ ను అవాయిడ్ చేయడం మంచిది. స్పెషల్ గా ప్లాన్ చేసిన డేట్ తో మీ భాగస్వామిని సర్ప్రైజ్ చేయడం మంచిది. తద్వారా, వారిలోని రొమాంటిక్ సైడ్ ను మీరు ఆస్వాదించగలుగుతారు. ఈ వారంలో హెల్త్ ప్రాబ్లెమ్స్ అనేవి మిమ్మల్ని ఇబ్బందిపెట్టవు.

సింహరాశి: జులై 23 - ఆగస్ట్ 21

వర్క్ లో మీరు పడే కష్టం ఇప్పుడిప్పుడే మంచి ఫలితాన్ని ఇవ్వడం ప్రారంభిస్తుంది. కాస్తంత విరామం తీసుకుని రిలీఫ్ ను పొందటం మంచిది. వర్క్ కి సంబంధించిన ఆర్థిక విషయాలు మిమ్మల్ని ఇబ్బందులలోకి నెట్టే ప్రమాదం ఉంది. కాబట్టి ఫైనాన్షియల్ అడ్వైజర్ సూచనలను పాటించడం మంచిది. ఫ్యామిలీని ఎక్స్టెండ్ చేసే విషయం గురించి మీ భాగస్వామి మీతో చర్చించే అవకాశం ఉంది. వారి ఆలోచనలను తెలుసుకోండి. ఆరోగ్యపరంగా, సరైన సప్లిమెంట్స్ ను తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం వలన అన్ని రకాల ఆరోగ్యసమస్యలు తొలగిపోతాయి.

కన్యారాశి: ఆగస్టు 22 - సెప్టెంబర్ 23

వర్క్ ప్లేస్ లో మీరు ఊహించినంత అలాగే ఆశించదగిన మార్పులేవీ ఈ వారంలో చోటుచేసుకునే అవకాశాలు లేవు. ఈ వారం చివరలో కొన్ని ఆర్థిక సమస్యలను ఎదుర్కొనవలసి ఉంటుంది. అయితే, ఆ ఇబ్బందులని ఎదుర్కొనేందుకు మీ లైఫ్ పార్ట్నర్ నుంచి మీకందే మద్దతు అలాగే ప్రేమ తోడ్పడుతుంది. ఉన్నత చదువులను అభ్యసించాలనుకునే వారిని విజయం వరిస్తుంది. వ్యాపారపరంగా లేదా విహారానికి వెళ్లిన విదేశీ ప్రయాణాలు కలిసివస్తాయి. కొన్ని సీజనల్ అలర్జీలు ఇబ్బందులు పెడతాయి. అయితే, హోమ్ రెమెడీస్ తో రిలీఫ్ ను పొందవచ్చు.

తులారాశి: సెప్టెంబర్ 24 - అక్టోబర్ 23

ఈ వారంలో మీ క్రియేటివిటీ అనేది ఉపయోగంలోకి వస్తుంది. సీనియర్స్ ను ఇంప్రెస్ చేయగలుగుతారు. మీ పార్ట్నర్ తో కలిసి మీరు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు తొలగిపోయే ఆస్కారం ఉంది. అయితే, మీరు వాడే కఠినమైన పదాల వలన మీ ఫ్యామిలీ హర్ట్ అయ్యే ప్రమాదం ఉంది. మీ లైఫ్ పార్ట్నర్ తో కలిసి మీరు అడ్వెంచరస్ ట్రిప్స్ ను మీరు ప్లాన్ చేసుకోగలుగుతారు. అయితే, వారికి ఇష్టం లేకుండా మాత్రం ప్లాన్స్ ను చేయకండి. ఆరోగ్యం బాగుంటుంది.

వృశ్చిక రాశి: అక్టోబర్ 24 - నవంబర్ 22

మీ కొలీగ్ తో కొన్ని అభిప్రాయబేధాలు తలెత్తవచ్చు. చాలా కాలం తరువాత ఫైనాన్సస్ అనేవి స్టెబిలైజ్ అయ్యే అవకాశాలు కలవు. కాబట్టి, అనవసరపు ఖర్చులతో ఈ స్టెబిలిటీను పోగొట్టుకునే ఆలోచనలను మానుకోవడం మంచిది. మీ లైఫ్ పార్ట్నర్ తో డిస్కషన్స్ అనేవి కలిసి రాకపోవచ్చు. అయితే కుటుంబ సభ్యుల జోక్యం వలన కొన్ని ఇష్యూలు సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. మీ రిలేషన్ షిప్ లో తిరిగి స్పార్క్ ని తీసుకురావడానికి ఏదైనా నూతనంగా ప్రయత్నించండి. హై బ్లడ్ ప్రెషర్ సమస్య కలిగిన వారు ఆహారం విషయంలో శ్రద్ధ వహించడం మంచిది.

