For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Ashtadasha Puranalu : అష్టాదశ పురాణాల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందామా...

|

హిందూ మతంలో పురాణాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఇవి సంస్క్రుత భాగవతంలోని పన్నెండో స్కందం నుండి పుట్టాయని పండితులు చెబుతారు. బ్రహ్మమహర్షి ధ్యానంలో ఉన్న సమయంలో తన నుండి వెలువడిన శబ్దాల ద్వారా ఓంకార శబ్దం ఆవిర్భవించిందని.. 'అ నుండి హ' వరకు ఉండే అక్షరాలు కూడా ఈ సమయంలోనే ఉద్భవించాయని,

What Is Ashtadasha Puranalu? All you need to know in Telugu

ఈ నేపథ్యంలోనే సకల మంత్రాలకు ఓంకారం అనేక బీజాక్షరం అయ్యిందని, ఓం కారం నుండే నాలుగు వేదాలు ఉద్బవించాయని పండితులు చెబుతుంటారు. వేదాలు నాలుగు రకాలున్నాయని మనందరికీ తెలిసిందే. రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, ఆధర్వణ వేదం అనే చతుర్వేదాలు చాలా క్లిష్టమైనవి. అందుకే అందరికీ అందుబాటులో ఉండేలా వేదవ్యాసుడు వేద ఉపనిషత్తు సారంతో కూడిన అష్టాదశ పురాణాలను రచించాడు.

What Is Ashtadasha Puranalu? All you need to know in Telugu

ఈ పురాణాలను వ్యాసుడు తన శిష్యుడైన రోమహర్షణుకి వివరించాడు. రోమహర్షుడు వీటిని తిరిగి తన శిష్యులైన త్రైయారుణి, కశ్యపుడు, సావర్ణి వంటి వారికి అందజేశాడు. ఆ తర్వాత ఒకరి నుండి మరొకరు తెలుసుకున్నారు. అలా వేదాలు తరతరాలుగా సాగిపోతూ ఉన్నాయి. ఈ సందర్భంగా అష్టాదశ పురాణాలు ఏవి? అందులో ఏమున్నాయనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

శని జయంతి: వీటితో ఎలాంటి శనిదోశాలనైనా పరిష్కరించుకోవచ్చు...శని జయంతి: వీటితో ఎలాంటి శనిదోశాలనైనా పరిష్కరించుకోవచ్చు...

అష్టాదశ పురాణాలు..

అష్టాదశ పురాణాలు..

పద్మ పురాణం, విష్ణు పురాణం, లింగ పురాణం, బ్రహ్మ పురాణం, కూర్మ పురాణం, మత్స్య పురాణం, అగ్ని పురాణం, వామన పురాణం, గరుడ పురాణం, వరాహ పురాణం, వాయు పురాణం, నారద పురాణం, స్కంద పురాణం, భాగవత పురాణం, మార్కండేయ పురాణం, బ్రహ్మాండ పురాణం, భవిష్య పురాణం, బ్రహ్మవైవర్త పురాణం. వీటిలో పద్మ పురాణం చాలా పెద్దది. మార్కండేయ పురాణం చాలా చిన్నది.

విష్ణు పురాణం..

విష్ణు పురాణం..

ఈ పురాణంలో విష్ణువు గురించి పరాశరుడు తన శిష్యుడు మైత్రేయునికి బోధించారు. ఇందులో విష్ణుమూర్తి అవతరా వర్జన, ధ్రువ, ప్రహ్లాద, భరతుల చరితామ్రుతం గురించి ఉంటుంది.

లింగ పురాణం..

లింగ పురాణం..

ఇందులో పరమేశ్వరుని మహిమలతో పాటు వివిధ వ్రతాలు, ఖగోళ, జ్యోతిష్య, భూగోళాల గురించి మొత్తం సమాచారం ఉంటుంది.

బ్రహ్మ పురాణం..

బ్రహ్మ పురాణం..

ఈ పురాణంలో బ్రహ్మదేవుడు దక్షునికి బోధించిన వర్ణ ధర్మాలు, స్వర్గం మరియు నరకం గురించి తెలుసుకోవచ్చు.

Vat Savitri Vrat 2021: ఈ మంత్రం జపిస్తే.. సావిత్రి తల్లి ఆశీస్సులు లభిస్తాయి...!Vat Savitri Vrat 2021: ఈ మంత్రం జపిస్తే.. సావిత్రి తల్లి ఆశీస్సులు లభిస్తాయి...!

కూర్మ పురాణం..

కూర్మ పురాణం..

దీనిలో విష్ణుమూర్తి దశావతారాలలో ఒకటైన కూర్మ అవతారం గురించి ఈ పురాణంలో వివరించబడింది. అలాగే ఖగోళ శాస్త్రం, వారణాసి, ప్రయాగ వంటి పుణ్యక్షేత్రాల గురించి వర్ణించారు.

వామన పురాణం..

వామన పురాణం..

