ఈ దీపావ‌ళికి మీ రాశిని బ‌ట్టి ఏ రూపంలో ఉన్న ల‌క్ష్మీ దేవ‌త‌ను కొలిస్తే మంచిదో తెలుసుకోండి!

By: sujeeth kumar
Subscribe to Boldsky

దీపావ‌ళి పండుగ‌కు ఇంకా రెండు రోజులే స‌మ‌య‌ముంది. పండుగ‌ను జ‌రుపుకోవాల‌నే ప్ర‌తి ఒక్క‌రిలోను ఉద్వేగం వెల్లివిరియ‌వ‌చ్చు. మిఠాయిల సువాస‌న‌లు ప‌ర‌వ‌శం క‌లిగించొచ్చు. అల‌సిపోయే దాకా కొనుగోలు చేయండి లాంటి దీపావ‌ళి ఆఫ‌ర్లు వినియోగ‌దారుల‌ను ఆక‌ట్టుకుంటుండొచ్చు. ప్ర‌తి ఏటా ఈ కాంతుల పండుగ స‌రికొత్త సంతోషాల‌ను పంచుతుంది. న‌వ శ‌క‌ ప్రారంభానికి గుర్తుగా ఈ పండుగ‌ను జ‌రుపుకుంటాం. ఏవైనా ప‌నులు కొత్తగా ప్రారంభించాల‌న్నా ఈ రోజే మొద‌లుపెడ‌తాం.

మీ రాశిని బట్టి మీరు ఏదేవుడిని పూజిస్తే మంచిది ?

Lakshmi

ల‌క్ష్మీ మాత‌- దీపావ‌ళి దేవ‌త‌

ల‌క్ష్మీ దేవ‌త‌ను పూజించ‌నిదే దీపావ‌ళి పూర్తి కాదు. ఈ పండుగ‌కు ప్ర‌తీక ల‌క్ష్మీ దేవ‌త‌. దీపావ‌ళితో ముడిప‌డిన ప్ర‌తి అంశం ల‌క్ష్మీ మాత‌తో ముడిప‌డి ఉంటుంది. కొత్తగా ఏదైనా ప్రారంభించేందుకు, జీవితంలో మార్పులు చేసుకునేందుకు వివేకాన్ని ఆ దేవ‌త ప్ర‌సాదిస్తుంది. స‌క్సెస్ అందుకునేందుకు క‌ష్ట‌ప‌డే తత్వం, ఒక‌రి జీవిత ప్ర‌మాణాలు మెరుగ‌య్యేలా చేసుకునేందుకు సంప‌ద వెల్లివిరిసేలా చేయ‌గ‌ల మ‌హ‌త్యం మాతా ల‌క్ష్మీ దేవ‌త‌కుంది.

Lakshmi

ధ‌న‌త్ర‌యోద‌శి రోజున కుబేర పూజ

దీపావ‌ళి తొలి రోజును ధంతేరాస్ గా జ‌రుపుకుంటారు. ఈ రోజున ల‌క్ష్మీ కుబేర పూజ జ‌రుపుతారు. ధంతేరాస్ లేదా ధ‌న‌త్ర‌యోద‌శి రోజున మాతా ల‌క్ష్మీని, కుబేర దేవుడిని విశిష్టంగా కొలుస్తారు. ఆయుఃరారోగ్యాలు, సిరిసంప‌ద‌లు వెల్లివిరియాల‌ని ప్ర‌జ‌లు కోరుకుంటారు. ధంతేరాస్ రోజు పూజ‌లు చేయ‌డం వ‌ల్ల మంచి అవ‌కాశాలు ల‌భిస్తాయ‌ని జ్యోతిష్యం చెబుతుంది.

