For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కొత్త పెళ్లికూతురు అత్తారింట్లో ముందుగా కుడికాలే ఎందుకు పెట్టాలి ??

By Swathi
|

పెళ్లైన నూతన వధూవరులు ఇంటికి రాగానే కొత్తకోడలిని కుడికాలు లోపలికి పెట్టి రమ్మని ఆహ్వానిస్తారు. పెళ్లి తర్వాత పట్టుబట్టలతో అత్తారింటికి తొలిసారి వచ్చిన కోడలు.. కుడికాలు గుమ్మంలో పెట్టాలి అనే సంప్రదాయం గురించి చాలా మందికి తెలుసు. కానీ దీనివెనక ఉన్న రహస్యం, ఆంతర్యం మాత్రం చాలా కొద్దిమందికే తెలుసు.

కొత్తగా వివాహమైన వధువు.. అత్తింటికి వచ్చేటపుడు.. ఇంట్లోకి ముందుగా కుడికాలే పెట్టాలి. కుడికాలే ఎందుకు ముందు పెట్టాలి ? నూతన వధువుకే ఎందుకు కుడికాలు పెట్టి రావాలని పెద్దవాళ్లు సూచిస్తారు ? కుడి చేత్తోనే ముఖ్యమైన పనులు చేయడం, కుడికాలు ముందు పెట్టాలి అనడం వెనక అసలు కారణాలేంటి ? అనాదిగా వస్తున్న ఈ సంప్రదాయం వెనక సీక్రెట్ ఏంటో చూద్దాం..

అశుభం

అశుభం

ఎడమకాలు పెడితే అశుభాలు జరుగుతాయని చాలామంది నమ్ముతారు. దీనికి రామాయణంలోని సన్నివేశంతో ముడిపడి ఉంది.

హనుమంతుడు

హనుమంతుడు

సీతను వెతుకుతూ లంకకు చేరుకున్న హనుమంతుడు, కావాలని తన ఎడమకాలును మొదట ఆ నేలమీద పెడతాడు. కుడిపాదం పెడితే రావణాసురుడికి సకల శుభాలు కలుగుతాయనీ, తాను వైరానికే సిద్ధపడి వచ్చాను కాబట్టి ఎడమ పాదం పెట్టడమే మంచిదనీ భావించి అలా చేస్తాడు.

గొడవలకు పడాలంటే

గొడవలకు పడాలంటే

అంటే... గొడవ పెట్టుకోవాలని వచ్చేవాళ్లు ఎడమ పాదమే ముందుగా మోపుతారని ఈ సన్నివేశం వివరిస్తోంది. శుభం జరగాలని కోరుకునేవారు ఎవరైనా కూడా కుడి పాదమే మోపాలని తెలుపుతుంది.

కాపురంలో కలహాలు

కాపురంలో కలహాలు

ఎడమ పాదం ముందుగా ఇంట్లోకి పెడితే.. అక్కడ ఎప్పుడూ గొడవలు... సమస్యలతో కాపురంలో కలహాలు ఎక్కువగా ఉంటాయని ఒక నమ్మకం ఉంది.

సకల శుభాలు

సకల శుభాలు

కుడికాలు ముందు పెడితే.. సకల శుభాలు కలుగుతాయని భావిస్తూ.. వరుడుతో కలిసి నూతన వధువు తన అత్తగారింట్లోకి ముందుగా కుడికాలు పెడుతూ గృహప్రవేశం చేసే ఆచారం తరతరాలుగా వస్తోంది.

బాగు కోరేవాళ్ల ఇంట్లో

బాగు కోరేవాళ్ల ఇంట్లో

కేవలం అత్త వారింటికి కోడలు వచ్చే విషయంలోనే కాదు ... ఎవరి బాగు కోరతామో వారి ఇంట్లో కుడిపాదం ముందుగా పెట్టాలని పండితులు సూచిస్తున్నారు.

గ్రహాలు, శరీర భాగాలు

గ్రహాలు, శరీర భాగాలు

విశ్వంలోని గ్రహాలకు మనిషి శరీరంలోని భాగాలకు సంబంధం ఉందని శాస్త్రం చెబుతోంది.

గ్రహాలు, శరీర భాగాలు

గ్రహాలు, శరీర భాగాలు

శిరస్సుకు సూర్యుడు, ముఖానికి చంద్రుడు, కంఠానికి కుజుడు, శరీరంలోని ఎడమ భాగానికి బుధుడు, కుడి భాగానికి బృహస్పతి, హృదయానికి శుక్రుడు, మోకాళ్లకు శని, పాదాలకు రాహుకేతువులు ప్రాధాన్యం వహిస్తారు.

కుడిభాగానికి బృహస్పతి

కుడిభాగానికి బృహస్పతి

శరీరంలో కుడి భాగానికి ప్రాధాన్యత వహించే బృహస్పతి సర్వ శుభకారకుడు అని చెబుతారు. అందుకే.. తొలిసారి అత్తగారింటికి వచ్చే కొత్త కోడలు కుడికాలు గుమ్మంలో పెట్టి ఇంట్లోకి అడుగుపెట్టడం మంచిదని శాస్త్రం.

వివాహం, సంతానానికి బృహస్పతి

వివాహం, సంతానానికి బృహస్పతి

వివాహం, దాంపత్యం, సంతానం వంటి వాటికి బృహస్పతే మూల కారకుడు. ఏ శుభకార్యంలోనైనా కుడి కాలు ముందు మోపడం, కుడి చేత్తోనే పనులు ప్రారంభించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం.

ఎక్కడైనా

ఎక్కడైనా

సొంతిళ్లైనా సరే ఎవరింటికైనా తొలిసారి వెళ్లినా కుడిపాదమే ముందుగా మోపాలని శాస్త్రాలు చెబుతున్నాయి.

సంతోషం కావాలంటే

సంతోషం కావాలంటే

కాబట్టి ఎక్కడైతే సఖ్యత, సంతోషం, ఆత్మీయత, సంపద ఉండాలని కోరుకుంటామో.. అక్కడికి కుడికాలు ముందుగా పెట్టాలని శాస్త్రాలు చెబుతున్నాయి.

English summary

When a bride enters her new home why is she asked to keep right leg first?

When a bride enters her new home why is she asked to keep right leg first?
Story first published:Wednesday, September 7, 2016, 11:46 [IST]
Desktop Bottom Promotion