For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దీపావళి ముందు రోజు వీటిని ఖచ్చితంగా కొంటే సర్వశుభాలు పొందుతారు..?

దంతేరాస్ హిందువులు ఈ ఐదు రోజుల పండుగలో సంపద దేవత అయిన లక్ష్మి దేవిని పూజిస్తారు. ఈ రోజున లక్ష్మి పూజ చేస్తారు. హిందువులు అకాల మరణం నుండి రక్షణ కోసం లక్ష్మిదేవిని పూజించి దీపాలు మరియు స్వీట్స్ అందిస్తా

|

దంతేరాస్ హిందువులు ఈ ఐదు రోజుల పండుగలో సంపద దేవత అయిన లక్ష్మి దేవిని పూజిస్తారు. ఈ రోజున లక్ష్మి పూజ చేస్తారు. హిందువులు అకాల మరణం నుండి రక్షణ కోసం లక్ష్మిదేవిని పూజించి దీపాలు మరియు స్వీట్స్ అందిస్తారు. గృహాలు మరియు భవనాలలో రంగోలి నమూనాలు మరియు పువ్వుల నమూనాలతో అలంకరిస్తారు. హిందువులు లక్ష్మి కీర్తిస్తూ వెండి లేదా బంగారు వస్తువులను కొనుగోలు చేస్తారు. సూర్యాస్తమయ సమయంలో హిందువులందరూ స్నానం చేసి లక్ష్మి పూజ చేసి దీపాలను వెలిగిస్తారు. ఈ దీపాలు చెడు ఆత్మలను ప్రాలద్రోలతాయని నమ్మకం.

దీపావ‌ళి వ‌స్తుంద‌న‌గానే మ‌న‌కు ముందుగా గుర్తుకు వ‌చ్చేది ట‌పాసులు. పండుగ వారం ఉంద‌న‌గానే ఎవ‌రి ఇంట్లోనైనా ఈ సంద‌డే ఉంటుంది. ఇక పిల్ల‌లు ఉంటే వారు ట‌పాకాయలు కొనే దాకా పోరు పెడుతూనే ఉంటారు. పిల్ల‌లే కాదు, పెద్ద‌ల‌కు కూడా దీపావ‌ళి ట‌పాసులు కాల్చ‌డ‌మంటే అదో స‌ర‌దా. అయితే దీపావ‌ళి అంటే నిజంగా ట‌పాసులే కాదు, అదో దీపాల పండుగ‌. న‌ర‌కాసురున్ని వ‌ధించినందుకు గాను ప్ర‌జ‌లంతా సంతోషంతో జ‌రుపుకునే వేడుక అది.

దీంతోపాటు చాలా మంది ఆ రోజున ల‌క్ష్మీ దేవిని కూడా పూజిస్తారు. దీపావ‌ళికి ముందు రోజున వచ్చే ధంతేర‌స్ రోజున అంద‌రూ ల‌క్ష్మీ దేవికి పూజ‌లు చేస్తారు. అయితే ఈ ధంతేర‌స్ ఏటా దీపావ‌ళికి ముందు రోజే వ‌స్తుంది, కానీ ఈ సారి మాత్రం రెండు రోజుల ముందే వ‌స్తోంది. అవును, మీరు విన్న‌ది క‌రెక్టే. ఈ నెల 28వ తేదీన ధంతేర‌స్ రానుంది. ఈ క్ర‌మంలో ఆ రోజున ల‌క్ష్మీ దేవి పూజ‌తోపాటు ప‌లు వ‌స్తువుల‌ను కూడా కొనాల‌ట‌. దీంతో అలా కొనే వారికి ఇంకా ఎక్కువ శుభాలు క‌లుగుతాయ‌ట‌. ఆ రోజున ఏమేం వ‌స్తువులు కొంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.

ల‌క్ష్మీ దేవి, వినాయ‌కుడు…

ల‌క్ష్మీ దేవి, వినాయ‌కుడు…

ధంతేర‌స్ రోజున ల‌క్ష్మీదేవి, వినాయ‌కుడు క‌ల‌సి ఉన్న ఫొటోను లేదా గోల్డ్ కాయిన్‌ను ఇంటికి తెచ్చుకుని వాటికి పూజ చేయాలి. దీంతో ఆ ఇంట్లో అన్నీ శుభాలే జ‌రుగుతాయి. సంప‌ద కూడా వృద్ధి చెందుతుంది. అందంగా ముద్దుగా చెయిర్ మీద కూర్చొన్న గణేషుడి విగ్రహం మీ ఇంటి అలంకరణకు అద్భుతంగా ఉంటుంది.

బంగారం…

బంగారం…

ధంతేర‌స్ రోజున వీలైతే బంగారం కూడా కొన‌వ‌చ్చు. దానికి ఇంత ప‌రిమితి అని లేదు. ఎంత త‌క్కువ కొన్నా ఆ రోజు బంగారం కొంటే మంచి జ‌రుగుతుంద‌ట‌. ఉద‌యం 6.34 గంట‌ల‌కు, సాయంత్రం 6.20 గంట‌ల‌కు బంగారం కొనేందుకు మంచి ముహూర్తాలు ఉన్నాయ‌ట‌.

సిల్వర్ ఫిగరైన్:

సిల్వర్ ఫిగరైన్:

మీ ఇంట్లో లివింగ్ రూమ్ లో ఉండే సెంటర్ టేబుల్ మీదకు ఒక సిల్వర్ ఫిగరైన్ ను ఎంపిక చేసుకోవాలి. ఇది మెరుస్తుంటుంది మరియు పండుగ సమయాల్లో చాలా అందంగా కూడా అలంరణ లాగా దీన్ని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా పెట్టుకోవచ్చు.

