For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అష్టసిద్ధులు అంటే ఏమి? అష్టసిద్దులు పొందివారి శక్తిసామర్థ్యాలు ఎలా ఉంటుంది...

|

యోగా సాస్త్రంలో ఎనిమిది సంఖ్యను మాయకు సంకేతంగా, తొమ్మిది సంఖ్యను పరమాత్మకు ప్రతీకగా చెబుతారు. భగవద్గీతలో అష్టవిధ మాయలను గూర్చి ప్రస్తావన ఉంటుంది. పంచభూతాలు, మనస్సు, బుద్ది, అహంకారం కలిస్తే ఎనిమిది అవుతాయి.

పంచభూతాలను పంచేంద్రియాలుగా పరిగిణిస్తే (కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం)+మనస్సు+బుద్ది +అహంకారం ఎనిమిదిని జయించిన వారికి కలిగే వాటినే అష్టసిద్దులు అంటారు.

దత్త చరిత్రలో శ్రీ దత్తాత్రేయ మహాగురువులు అష్టసిద్ధుల్ని తమ బిడ్డలుగా ప్రస్తావించారు. తమ భక్తులైన వారికి అష్ట సిద్దుల అనుగ్రహం ఉంటుందని అభయమిచ్చారు.

ఒక విధంగా భగవానుని దివ్వ ఆరాధనకు ఫలంగా భక్తులకు ప్రాప్తించే ఎనిమిది సిద్దులే అష్ట సిధ్దులు. పూర్వం బుషులు, యోగులు, మహర్షులు అష్టసిద్దులను పొందారని మన పురాణాలు చెబుతున్నాయి. ఆంజనేయస్వామి అష్టసిద్దులు పొందారుకనకనే తులసీదాసు చాలీసాలో అష్టసిద్ధి నవనిధికే దాత అని స్తుతించారు.

అణిమ, మహిమ, గరిమ, లషిమ, ప్రాప్తి, ప్రాకమ్యం, ఈశిత్వం, వశిత్వం అనే ఎనిమిదినీ అష్టసిద్ధులు అని అంటారు. మరి అవేంటో చూద్దాం...

1. అణిమ:

1. అణిమ:

సూక్ష్మావస్థలో కూడా భగవంతుడు ఉన్నాడు అని నమ్మి అతనిలో మనస్సును నిలుపుటవల్ల ఈ సిద్ది వస్తుంది. దీనికి వల్ల అత్యంత సుక్ష అణువుగా యోగి తాను మార్చుకొనగలడు.

2. మహిమ :

2. మహిమ :

భగవంతుని మహాత్తుని దర్శించగలిగిన సాధనకు ఈ సిద్ది వస్తుంది. దీని కారణంగా అతను శివ, కేశవులకు సామానమయిన కీర్తిని పొందగలుగుతారు.

3. గరిమ:

3. గరిమ:

ఈ సిద్ది సాధించిన వారు తమ శరీర బరువును ఈ భూభారమునకు సమానంగా చేయగలరు.

4. లఘీమ:

4. లఘీమ:

ఈ సిద్ది గలవారు తమ శరీరంను దూది కంటే తేలికగా ఉంచగలరు.

5. ప్రాప్తి:

5. ప్రాప్తి:

ఈ సిద్ది ద్వారా కావాలనుకున్నా క్షణములలో శూన్యం నుండి కూడా స్రుజించుకోగలరు.

6. ప్రాకామ్యము:

6. ప్రాకామ్యము:

అనేక దివ్వ శక్తులు (దూర దర్శనము, దూర శ్రవణం, ఆకాశ గమనం)వారిలో వశంలో ఉంటాయి.

7. ఈశత్వం:

7. ఈశత్వం:

ఇంద్రాది దిక్పాలకులను కూడా నియంత్రించగలిగిన అధికారం వస్తుంది.

8. వశిత్వం:

8. వశిత్వం:

సకల జీవరాశులు వారు చెప్పినట్లుగా ప్రవర్తింప చేయగలిగిన శక్తి

Story first published:Monday, May 16, 2016, 17:22 [IST]
Desktop Bottom Promotion