For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జీవితంలో కష్టాలు తొలగి..సుఖ, సంతోషాలను అందించే మంత్ర..పూజలు..!

|

ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. సమస్యలు వచ్చినప్పుడు దేవుడిపై భారం వేయాలంటారు. కానీ కొంత మంది సమస్యలు వచ్చినప్పుడు ఆ దేవుడు నాకు ఎందుకు ఇలాంటి శిక్ష విధిస్తున్నాడో అని భావిస్తుంటారు. మరికొందరు దేవుడా నీవే దిక్కు అని చెబుతుంటారు. కొంత మంది ఎలాంటి సమస్యనైనా ఒడిదుడుకులైనా ధైర్యంగా ఎదుర్కుంటారు.

గాయత్రి మంత్రం ఎందుకంత శక్తివంతమైనది? విశిష్టత ఏమిటి?
ఆధ్యాత్మకతపై మనసు లగ్నం చేయడం వల్ల మనకు, మన మనస్సుకి ఎంతో శక్తి సామర్థ్యాలు అందుతాయని మన భారతీయుల విశ్వాసం. ఇతరులపై జాలి, కరుణ చూపించగలుగుతారు. కాబట్టి జీవితంలో ఎదురయ్యే ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోవడానికి కొన్ని రకాల పూజలు, మంత్రాలు సహాయపడుతాయి. మీకున్న సమస్య నుండి బయటపడి సంతోషకరమైన జీవితం అనుభవించడానికి కొన్ని రకాల పూజలు, మంత్రాలు ఉపయోగపడుతాయి..అవేంటో తెలుసుకుందాం...

వినాయకుడి మంత్రం:

వినాయకుడి మంత్రం:

అన్ని రకాల ఒడిదుడుకులను మహా గణపతి మంత్రం తొలగిస్తుంది. కాబట్టి చాలా పవర్ ