For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  శని వృశ్చికరాశిని వదిలి అదృష్టాలను తెస్తున్నాడు!

  By Bharath Reddy
  |

  శని గ్రహం తన నివాసాన్ని వేరో రాశిలోకి మార్చుకోనుంది. ఈ గ్రహం అన్ని జన్మ రాశుల్లోనూ నిర్ణీత కాలం పాటు ఉంటూ మళ్లీ వేరే గ్రహంలోని ప్రయాణిస్తూ ఉంటుంది. ఈ గ్రహం 30 ఏళ్ల కాలపరిమితిలో ఒక్కో జన్మ రాశిలో రెండున్నరేళ్లు ఉంటుంది. తర్వాత వేరో రాశిలోకి ప్రవేశిస్తుంది. ప్రస్తుతం వృశ్చిక రాశిలో ఉన్న 26 అక్టోబర్ 2017న ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తుంది. వృశ్చికం నుంచి ధనస్సులోకి శని మారడం వల్ల ఆ రాశి వారికి ఏలినాటి శని చివరి దశకు చేరుకుంటుంది. మీరు వృశ్చిక రాశికి చెందిన వారా? అయితే మీరు చాలా లక్కీ. ఇక మీ జీవితంలో నుంచి శని వెళ్లిపోయాడు. అందుకే వృశ్చిక రాశి వారు ఇక మనసారా ఊపిరి పీల్చుకోండి. వృశ్చిక రాశి వారితో పాటు మరో రెండు రాశుల వారికి ఇక అంతా గుడ్ టైమే ఉంటుంది. అక్టోబరు 26, 2017న ఈ అద్భుతం జరగనుంది.

  zodiac signs

  ఈ అమావాస్య రోజు శనిదేవుడిని కంపల్సరీ పూజించాలి.!! ఎందుకు ??

  శని గ్రహాన్ని అందూ పాపాత్మకమైన గ్రహంగా భావిస్తారు. అది అంటేనే భయపడతారు. దురద్రుష్టానికి కేరాఫ్ గా పరిగణిస్తారు. ఎందుకంటే అది ఒక వ్యక్తి అదృష్టం విధిని పూర్తిగా మారుస్తుంది. అయితే జ్యోతిష్యుల ప్రకారం ఆ అద్భుతం ఈ రోజు 12 మధ్యాహ్నం నుంచి జరగనుంది. శని ధనుస్సు రాశి వైపు కదులుతుంది.

  అందువల్ల వృశ్చికం మరో రెండు రాశిచక్రాల వారికి ఎన్నో ప్రయోజనాలు చేకూరనున్నాయి. వేద జ్యోతిషశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహం గా పరిగణించబడిన శని ప్రజల జీవితాలపై మాత్రం భారీ ప్రభావం చూపుతూనే ఉంటుంది.

  zodiac signs

  శనిగ్రహ దోష నివారణకు ఏం చేయాలి..?

  శోని గోచార్ అనేది వృశ్చికం రాశి నుంచి ముగుస్తుంది. ఇది ఇతర రాశిచక్రమైన ధనుస్సులోకి ప్రవేశించనుంది. దీంతో వృశ్చికం రాశి వారికి బ్యాడ్ కాస్త ముగిసినట్లేనని చెప్పవచ్చు. అయితే దీనికి కొంత సమయం పడుతుంది.

  మేషం

  మేషం

  ఈ రాశి వారు జూన్, అక్టోబరు మధ్య కాలంలో ఆరోగ్య పరంగా కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటారు. కానీ ఈ రోజు తర్వాత వీరి నక్షత్రాలు మారిపోతాయి. మరొక వైపు, ఈ రాశి వారికి వారి బంధువులు, సహచరులతో మంచి సానిహిత్యం ఏర్పడుతుంది. ఆ అనుబంధం ఎప్పటికీ నిలిచిపోతుంది.

  మేషరాశి గురించి మరికొంత...

  మేషరాశి గురించి మరికొంత...

  జ్యోతిషశాస్త్రం ప్రకారం ఈ రాశివారు వ్యాపార విస్తరణలు లేదా ఏదైనా వ్యవస్థాపనలు చేయడానికి ఈ సంవత్సరం వీరికి చాలా మంచిది. ఈ రాశి అలాగే మరో 6 నెలల్లో ఈ రాశి వారి జీవితాల్లో వారి లైఫ్ ను టర్న్ చేసే సంఘటనలు చోటుచేసుకుంటాయి. అయితే ఇప్పటికే ఈ రాశివారి జీవితాల్లో ఆనందం ప్రవేశించింది.

  సింహరాశి

  సింహరాశి

  ఏడాది పాటుగా ఈ రాశివారు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి కొంత ఉపశమనం పొందుతారు. నక్షత్రాల మార్పు జరుగుతుండటంతో తరువాత ఈ సంవత్సరం మధ్య నాటికల్లా ఈ రాశి వారు స్వంత ఇంటిని నిర్మించుకునే అవకాశాలు చాలా ఉన్నాయి.

  సింహరాశి వారికి మరింత అదృష్టం

  సింహరాశి వారికి మరింత అదృష్టం

  సింహరాశి వారి జీవితంలోకి మరింత అదృష్టం రానుంది. ఈ సమయంలో మీ అధికారులు, సీనియర్లు మిమ్మల్ని మెచ్చుకునే అవకాశం ఉంది. అలాగే వారితో బంధం గట్టిపడనుంది. ఎందుకంటే గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. అందువల్ల ఇక మీదంతా మంచి సమయమే. మీ చుట్టూ అంతా గుడ్ టైం నడుస్తుంది. మీరు చేయవలసినదంతా మీ కోపాన్ని నియంత్రించుకోవడమే.

  తులరాశి

  తులరాశి

  ఈ రాశి చక్రం వారు ఇక ప్రతి క్షణం ఆనందమయమే. 3 సంవత్సరాల పాటు ఈ రాశి వారు సంతోషమయమైన జీవితాన్ని గడపనున్నారు. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వద్దన్నా వస్తుంటాయి. అలాగే వ్యక్తిగత జీవితాలు హ్యాపీగా ఉంటాయి. ఇక ఈ రాశుల వారికి ఎవరైనా మొండి బకాయిలుంటే వారు కూడా వీరి వద్దకే వచ్చి డబ్బు చెల్లించిపోతారు.

  తులరాశి వారికి ముందున్నది అంతా మంచికాలమే

  తులరాశి వారికి ముందున్నది అంతా మంచికాలమే

  మీ భాగస్వామితో సంబంధాలను చక్కదిద్దుకోవడానికి ఇది మంచి సమయం. మీరు భయాలను పక్కన పెట్టగలిగితే అంతటా విజయాలు మీవే. మీ వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితం నిలకడగా ఉంటుంది. ఇక మీకు మరో కొత్త ప్రాంతంలో కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉంది.

  English summary

  When Shani Moves Out Of Scorpio And Other Zodiacs And Brings In Luck

  Here are detailed astrological predictions of what happen to the sign Scorpio when Shani moves out of it on Oct 26th!
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more