ఈ పురాణం గురించి నారద మహర్షికి పులస్త్య మహర్షి వివరించారు. వీటితో పాటు పార్వతీపరమేశ్వరుల కళ్యాణం, గణేశ, కార్తీకేయుల జన్మవ్రుత్తాంతాలు, రుతువుల గురించిన వర్ణనలు ఉంటాయి.

వరాహ పురాణం..

వరాహ పురాణం..

విష్ణుమూర్తి అవతరాలలో వరాహ అవతారానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ పురాణంలో ధర్మశాస్త్రాలు, వ్రత కల్పాలు, భూమిపై ఉన్న అనేక రకాల పుణ్యక్షేత్రాల గురించి ఎన్నో వర్ణనలు మనకు కనిపిస్తాయి.

గరుడ పురాణం..

గరుడ పురాణం..

విష్ణుమూర్తి గరుడకు అనేక సందేహాలను ఈ పురాణంలో నివ్రుత్తి చేశాడు. ఇందులో గరుడుని జన్మ వ్రుత్తాంతంతో పాటు జనన మరణాల గురించి, మరణం తర్వాత మనషులు ఎక్కడికి వెళ్తారు? ఏ పాపానికి ఎలాంటి శిక్ష పడుతుందనే వివరాలు ఉంటాయి.

Jyeshtha Amavasya 2021: జ్యేష్ఠ అమావాస్య ప్రత్యేకతలేంటో తెలుసా...Jyeshtha Amavasya 2021: జ్యేష్ఠ అమావాస్య ప్రత్యేకతలేంటో తెలుసా...

వాయు, అగ్ని పురాణం..

వాయు, అగ్ని పురాణం..

వాయుదేవుడు చెప్పిన ఈ పురాణంలో పరమేశ్వరుని మహిమలు, భూగోళం, సౌరమండలం గురించి వర్ణనలు కనిపిస్తాయి. అగ్ని పురాణంలో వశిష్టుడికి అగ్ని దేవుడు వైద్యశాస్త్ర రహస్యాలు, జ్యోతిష్యం, భూగోళం, ఖగోళం, ఛందస్సు వంటి రహస్యాలను వివరించారు.

పద్మ పురాణం..

పద్మ పురాణం..

అష్టాదశ పురాణాలలో పద్మ పురాణం పెద్దది. ఈ పురాణంలో రాక్షస వధ, రావిచెట్టు మహిమ, పద్మ గంధి దివ్యగాథ, గంగా మహత్యం, గీతాసారం, నిత్య పూజా విధానాల గురించి వివరించారు.

నారద, భాగవత పురాణాలు

నారద, భాగవత పురాణాలు

బ్రహ్మ మానస పుత్రుడైన నారదుడు ఈ పురాణంలో వేదాంగాల గురించి, పుణ్యక్షేత్రాల గురించి ఎన్నో వర్ణనలు చేశారు. భాగవత పురాణంలో విష్ణువు అవతారాలు, శ్రీక్రిష్ణ జననం, లీలల గురించి వేదవ్యాసుడు శకునికి బోధించాడు.

బ్రహ్మాండ, మార్కండేయ, భవిష్య పురాణం...

బ్రహ్మాండ, మార్కండేయ, భవిష్య పురాణం...

బ్రహ్మదేవుడు రాధాక్రిష్ణులు, పరశురామ, శ్రీరామచంద్రుల చరిత్రలను, లలితా మహిమా స్తోత్రాలు, ఖగోళ శాస్త్రం గురించి మహర్షికి చెప్పిన విశేషాలు ఇందులో ఉంటాయి. మార్కండేయ పురాణంలో శివుని మహిమలు, ఇంద్ర, అగ్ని, సూర్యుల మహత్యంతో పాటు దేవీ మహత్యాల గురించి వర్ణన ఉంటుంది. భవిష్య పురాణంలో సూర్యుడు మనువుకు చెప్పిన సూర్యోపాసన విదులతో బాటు భవిష్యత్తులో జరిగే వివిధ విషయాల గురించి వివరణలు ఉంటాయి.

బ్రహ్మాపవైపర్త, స్కంద పురాణాలు..

బ్రహ్మాపవైపర్త, స్కంద పురాణాలు..

ఈ పురాణాలలో గోలోక ప్రశంస, భోజన నియమాలు, రోగ నిరోధకం, తులసీ, సాలగ్రామ మహత్యాల గురించి విషయాలుంటాయి. స్కంద పురాణంలో కాశీఖండం, కేదారఖండం, కుమారిల ఖండం, రేవా ఖండం, తదితర ఖండాలుగా ఉండే ఈ పురాణాల గురించి స్కందుడే వివరించాడు. ఇందులో కుమారస్వామి జననం, మహిమలు, శివలీలలతో పాటు ఇంకా అనేక విషయాలుంటాయి.

English summary

What Is Ashtadasha Puranalu? All you need to know in Telugu

Here we are talking about the what is ashtadasha puranalu? All you need to know in telugu. Read on
Desktop Bottom Promotion