Lakshmi

వివిధ రూపాల‌కు పూజ‌లు

మాల‌క్ష్మీ దేవ‌త‌ను వివిధ రూపాల్లో కొలుస్తారు. సిరి సంప‌ద‌ల‌కు ల‌క్ష్మీ దేవి ప్ర‌తీక‌. ఆమెకున్న విశిష్ట రూపాలకు ప్ర‌త్యేక‌మైన మ‌హ‌త్యాలున్నాయి. రాశిఫ‌లాల ఆధారంగా ల‌క్ష్మీ దేవికి వివిధ అవ‌తారాలు ఆపాదించారు. మీ రాశిఫ‌లాలను బ‌ట్టి దేవ‌త‌ అవ‌తారాన్ని విశిష్టంగా కొల‌వ‌డం ద్వారా సాధ్య‌మైనంత ఎక్కువ ప్ర‌యోజ‌నాలు ఎలా పొందాలో తెలుసుకుందాం.....

1. మేష‌, వృశ్చిక రాశుల‌వారు

1. మేష‌, వృశ్చిక రాశుల‌వారు

మేష‌, వృశ్చిక రాశుల‌వారు మంగ‌ళ గ్ర‌హం లేదా మార్స్‌కు చెందిన‌వారుగా భావిస్తారు. కాబ‌ట్టి వీళ్లు మాతా భ‌గ‌వ‌తీ అవ‌తారాన్ని కొలిస్తే మంచిది. మా భ‌గ‌వ‌తీ అవ‌తారాన్ని కొల‌వ‌డం వ‌ల్ల ఈ రాశుల‌కు చెందిన‌వారు అనేక ప్ర‌యోజ‌నాలు పొంద‌గ‌లుగుతారు. ప‌సుపు రంగులో పువ్వుల‌ను, గులాబీల‌ను దేవ‌త‌కు ప్ర‌సాదించాలి. గోదుమ పిండి, బెల్లంతో చేసిన ప‌దార్థాల‌ను నైవేద్యంగా పెట్ట‌డం మంచిది.

2. మూడు రోజుల పండుగ‌

2. మూడు రోజుల పండుగ‌

దీపావ‌ళి మూడు రోజుల పండుగ‌. ఈ పండుగ సంద‌ర్భంగా మూడు రోజుల‌పాటు ల‌క్ష్మీ మాత‌ను కొలుస్తారు. ప్ర‌తి దినానికి ఓ ప్ర‌త్యేక‌త ఉంది. ధ‌న‌త్ర‌యోద‌శి, న‌ర‌క చతుర్ద‌శి, దీపావ‌ళి ప‌ర్వ‌దినం. దేవ‌త పేరిట మూడు రోజుల పాటు క‌ర్మ‌కార్యాల‌ను చేయ‌డం వ‌ల్ల అనుకున్నది సిద్ధిస్తుంద‌ని జ్యోతిష్య‌శాస్త్ర‌వేత్త‌లు చెబుతారు.

3. వృష‌భ‌, తుల‌రాశుల‌వారు..

3. వృష‌భ‌, తుల‌రాశుల‌వారు..

వృష‌భ‌, తుల రాశుల‌వారు ఈ పండుగ సంద‌ర్భంగా మా మాతంగి దేవిని కొలిస్తే శుభ‌ఫ‌లితాలు వ‌స్తాయి. ఈ రాశుల‌కు చెందిన‌వారు శుక్ర గ్ర‌హానికి (వీన‌స్‌)చెందిన‌వారుగా భావిస్తారు.వీళ్లు మాతంగి దేవిని పూజించ‌డం వ‌ల్ల సిరిసంప‌ద‌లు వెల్లివిరుస్తాయి. ఈ సంద‌ర్భంగా మాత‌కు ప‌విత్ర‌మైన జ‌లాన్ని, తెల్ల‌ని పువ్వుల‌తో పూజించాలి. దీంతో వారి జీవితాల్లో సంతోషాలు, సిరిసంప‌ద‌లు మెండుగా ఉంటాయి.

