For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఏ రాశి వారు ఏ అమ్మవారి రూపాన్ని ఆరాధించాలో తెలుసా..

|

అమ్మల గన్న అమ్మ దుర్గమ్మ. దుర్గాదేవి తన నిజమైన భక్తుల జీవితాలకు ఎల్లప్పుడూ మార్గనిర్దేశం చేస్తుంది. జ్ఞానాన్ని, కాంతిని అందిస్తుంది. భక్తుల మనసులో ఉండే భ్రమలన్నీ తొలగిస్తుంది. అలాగే మనస్ఫూర్తిగా కొలిచిన వారిని ఆశీర్వదిస్తుంది. పురాణాల ప్రకారం దుర్గామాత రాక్షసులను చంపడానికి జన్మించిన ఉత్తమ మహిళా శక్తిగా భక్తులందరూ నమ్ముతారు. ఈమె పార్వతీ దేవి మరో స్వరూపని కూడా చెబుతారు. మహిషాసురుడు అనే భయంకరమైన రాక్షసుడిని శివుడు ఆదేశించినపుడు ఆమెకు తొమ్మిది రూపాలలో ఉన్న దేవతలు పూర్తి మద్దతు ఇచ్చారు. నవరాత్రుల సమయంలో దుర్గాదేవిని ఆరాధించేందుకు అత్యంత పవిత్రమైన సమయం అని భక్తులందరి విశ్వాసం. అందుకే దుర్గా పూజ సమయంలో ఈ దేవత యొక్క తొమ్మిది రూపాలను ఆరాధించడాన్ని ఎంతో ముఖ్యమైనదిగా భక్తులందరూ భావిస్తారు. ఈ సందర్భంలోనే అమ్మవారిని ద్వాదశ రాశులలో ఏ రాశి వారు ఏ రూపాన్ని ఆరాధించాలో.. ఎలా పూజించాలో తెలుసుకునేందుకు అయితే ఈ స్టోరీని పూర్తిగా చూడండి.

1) మేష రాశి (మార్చి 21 - ఏప్రిల్ 20)

1) మేష రాశి (మార్చి 21 - ఏప్రిల్ 20)

మేష రాశి కలిగిన వారు అమ్మవారి శైలుపుత్రి రూపాన్ని ఆరాధించాలి. నవరాత్రి తొలిరోజున దుర్గామాతను ఈ రూపంలో పూజిస్తారు. దుర్గా చలిసాతో పాటు సప్తషాతిని కూడా జపించవచ్చు.

2) వృషభరాశి (ఏప్రిల్ 21 - మే 21)

2) వృషభరాశి (ఏప్రిల్ 21 - మే 21)

వృషభరాశి వారు దేవత యొక్క మహాగౌరీ రూపాన్ని ఆరాధించాలి. ఆమెను లలిత మాత అని కూడా పిలుస్తారు. ఆ దేవత ఆశీర్వాదం పొందడానికి లలిత సహస్రనామ మంత్రాలను, స్తోత్రాలను భక్తులు జపించాలి. అప్పుడు ఆ దేవత తన భక్తులను ఆశీర్వదిస్తుంది. పెళ్లి కాని మహిళలు తమకు మంచి భర్త రావాలని కోరుకుంటు ఉంటారు.

3) మిధున రాశి ( మే 22 - జూన్ 21)

3) మిధున రాశి ( మే 22 - జూన్ 21)

మిధున రాశి వారు బ్రహ్మచారిణీ దేవిని పూజించాలి. ఈ దేవత విద్యా రంగంలో వచ్చే సమస్యలన్నింటినీ తొలగిస్తుంది. ఈ రాశి వారంతా తారా కవాచ్ ను జపించాలి.

4) కర్కాటక రాశి (జూన్ 22 - జులై 22)

4) కర్కాటక రాశి (జూన్ 22 - జులై 22)

కర్కాటక రాశి వారు కూడా దేవత యొక్క శైలుపుత్రి రూపాన్ని ఆరాధించాలి. లక్ష్మీ సహస్రనామం జపించడం వల్ల కూడా ప్రయోజనాలు చేకూరతాయి. ఈ దేవత కూడా తన భక్తులను మనసారా ఆశీర్వదిస్తుంది.

5) సింహ రాశి (జులై 23 - ఆగస్టు 21)

5) సింహ రాశి (జులై 23 - ఆగస్టు 21)

సింహ రాశి వారు దుర్గాదేవి యొక్క కుష్మండ రూపాన్ని పూజించాలి. ఆ దేవత యొక్క మంత్రాలలో దేనినైనా 505 సార్లు జపిస్తే భక్తులకు ఫలవంతమైనదిగా భావిస్తారు. మీ జీవితంలో సర్వం విజయంవంతం కావడానికి ఈ రూపంలో ఉన్న దేవతను ఆరాధించాలి.