గోమ‌తి చ‌క్ర‌…

గోమ‌తి చ‌క్ర‌…

గోమ‌తి చ‌క్ర అనే పేరున్న 11 గ‌వ్వ‌ల‌ను కొనుగోలు చేసి వాటిని ఒక ప‌సుపు రంగు వ‌స్త్రంలో చుట్టి మీ ఇంట్లోని లాక‌ర్‌లో పెట్టాలి. దీంతో సంప‌ద క‌లుగుతుంది.

డైమండ్ లార్డ్ గణేష:

డైమండ్ లార్డ్ గణేష:

ఇటువంటి డైమండ్ లార్డ్ గణేష్ ప్రతి ఇంట్లోనూ ఉంటే మంచిది. మరీ ముఖ్యంగా దీపావళి రోజున ఇటువంటి విగ్రహాలు మరింత అంకృతంగా కనబడుతాయి.

ఎల‌క్ట్రానిక్ వ‌స్తువులు…

ఎల‌క్ట్రానిక్ వ‌స్తువులు…

ఫ్రిజ్‌, మొబైల్ ఫోన్‌, టీవీ వంటి వ‌స్తువుల‌ను ధంతేర‌స్ రోజున కొనాల‌ట‌. అనంత‌రం వాటిని ఇంట్లో వాయువ్య దిశ‌గా ఉంచాలి. అలా చేస్తే అనుకున్న ప‌నులు జ‌రుగుతాయ‌ట‌.

అకౌంట్స్ బుక్‌…

అకౌంట్స్ బుక్‌…

వ్యాపారం చేసే వారు అకౌంట్స్ పుస్త‌కాన్ని (రిజిస్ట‌ర్‌) కొనుగోలు చేసి దాన్ని వారి షాపులో లేదా ఆఫీసులో ప‌డ‌మ‌ర దిశ‌గా ఉంచాలి. దీంతో వ్యాపారం వృద్ధి చెందుతుంది.

చేసే వృత్తికి సంబంధించిన‌వి…

చేసే వృత్తికి సంబంధించిన‌వి…

ఎవ‌రు ఏ ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా వాటికి సంబంధించిన ఏదో ఒక వ‌స్తువును ధంతేర‌స్ రోజున కొనుగోలు చేసి ల‌క్ష్మీ దేవిని పూజించాల‌ట‌. దీంతో వారికి ఆ రంగంలో విజ‌యం చేకూరుతుంది.

మోనోక్రోమ్ షో పీస్:

మోనోక్రోమ్ షో పీస్:

మోనోక్రోమ్ ఒక లేటెస్ట్ ఫ్యాషన్ పీస్. ప్రస్తుతం ఇది ట్రెండింగ్ లో ఉన్నది. మీకు నచ్చినవారికి ఇలాంటి గిఫ్ట్ ఇస్తే ఎగిరి గంతేయాల్సిందే..

స్వ‌స్తిక్ చిహ్నం…

స్వ‌స్తిక్ చిహ్నం…

స్వ‌స్తిక్ బొమ్మ‌ను ఇంటి ప్ర‌ధాన ద్వారం లేదా గేట్ వ‌ద్ద వేలాడ దీయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఆ ఇంట్లో వారికి అదృష్టం క‌ల‌సి వ‌స్తుంది.

రాజస్తాన్ బొమ్మలు:

రాజస్తాన్ బొమ్మలు:

అందమైనటువంటి రాజస్థాన్ బొమ్మలను అలంకరించి పండుగ వాతావరణంను పొందాలి . పండుగ సందర్బాల్లో ఇటువంటి ప్రత్యేకమైన బొమ్మలు ఇంటిక అలంకరణలో మరింత కలర్ ఫుల్ గా కనబడుతాయి.

చారియోట్ మీద గణేషుడు:

చారియోట్ మీద గణేషుడు:

చారియోట్ మీద కూర్చొన్నటువంటి గణేషుడి విగ్రహాన్ని బహుమతిగా ఇవ్వడం వల్ల మీకు అద్రుష్టం వస్తుంది. ఈ విగ్రహాన్ని అందంగా ఒక గిఫ్ట్ పేపర్ తో ప్యాక్ చేసి మీకు నచ్చినవారికి ఒక చిరునవ్వుతో అందివ్వండి.

వంట‌పాత్ర‌లు…

వంట‌పాత్ర‌లు…

ఇత్త‌డితో త‌యారు చేసిన వంట పాత్ర‌ల‌ను ధంతేర‌స్ రోజున కొనుగోలు చేసి వాటి ఇంట్లో తూర్పు దిక్కున ఉంచాలి. దీంతో ఆ ఇంట్లో ఉన్న వారికి అదృష్టం క‌ల‌సి వ‌స్తుంది.

English summary

What to Buy on Dhan Teras Gifts and Ideas: Diwali 2016

Dhanteras or Dhan Teras marks the beginning of Diwali and is observed two days before Diwali. It is the thirteenth day of the dark fortnight of Kartik Month and is also known as Dhantra Yodashi. In 2009, Dhanteras is on October 15. The importance of Dhanteras is that a new utensil or gold or silver is bought for the house. The day is dedicated to Dhanavantri, the physician of the gods.
Desktop Bottom Promotion