4. ల‌క్ష్మీ కుబేర యాగం

4. ల‌క్ష్మీ కుబేర యాగం

లక్ష్మీ దేవ‌త‌, కుబేర భ‌గ‌వానుడిని పూజించ‌నిదే ల‌క్ష్మీ కుబేర యాగం పూర్తి కాదు. ఈ యాగానికి చాలా విశిష్ట‌త ఉంది. వ్యాపారంలో అనంత‌మైన ధ‌న సంప‌ద‌ను, అపార‌మైన లాభాల‌ను ఈ యాగ‌ ఫ‌లితం ఇవ్వ‌గ‌ల‌దు అని ఓ న‌మ్మ‌కం. దేవత‌ల ఆశీర్వాదం పొందేందుకు ఇది పాటిస్తారు. జ్యోతిష్యులు ఈ యాగం చేయ‌డం మంచిద‌ని సూచిస్తారు.

5. మిథున‌, క‌న్యా రాశుల‌వారికి

5. మిథున‌, క‌న్యా రాశుల‌వారికి

మిథునం(జెమిని), క‌న్య(వర్గో) రాశుల‌వారిని బుధ‌గ్రహానికి( మెర్‌క్యూరి ప్లానెట్‌) చెందిన‌వారుగా భావిస్తారు. ఈ రాశివారు మాతా భ‌గ‌వాన్ త్రిపుర భైర‌వి మాత రూపంలో ఉన్న ల‌క్ష్మీ దేవ‌త‌ను కొలిస్తే మంచి ఫ‌లితం ఉంటుంది. దీపావ‌ళి రోజున ఈ అవ‌తారంలో ఉన్న మాత‌ను కొలిస్తే స‌క‌ల సంప‌ద‌లు, సుఖ‌సంతోషాలు, మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంద‌ని న‌మ్మ‌కం. సుగంధి పాల‌ను నైవేద్యంగా, ప‌విత్ర జ‌లంతో, గులాబీ పువ్వుల‌తో అమ్మ‌వారిని కొల‌వ‌మ‌ని పురోహితులు చెబుతారు.

6. క‌ర్కాట‌క రాశివారు

6. క‌ర్కాట‌క రాశివారు

క‌ర్కాట‌క రాశివారిని చంద్రుడు ఏలుతాడు అని చెబుతారు. ఈ రాశిలో జ‌న్మించిన‌వారు దుర్గామాత అవ‌తారాన్ని కొలిస్తే స‌త్ఫ‌లితాలుంటాయి. దుర్గామాత చ‌ల్ల‌గా చూస్తుంది. అంతేకాకుండా మ‌న‌సుకు ప్ర‌శాంత‌త‌ను, మంచి ఆరోగ్యాన్ని ప్ర‌సాదిస్తుంది. దుర్గామాత‌కు దీపావ‌ళి రోజున క్షీరాన్నంతో నైవేద్యం పెట్టాల‌ని అంటారు. తెల్ల‌ని మ‌ల్లె పూల‌తో దేవ‌త‌ను కొల‌వాలంటారు. దుర్గా మాత‌ ఆశీస్సుల‌తో భోగ‌భాగ్యాలు అందుతాయ‌ని న‌మ్ముతారు.

7. ల‌క్ష్మీ, గ‌ణ‌ప‌తుల పూజ‌

7. ల‌క్ష్మీ, గ‌ణ‌ప‌తుల పూజ‌

సుఖ‌సంతోషాలు, సిరిసంప‌ద‌లు, జ్ఞానం, వివేకం లాంటివి క‌లిగేందుకు ల‌క్ష్మీ గ‌ణ‌ప‌తుల పూజ చేయాల‌ని అంటారు. ఈ రోజు ల‌క్ష్మీ దేవ‌త పూజ‌తో పాటు వినాయ‌కుడిని విశేషంగా పూజిస్తారు. ల‌క్ష్మీ దేవ‌త సంప‌ద‌కు, వివేకానికి, ప‌ట్టుద‌ల‌కు ప్ర‌తీక‌లైతే... గ‌ణేశుడు సంతోషానికి జ్ఞానానికి చిహ్నాం. ఇద్ద‌రినీ పూజించ‌డం వ‌ల్ల మంచిత‌నం పెరుగుతుంద‌ని మంచి జీవితం ప్ర‌సాదిత‌మ‌వుతుంద‌ని పురోహితులు చెబుతారు.

