For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భూమి పూజకు అంతటి శక్తి ఉందా? అందుకే అయోధ్యలో భూమి పూజకు అంత ప్రాధాన్యత ఏర్పడిందా?

|

హిందూ సంప్రదాయం ప్రకారం ఏదైనా ఇల్లు కట్టాలన్నా.. మందిరం కట్టాలన్నా.. భూమి పూజ చేయడం అనేది సర్వసాధారణమైన విషయమే.

ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే.. అయోధ్యలో కొన్ని సంవత్సరాలు వివాదస్పదంగా ఉన్న రామ జన్మభూమిలో రాముని మందిర నిర్మాణానికి మరి కొద్ది గంటల్లో భూమి పూజ జరగబోతోంది. ఈ కార్యక్రమానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా హాజరవ్వనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ ఇప్పటికే సిద్ధమయ్యాయి.

అయితే ఈ భూమి పూజకు ఎందుకు అంత ప్రాధాన్యత అందుకు సంతరించుకుంది. ఈ పూజకు కావాల్సిన సామాగ్రి.. ఈ పూజా విధానం.. ఇలా చేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం...

ఆగస్టులో పుట్టిన వారంతా అద్భుత శక్తులను కలిగి ఉంటారా?

భూమి పూజ అంటే?

భూమి పూజ అంటే?

భూమి పూజ అనేది దేవత మరియు వాస్తు పురుషుడు(దిశల దేవత) గౌరవార్థం చేసే కర్మ. భూమి అంటే తల్లితో సమానం అని చాలా మంది నమ్మకం. ఈ పూజ చేయడం వల్ల భూమిలోని చెడు ప్రభావాలు మరియు వాస్తు దోషాలు తొలగిపోయి, ఏ నిర్మాణానికి మార్గం సుగమం అవుతుందని చాలా మంది నమ్ముతారు.

ఎవరిని ఆరాధిస్తారు?

ఎవరిని ఆరాధిస్తారు?

భూమి పూజ సందర్భంగా ఎవరెవరిని ఆరాధిస్తారంటే.. వాస్తు దేవుడిని, భూమి తల్లిని, పంచ భూతాలను వాస్తు శాస్త్ర మార్గదర్శకాలను అనుసరించి పూజిస్తారు. ఇలాంటి చేయడం వల్ల వ్యక్తి యొక్క జీవితానికి ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం వంటివి లభిస్తాయని చాలా మంది నమ్ముతారు.

ఈ పూజను ఎవరు చేయాలి?

ఈ పూజను ఎవరు చేయాలి?

ఈ భూమి పూజను కుటుంబ పెద్దలు చేయాలి. తల్లిని గౌరవించే ఈ కర్మను పండితుల సమక్షంలో చేయాలి. అనుభవం ఉన్న పండితులో ముందుగా ఓ మంచి ముహుర్తాన్ని నిర్ణయించుకుని.. అతని పర్యవేక్షణలో ఈ పూజను చేయాలి.

ఆగస్టు 2020 : ఈ నెలలో గణేష్ చతుర్థి, జన్మాష్టమితో పాటు ప్రధాన పండుగలివే...

ఎప్పుడు చేయాలి?

ఎప్పుడు చేయాలి?

భూమి పూజను ఎప్పుడు పడితే అప్పుడు చేస్తే ఫలితం ఉండకపోవచ్చు. హిందూ క్యాలెండర్ ప్రకారం భూమి పూజకు శ్రావణ, మార్గశిర, పుష్య, కార్తీక మాసాలు అనుకూలంగా ఉంటాయి. ఈ భూమి కోసం తేదీని వాస్తు సమయం నిర్దేశిస్తుంది. చాలా సందర్భాల్లో ఇది నెలలో రెండుసార్లు వస్తుంది. భూమిపూజకు వారంలో రెండు రోజులు అంటే సోమవారం మరియు గురువారం అనుకూలంగా ఉంటాయని, ఇవి చాలా పవిత్రమైనవిగా పండితులు చెబుతున్నారు.

ఎప్పుడు చేయకూడదు..

ఎప్పుడు చేయకూడదు..

  • మరోవైపు శని, ఆదివారం, మంగళవారం నాడు ఎట్టి పరిస్థితుల్లో భూమి పూజలు చేయకూడదు.
  • ఇంట్లో ఎవరైన మహిళలు ఏడు నెలలకు పైగా గర్భవతిగా ఉన్న సమయంలో నిర్మాణ పనులను ప్రారంభించకూడదు.
భూమి పూజా విధానం..

భూమి పూజా విధానం..

  • భూమి పూజ చేసే చోట ముందుగా ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసుకోవాలి. అక్కడ ఎలాంటి దుమ్ము, దూళి లేకుండా చూసుకోవాలి.
  • శుభ్రం చేసిన ప్రాంతంలో, అంటే నిర్మాణం యొక్క ఈశాన్య దిశలో ఒక గొయ్యి తవ్వాలి.
  • భూమి పూజ చేసే సమయంలో యజమాని తూర్పు వైపు కూర్చుని ఉండాలి.
  • ఆ ప్రాంతంలో విఘ్నేశ్వరుడు, లక్ష్మీదేవి ఇతర దేవతల విగ్రహాలను శుభ్రమైన వేదికపై ఉంచాలి.
  • పచ్చికొబ్బరికాయను ఎర్రటి వస్త్రంతో కప్పి, పూజలో ఆ కొబ్బరికాయను ఉంచాలి.
  • వీటితో పాటు నవ ధాన్యాలను సిద్ధం చేసుకోవాలి. పండ్లు, పూలు, కుంకుమ, పసుపు, గంధపుపోడి వంటి 9 రకాల వస్తువులను అందుబాటులో ఉంచుకోవాలి.

ఆగస్టు నెలలో మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూడండి...

భూమి పూజ మంత్రం...

భూమి పూజ మంత్రం...

‘‘ఓం వసుంధరయ విద్మ హే

భూత్ అధాత్రయ ధీమహి తన్నో భూమి ప్రాచోదయత్''

ఈ మంత్రాన్ని భూమి పూజ చేసే సమయంలో జపించాలి.

భూమి పూజ వల్ల కలిగే ప్రయోజనాలు..

భూమి పూజ వల్ల కలిగే ప్రయోజనాలు..

భూమి పూజ చేయడం వల్ల సాగు ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది. అలాగే భవన నిర్మాణానికి ఆ భూమాత ఆశీర్వాదం లభిస్తుంది. ఈ పూజ చేయడం వల్ల భూమి అన్ని దుష్ట శక్తుల విముక్తి పొందేలా చేస్తుంది. అంతేకాదు భూమి నుండి వచ్చే ప్రతికూలతలు కూడా తగ్గుతాయి. మొత్తానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా మీ పనులన్నీ సజావుగా... సులభంగా పూర్తి కావడానికి సహాయపడుతుంది.

English summary

What is Bhoomi Pooja; Benefits, Procedure, Pooja Materials

Here we talking about what is bhoomi pooja; benefits, procedure, pooja materials. Read on