ధనుస్సు రాశి: నవంబర్ 23 - డిసెంబర్ 22

కొన్ని ఫ్యామిలీ అఫైర్స్ మైండ్ లో పేరుకుపోవడం వలన వర్క్ పై కాన్సన్ట్రేట్ చేయలేకపోతారు. దానివలన, వర్క్ లో కొన్ని తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది. మీ హాబీస్ పై అలాగే ఇంట్రస్ట్స్ పై డబ్బును ఖర్చు చేయడం వలన ఫ్యామిలీలో ఆర్గ్యుమెంట్స్ తలెత్తే ప్రమాదం ఉంది. వారి పాయింట్ ఆఫ్ వ్యూ ని మీరు అర్థం చేసుకోవడం వలన ఆర్గ్యుమెంట్స్ తగ్గుముఖం పడతాయి. వివాహ జీవితంలోని ఆనందాన్ని ఆస్వాదిస్తారు. ప్రతి రోజు మెడిటేషన్ ని చేయడం ద్వారా ఆరోగ్యాన్ని సంరక్షించుకోగలుగుతారు.

మకరరాశి: డిసెంబర్ 23 - జనవరి 20

లక్ష్యాలను సాధించేందుకు మీరు ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం ఉంది. అయితే, మీకంటూ కూడా కాస్తంత సమయాన్ని కేటాయించుకోవడం ఉత్తమం. నూతన పెట్టుబడుల ద్వారా మంచి రాబడిని పొందే అవకాశం ఉంది. తద్వారా, మీ ఆర్థిక బాధ్యతలు నిర్వర్తింపబడతాయి. స్నేహితులతో అలాగే కుటుంబంతో సమయాన్ని గడపడం ద్వారా జీవితాన్ని ఆస్వాదించగలుగుతారు. కుటుంబంతో కఠిన పదాలను వాడటాన్ని నిరోధించండి. ఆరోగ్యపరంగా, ఈ వారంలో ఎటువంటి ఆరోగ్య సమస్యలు మీ దరిచేరవు.

కుంభరాశి: జనవరి 21 - ఫిబ్రవరి 19

ఈ వారంలో మీ వర్క్ అనేది వేగాన్ని పుంజుకుంటుంది. అందువలన, టాస్క్ లని త్వరగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థికపరంగా, ఈ వారం మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు. కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి. ప్రతికూల ఆలోచనల నుంచి దూరంగా ఉండండి. ప్రియమైన వారి దగ్గర ఉదారంగా ఉండటం వలన వారి ఆదరణను పొందగలుగుతారు. ఒక ప్రధాన ఆరోగ్య సమస్య నుంచి మీకు ఉపశమనం లభిస్తుంది.

మీనరాశి: ఫిబ్రవరి 20 - మార్చ్ 20

ఈ వారంలో మీ కలలను నెరవేర్చుకునేందుకు అవకాశాలు లభిస్తాయి. అయితే, అప్రమత్తంగా ఉండటం మంచిది. ఆర్థికపరమైన విషయాలలో అప్రమత్తంగా ఉండటం మంచిది. మీకు దగ్గరైన వారి నుంచి ఆర్థికపరమైన చికాకులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. కుటుంబ పరంగా, ఆనందాన్ని అలాగే శాంతిని పొందగలుగుతారు. మీ ఆరోగ్యాన్ని అలాగే మీ భాగస్వామి ఆరోగ్యాన్ని సంరక్షించుకునేందుకు మీరు మరింత శ్రద్ధ కనబరచాలి. ఈ వారం చివరలో మీ ఇద్దరికీ చిన్నపాటి ఆరోగ్యసమస్యలు తలెత్తవచ్చు.

English summary

Weekly Predictions for each Zodiac sign 29th April to 5th May-

Weekly Predictions for each Zodiac sign 29th April to 5th May-Good things and Bad things both are a part of life. But we humans are always curious in knowing what our future holds for you. Astrology helps in understanding the suture events in our life and plans things accordingly
Story first published: Tuesday, May 1, 2018, 16:00 [IST]