For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉపవాసం ఉండే వారు పద్ధతులు తప్పనిసరిగా పాటించాలి.. లేదంటే కోరికలు నెరవేరట...!

|

హిందూ మతంలో ఏడాది పొడవునా ఎన్నో పండుగలు, వ్రతాలు, ఏకాదశి తిథి, ప్రత్యేక జయంతి వేడుకలు జరుగుతూ ఉంటాయి. ఈ పవిత్రమైన రోజుల్లో చాలా మంది ఉపవాసం ఉండటం ద్వారా భగవంతుని అనుగ్రహం తమకు లభిస్తుందని నమ్ముతారు.

ఈ నేపథ్యంలో హిందూ మతంలోని విశ్వాసాల ప్రకారం కొన్ని సందర్భాల్లో ప్రత్యేక పూజలు చేస్తూ కఠినమైన ఉపవాస పద్ధతులను పాటిస్తారు. అయితే ఉపవాసం ఉండే వారు ఈ నియమాలను కచ్చితంగా తెలుసుకోవాలి.

ఇలాంటి ఆచారాలను పాటించకుండా మీరెన్ని రోజులు ఉపవాసం ఉన్నా.. ఎన్ని గంటలు ఉపవాసం ఉన్న దాని ఫలితం మీకు దక్కకుండా పోతుందని పండితులు చెబుతున్నారు. అంతేకాదు మీరు కోరుకున్న కోరికలు కూడా నెరవేరవట.

ఈ నేపథ్యంలో ఉపవాసానికి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న నియమాన్ని కచ్చితంగా పాటించాలి. ఈ సందర్భంగా ఉపవాసం సమయంలో పాటించాల్సిన ముఖ్యమైన నియమాలంటనే ఆసక్తికరమైన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Astro Tips for Money:ఈ చిట్కాలతో మీ సంపద రెట్టింపు అవ్వడం ఖాయం...!

ఉపవాస ప్రతిజ్ఞ

ఉపవాస ప్రతిజ్ఞ

మీరు ఉపవాస తీర్మానాన్ని తీసుకోవడం ద్వారా ఉపవాసాన్ని ప్రారంభించండి. చాలా సందర్భాలలో, బ్రహ్మ ముహుర్తంలో స్నానం చేసిన తర్వాత మాత్రమే ఈ తీర్మానం తీసుకోవాలి. ఉపవాస తీర్మానంలో, ఉపవాస సమయ వ్యవధిని కూడా నిర్ణయించాలి. తీర్మానం లేకుండా చేసిన ఉపవాస ఫలితం అసంపూర్ణంగా ఉంటుంది.

ఉపవాసాల్లో రకాలు..

ఉపవాసాల్లో రకాలు..

ఉపవాసాల్లో కొన్ని రకాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి నిర్జలోపవాసం, జలోపవాసం, రసోపవాసం, ఫలోపవాసం. ఈ నాలుగు రకాల ఉపవాసాలు మన శరీరాన్ని శుద్ధి చేయడంలో ఎంతగానో సహాయపడతాయి. కాబట్టి మీ శరీరాన్ని బట్టి మీకు ఏది వీలవుతుందో.. అలాంటి ఉపవాసమే ఉండాలి.

ఇవి తీసుకోవచ్చు..

ఇవి తీసుకోవచ్చు..

జలోపవాసం అంటే ఉపవాసం ఉండే వారు అప్పుడప్పుడు నీరు తాగొచ్చు. అయితే ఈ ఉపవాసంలో ఉండే వారు ఆహార పదార్థాలేవీ తీసుకోకుండా ఉండాలి. కనీసం 5 లీటర్ల వరకు తాగొచ్చు. ఉదయాన్నే పరగడుపన ఒక లీటర్ నీటిని తీసుకొని, అనంతరం ప్రతి రెండు గంటలకు ఒకసారి రెండు గ్లాసుల నీటిని తాగాలి. రసోపవాసం అంటే పండ్లను తీసుకోవచ్చు. ఆరెంజ్, బత్తాయి, కొబ్బరినీళ్లు వంటివి తీసుకోవచ్చు. ఫలోపవాసం అంటే ఫలాలు తీసుకోవచ్చు.

Mangal Gochar 2022:మీన రాశిలోకి అంగారకుడి సంచారం.. ఏ రాశి వారిపై ఎలాంటి ప్రభావమంటే...!

ఆ నీళ్లు తాగరాదు..

ఆ నీళ్లు తాగరాదు..

ఉపవాసంలో ఉండే ఫ్రిజ్ లోని నీళ్లను అస్సలు తీసుకోకూడదు. అలాగే ఫ్రిజ్ లో ఉంచిన పండ్ల రసాలను కూడా తీసుకోకూడదు. సహజమైన నీళ్లనే తాగాలి. అలాగే సహజ పండ్ల రసాలను తీసుకోవాలి. కొన్ని పండ్లను అప్పుడప్పుడు తినొచ్చు. అయితే ప్రతి ఉపవాస నియమాల నుండి పిల్లలకు, గర్భిణులకు, వయోజనులకు ఈ నిబంధనల నుండి మినహాయింపు ఉంటుంది.

పూజకు ముందు..

పూజకు ముందు..

ఉపవాసం ఉండే వారు ఉదయాన్నే స్నానం చేసి, ఇంటిని శుభ్రం చేసి, ముఖ్యంగా పూజా గదిని శుద్ధి చేసి పూజా సామాగ్రి మరియు సంబంధిత దేవుని విగ్రహం లేదా దేవుని ఫొటోలను పూజా గదిలో ప్రతిష్టించాలి. ఆ తర్వాత మీ ఆచారాలను బట్టి పూజను ప్రారంభించాలి. అనంతరం భగవంతుడిని స్మరించుకోవాలి.

నల్లని బట్టలొద్దు..

నల్లని బట్టలొద్దు..

ఉపవాసం ఉండే వారు తెల్లవారుజామున నిద్ర లేచి స్నానం చేసిన తర్వాత శుభ్రమైన మరియు ఉతికిన దుస్తులను మాత్రమే ధరించాలి. ఎట్టి పరిస్థితుల్లో నల్లని రంగులోని దుస్తులను ధరించొద్దు. వీలైతే పసుపు, తెల్లని, పచ్చని రంగులో ఉండే దుస్తులను ధరించాలి.

బ్రహ్మచార్యం పాటించాలి..

బ్రహ్మచార్యం పాటించాలి..

ఉపవాసం ఉండే ప్రతి ఒక్కరూ విధిగా ఆ రోజంతా బ్రహ్మచార్యం పాటించాలి. మీ ఉపవాసం విజయవంతం కావడానికి, వ్యక్తి యొక్క మనసు ప్రశాంతంగా ఉండటం అవసరం. మీ మనసులో ఎలాంటి ప్రతికూల ఆలోచనలు రానీయకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కోపం తెచ్చుకోకూడదు. ఎలాంటి చెడు ఆలోచనలు కూడా చేయకూడదు.

గమనిక : ఈ సమాచారం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న ఊహాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనికి బోల్డ్ స్కై తెలుగు కథనానికి ఎలాంటి సంబంధం లేదు. మీరు ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు దయచేసి సంబంధిత నిపుణులను సంప్రదించగలరు.

English summary

What Are the Hindu Rules of Fasting in General in Telugu

Here we are talking about the what are the hindu rules of fasting in general in Telugu. Read on
Story first published: Thursday, May 19, 2022, 17:26 [IST]
Desktop Bottom Promotion