For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శుక్రవారం ప్రత్యేకతేంటి ? శుక్రవారం పాటించాల్సిన నియమాలేంటి ?

By Nutheti
|

శుక్రవారం అంటే అమ్మవారికి ప్రత్యేకం. అలాగే ముత్తైదువులు, మహిళలకు ప్రత్యేకం. అందుకే శుక్రవారం మహిళలు అమ్మవారిని దర్శించుకోవడం వల్ల సకల సంపదలు పొందుతారని శాస్ర్తాలు చెబుతున్నాయి. శుక్రవారం లక్ష్మీదేవి లేదా ఏదైనా అమ్మవారి ఆలయానికి వెళ్లడం వల్ల కలకలకాలం ముత్తైదు తనం ప్రాప్తిస్తుంది.

శుక్రవారం లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన రోజు. ఆ రోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పిస్తే.. అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు సిద్ధిస్తాయి. అలాగే అమ్మవారి ఆలయ దర్శనం చేసుకుంటే.. ఆ తల్లి అభయం పొందుతారు. శుక్రవారానికి ఉన్న ప్రత్యేకతలేంటి ? ఆ రోజు అమ్మవారిని ఎలా పూజించాలి ? ఏం సమర్పించుకోవాలి ? అన్న సందేహాలను నివృత్తి చేసుకుందాం.

శుక్రవారం మహిళలు అమ్మవారిని ఏ విధంగా పూజించాలి ?

శుక్రవారం మహిళలు అమ్మవారిని ఏ విధంగా పూజించాలి ?

శుక్రవారం ఉదయాన్నే తలస్నానం చేసి.. పసుపు లేదా ఎరుపు లేదా ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించి.. ఇంట్లో పూజాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని అమ్మవారి ఆలయం దర్శించుకోవాలి. అక్కడ నేతితో దీపం వెలిగించడం ద్వారా సుమంళి ప్రాప్తిస్తుంది. అనుకున్న కార్యాలు పూర్తైయి, శుభ ఫలితాలు ప్రాప్తిస్తాయి.

శుక్రవారం మహిళలు అమ్మవారిని ఏ విధంగా పూజించాలి ?

శుక్రవారం మహిళలు అమ్మవారిని ఏ విధంగా పూజించాలి ?

శుక్రవారం అమ్మవారికి తెల్లపువ్వులు సమర్పించడం వల్ల గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. ప్రతి శుక్రవారం ఇలా చేస్తే కుటుంబమంతా సుఖసంతోషాలతో, ప్రశాంతతతో ఉంటుందని ప్రతీతి.శుక్రవారం రోజున పాలతో చేసిన పాయసం తాగడం ఆరోగ్యానికి శ్రేయస్కరం. అలాగే మహిళలు తెల్లటి పువ్వులను శిరస్సులో ధరించడం ద్వారా శుభఫలితాలు చేకూరుతాయి.

శుక్రవారం మహిళలు అమ్మవారిని ఏ విధంగా పూజించాలి ?

శుక్రవారం మహిళలు అమ్మవారిని ఏ విధంగా పూజించాలి ?

శుక్రవారాల్లో చేసే పూజల ద్వారా అష్టైశ్వర్యాలు సిద్ధించడంతో పాటు కష్టాలు తొలగిపోతాయని విశ్వాసం. అలాగే దేవాలయాలను సందర్శించుకునే మహిళలు, అమ్మాయిలు సంప్రదాయ దుస్తులు ధరించాలి. చీరలు, లంగా ఓణీలు వేసుకుంటే.. సంప్రదాయత వెల్లివిరుస్తుంది.

శుక్రవారం మహిళలు అమ్మవారిని ఏ విధంగా పూజించాలి ?

శుక్రవారం మహిళలు అమ్మవారిని ఏ విధంగా పూజించాలి ?

నుదుట కుంకుమ రంగు బొట్టు పెట్టుకోవాలి. ఆలయాల్లో ఇచ్చే పసుపు కుంకుమలను నుదుట కుంకుమ కింద, విభూతిని నుదుటి బొట్టుపైన పెట్టుకోవాలి.

శుక్రవారం మహిళలు అమ్మవారిని ఏ విధంగా పూజించాలి ?

శుక్రవారం మహిళలు అమ్మవారిని ఏ విధంగా పూజించాలి ?

ఆలయంలో కర్పూరం వెలింగేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఆలయాల్లోని దీపాల వెలుగు నుంచో, ఇతరుల అగ్గిపెట్టెలు తీసుకునో దీపం వెలిగించడం మంచిది కాదు. ఇలా చేస్తే పుణ్యఫలం మీకు దక్కకుండా.. ఇతరులకు చేకూరుతుంది.

శుక్రవారం మహిళలు అమ్మవారిని ఏ విధంగా పూజించాలి ?

శుక్రవారం మహిళలు అమ్మవారిని ఏ విధంగా పూజించాలి ?

శుక్రవారం విఘ్నేశ్వరునికి ఆలయానికి వెళ్తే.. గరిక మాల తీసుకెళ్లండి. గరికమాలను వినాయకునికి ప్రతి శుక్రవారం సమర్పిస్తే.. కోరిన కోరికలు నెరవేరుతాయి. శుక్రవారం శివాలయానికి వెళ్లేవారు బిల్వపత్రాలను తీసుకెళ్లడం వల్ల కష్టాలు తొలగిపోయి, సర్వ శుభాలు చేకూరుతాయి.

శుక్రవారం మహిళలు అమ్మవారిని ఏ విధంగా పూజించాలి ?

శుక్రవారం మహిళలు అమ్మవారిని ఏ విధంగా పూజించాలి ?

ఇదే విధంగా విష్ణుమూర్తి ఆలయాన్ని శుక్రవారం సందర్శించుకోవాలనుకుంటే తులసీ మాల సమర్పించాలి. ఆంజనేయస్వామిని దర్శించుకునే వాళ్లు వెన్నముద్దతో వెళ్లడం వల్ల వ్యాపారం అభివృద్ధి చెందుతుంది.

శుక్రవారం మహిళలు అమ్మవారిని ఏ విధంగా పూజించాలి ?

శుక్రవారం మహిళలు అమ్మవారిని ఏ విధంగా పూజించాలి ?

దుర్గమ్మను శుక్రవారం దర్శించుకునే మహిళలు పసుపు, తెలుపు, ఎరుపు రంగు పూలను సమర్పించుకుంటే సుఖసంతోషాలతో పాటు అష్టైశ్వర్యాలు పొందుతారు.

English summary

What Are The rules to do puja on Friday: spirituality in telugu

What Are The rules to do puja on Friday
Story first published: Tuesday, October 20, 2015, 17:10 [IST]
Desktop Bottom Promotion