6) కన్య రాశి (ఆగస్టు 22 - సెప్టెంబర్ 23)

6) కన్య రాశి (ఆగస్టు 22 - సెప్టెంబర్ 23)

కన్య రాశి వారు కూడా బ్రహ్మచారిణి దేవిని పూజించాలి. అలాగే మీరు లక్ష్మీ దేవి మంత్రాలను కూడా జపించవచ్చు. సరస్వతి దేవీ మాదిరిగానే ఈ దేవత కూడా తన భక్తులకు జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది.

7) తులా రాశి (సెప్టెంబర్ 24 - అక్టోబర్ 23)

7) తులా రాశి (సెప్టెంబర్ 24 - అక్టోబర్ 23)

తులా రాశి వారు మహాగౌరి దేవిని ప్రార్థించాలి. దుర్గా సప్తశతి యొక్క ప్రథమ స్తోత్రాన్ని జపించాలి. మహాకాళి స్తోత్రం లేదా కాశీ చలిసాను కూడా జపించొచ్చు. ఈ దేవత తమ భక్తులకు సంతోషకరమైన వివాహ జీవితం కలిగేలా ఆశీర్వదిస్తుంది. పెళ్లికాని అమ్మాయిలు తాము ఇష్టపడే భర్తను పొందాలనే కోరికను కూడా నెరవేరుస్తుంది.

8) వృశ్చిక రాశి (అక్టోబర్ 24 - నవంబర్ 22)

8) వృశ్చిక రాశి (అక్టోబర్ 24 - నవంబర్ 22)

వృశ్చిక రాశి వారు స్కందమాత రూపానికి పూజలు చేయాలి. దుర్గా సప్తశతి మార్గాన్ని పఠించడం వల్ల ఈ రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు చేకూరతాయి. శిశువుతో ఆశీర్వదించబడినందుకు ఆమె సాధారణంగా పూజిస్తారు. అయినప్పటికీ మీరు అన్ని ఇతర కోరికలను కూడా నెరవేర్చవచ్చు.

9) ధనస్సు రాశి (నవంబర్ 23 - డిసెంబర్ 22)

9) ధనస్సు రాశి (నవంబర్ 23 - డిసెంబర్ 22)

ఈ రాశి వారు దేవత యొక్క చంద్రఘంట రూపాన్ని ఆరాధించాలి. దుర్గ మంత్రాలను రోసరీ మీద పఠించాలి. ప్రతికూల శక్తులను వదిలించుకోవడానికి మరియు మానసిక ప్రశాంతతను పొందడానికి ఈ దేవత యొక్క రూపాన్ని పూజిస్తారు.

10) మకర రాశి ( డిసెంబర్ 23 - జనవరి 20)

10) మకర రాశి ( డిసెంబర్ 23 - జనవరి 20)

ఈ రాశి వారు కలరాత్రి దేవిని పూజించాలి. ఆమె భక్తుల జీవితం నుండి అన్ని రకాల భయాలను కూడా తొలగిస్తుంది. దుష్ట కంటి ప్రభావాలు మరియు దుష్ట శక్తుల ప్రభావాలు వంటి ప్రతికూల శక్తులను కూడా ఆమె నాశనం చేస్తుంది.

11) కుంభ రాశి (జనవరి 21 - ఫిబ్రవరి 19)

11) కుంభ రాశి (జనవరి 21 - ఫిబ్రవరి 19)

కుంభరాశి వారు కూడా దేవత యొక్క కలరాత్రి రూపాన్ని పూజించవచ్చు. అక్వేరియన్లు దుర్గా మంత్రాలు మరియు దుర్గా దేవి కవాచ్ (దుర్గా సప్తషాతి మార్గంలో ఒక భాగం) అనే మంత్రాన్ని

12) మీన రాశి (ఫిబ్రవరి 20 - మార్చి 20)

12) మీన రాశి (ఫిబ్రవరి 20 - మార్చి 20)

ఈ రాశివారు చంద్రఘంట రూపాన్ని పూజించాలి. దుర్గాదేవిని ప్రసన్నం చేసుకోవటానికి బాగ్లముఖి మంత్రాలను జపించాలి. ఈ రాశి వారి

జీవితంలో తరచుగా సంభవించే సమస్యలను తొలగించడం ద్వారా వారి కలలన్నింటినీ నిజం చేసుకునేందుకు ఈ అమ్మవారు ఆశీర్వదిస్తారు.

English summary

Which Form Of Goddess Durga Should You Worship As Per Zodiac?

Navratri is the most auspicious time to worship Goddess Durga. Worshipping all the nine forms of the Goddess during Durga Puja is highly significant; she can also be worshipped according to one's zodiac sign. Given below is a list which explains how you can worship Goddess Durga as per the zodiac sign.
Story first published: Wednesday, September 25, 2019, 11:19 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more