For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Navratri 2021 : దసరా రావణున్ని చంపినందుకా? అర్జునుడి విజయానికా? అమ్మవారిని ఎందుకు పూజిస్తాం!

అరణ్యవాసం పూర్తయిన తర్వాత కరెక్ట్ విజయదశమి రోజు శమీ వృక్షం అంటే జమ్మి చెట్టుపై పెట్టిన ఆయుధాలను కిందకు దింపి పూజలు చేశారు పాండవులు. అలా ఆశ్విజ శుద్ధదశమి విజయదశమిగా మారింది. అలా మహా భారతం ప్రకారం మనం వ

By Arjun Reddy
|

తెలుగు రాష్ట్రాల్లో నేడు దసరాను ఘనంగా నిర్వహించుకుంటున్నారు. మనం నిర్వహించుకునే పండుగల్లో దసరాకు చాలా ప్రాముఖ్యం ఉంది. ఏటా శరదృతువులో అశ్వియుజ శుద్దపాడ్యమి నుంచి దశమి వరకు ఉండే రోజులనే మనం దేవీ నవరాత్రులుగా నిర్వహించుకుని తర్వాత దసరా పండుగ చేసుకుంటాం.

What is the story behind Dussehra?

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారంతా నేడు దసరా సంబరాలను అంగరంగ వైభవంగా చేసుకుంటున్నారు. అమ్మవారి ఆశీస్సుల కోసం పూజలు చేస్తున్నారు. అమ్మవారిని నిష్టగా పూజించే వారికి కచ్చితంగా అష్టైశ్వర్యాలు కలుగుతాయి.విజయానికి ప్రతీకగా చేసుకునేది విజయదశమి. దసరా పండుగ చేసుకోవడానికి పురాణాల్లో మనకు అనేక గాథలున్నాయి.

అరణ్యవాసం విజయవంతం

అరణ్యవాసం విజయవంతం

మహాభారతం ప్రకారం.. పాండవులు అరణ్యవాసాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ మనం విజయదశమిని నిర్వహించుకుంటున్నాం. పాండవులు అజ్ఞాతవాసానికి బయల్దేరే ముందు వారి ఆయుధాలు మొత్తాన్ని ఒక శమీ వృక్షంపై పెట్టి వెళ్లారు.

ఆయుధాలను కిందకు దింపి

ఆయుధాలను కిందకు దింపి

అరణ్యవాసం పూర్తయిన తర్వాత కరెక్ట్ విజయదశమి రోజు శమీ వృక్షం అంటే జమ్మి చెట్టుపై పెట్టిన ఆయుధాలను కిందకు దింపి పూజలు చేశారు పాండవులు. అలా ఆశ్విజ శుద్ధదశమి విజయదశమిగా మారింది. అలా మహా భారతం ప్రకారం మనం విజయదశమిని జరుపుకుంటాం. అందుకే విజయదశమి రోజు జమ్మి చెట్టుకు పూజలు చేసి ఆకుల్ని పెద్దలకు సమర్పించి వారితో ఆశీస్సులు తీసుకుంటాం.

అమ్మవారిని పూజిస్తాం

అమ్మవారిని పూజిస్తాం

అలాగే దుర్గాదేవికి కూడా మనం విజయదశమి రోజు ప్రత్యేక పూజలు చేస్తాం. నవరాత్రుల్లో ఒక్కో రోజు ఒక్కో అవతారంలో అమ్మవారు మనకు దర్శనమిస్తారు. అమ్మవారిని నిష్టగా పూజిస్తాం. ఇక ఎనిమిదో రోజున దుర్గాష్టమిని కూడా మనం ఘనంగా జరుపుకుంటాం.. అమ్మవారికి ఈ పండుగకు కూడా చాలా సంబంధం ఉంది.

Most Read :ఈ రోజు దసరా కాదు, నేడు ఆయుధ పూజ, ఆయుధాలంటే చంపడానికి ఉపయోగించేవా? అసలు కథ ఏమిటో చూడండిMost Read :ఈ రోజు దసరా కాదు, నేడు ఆయుధ పూజ, ఆయుధాలంటే చంపడానికి ఉపయోగించేవా? అసలు కథ ఏమిటో చూడండి

రాముడు విజయం సాధించడం వల్ల

రాముడు విజయం సాధించడం వల్ల

చెడుపై అర్జునుడు విజయం సాధించడం వల్ల తాము కూడా అలాగే చెడు విషయాలపై విజయం సాధించేలా ఆశీర్వదించమని కోరుతూ అందరూ అమ్మవారికి పూజలు చేస్తారు. ఇక శ్రీ రాముడు రావణుడిపై విజయం సాధించిన రోజును గర్తు చేసుకుంటూ కూడా కొన్ని ప్రాంతాల్లో విజయదశమి నిర్వహించుకుంటారు. ఏదీఏమైనా చెడుపై సాధించిన విజయానికి గుర్తుగానే పండుగ చేసుకుంటాం.

కొత్తగా ప్రారంభిస్తే

కొత్తగా ప్రారంభిస్తే

విజయదశమి రోజు ఏవైనా కొత్తగా ప్రారంభిస్తే జీవితం కచ్చితంగా విజయం చేకూరుతుందనేది ప్రజల నమ్మకం. అలాగే జమ్మి చెట్టుకు కచ్చితంగా పూజలు చేయాలి. అయితే విజయదశమిని ఒక్కో ప్రాంతంలో ఒక్కో రోజు నిర్వహించుకుంటున్నారు.

మనం చేసుకునేదే కరెక్ట్

మనం చేసుకునేదే కరెక్ట్

తెలుగురాష్ట్రాల్లో అక్టోబర్ 15, 2021న నిర్వహించుకుంటే కర్ణాటక తదితర రాష్ట్రాల్లో అక్టోబర్ 16 2021న నిర్వహించుకోనున్నారు. దసరాను దశమి తిధి, శ్రవణ నక్షత్రం కలిసిన రోజు చేసుకోవాలి. అందువల్ల మన తెలుగు వాళ్లంతా అక్టోబర్ 15న పండుగ చేసుకుంటున్నారు.

English summary

What is the story behind Dussehra?

What is the story behind Dussehra?
Desktop Bottom Promotion