8. సింహ రాశివారికి సోనాక్షి మాత‌...

8. సింహ రాశివారికి సోనాక్షి మాత‌...

సింహ రాశి వారు సోనాక్షి మాత‌ను కొలిస్తే మంచిది. ఈ రాశివారిని సూర్యుడు ఏలుతాడ‌ని ప్ర‌శ‌స్తి. దీపావ‌ళి రోజున ఈ రాశివారు సోనాక్షి మాతను కొలిస్తే మంచిదంటారు. మాత‌ను గులాబీ, క‌మ‌లం పువ్వుల‌తో పూజిస్తే ఆర్థిక‌ప‌రంగా మంచి లాభాల‌ను పొందే అవ‌కాశ‌మున్న‌ట్టు చెబుతారు.

9. ధ‌ను, మీన రాశుల‌వారికి

9. ధ‌ను, మీన రాశుల‌వారికి

ధ‌ను(సాజిటేరియ‌స్‌), మీన‌(పైస‌న్‌) రాశుల‌వారు మాత బంగ్లా దేవిని దీపావ‌ళి రోజున‌ పూజించ‌డం వ‌ల్ల అదృష్టం క‌లిసొస్తుందంటారు. ఈ రాశుల‌వారు బృహ‌స్ప‌తి(జూపిట‌ర్‌) గ్ర‌హం అధీనంలో ఉంటార‌ని అంటారు. మాత బంగ్లా దేవి, మాత భ‌గ‌వ‌తి రూపంలోని దేవ‌త‌ల‌ను పూజిస్తే జీవితంలో చ‌క్క‌ని అదృష్టం క‌లిసొస్తుందంటారు. దేవ‌త‌ల‌కు మొగ్రా పువ్వుల‌తో అలంక‌రించాలి. ఇంకా బియ్యం, ప‌సుపు, కుంకుమ‌ల‌ను ముందుంచి పూజించాలి. సంప‌ద‌ను, అదృష్టాన్ని ఇవి ఆహ్వానిస్తాయ‌ని న‌మ్ముతారు.

10. మ‌క‌ర‌, కుంభ రాశుల‌వారికి

10. మ‌క‌ర‌, కుంభ రాశుల‌వారికి

మ‌క‌ర‌( క్యాప్రికాన్‌), కుంభ‌(ఆక్వారియ‌స్‌) రాశుల‌వారు శ‌ని గ్ర‌హం(సాట‌ర్న్‌) ఏలుబ‌డిలో ఉంటారని చెబుతారు. ఈ రాశుల‌కు చెందిన‌వారు దీపావ‌ళి రోజున కాళి మాత‌ను పూజిస్తే బాగుంటుంద‌ని చెబుతారు. కాళిక మాత‌ను మొగ్రా, మ‌ల్లె, నైట్ క్వీన్ పువ్వులుతో ప్ర‌స‌న్నం చేసుకోవాలి. బాదం హ‌ల్వా కాళి మాత‌కు ప్రీతిపాత్ర‌మైన‌ది. ఆర్థిక‌ప‌ర‌మైన ఇబ్బందులు రాకుండా ఉండాలంటే నైవేద్యంగా బాదం హ‌ల్వా పెట్టి మాత‌ను కొలిస్తే ఫ‌లితం ఉండొచ్చు.

English summary

Which Form of Lakshmi should You Worship this Diwali based on your zodiac sign

Which Form of Lakshmi should You Worship this Diwali based on your zodiac sign, Read to know more about it..
Story first published: Wednesday, October 18, 2017, 12:00 [IST]
Subscribe Newsletter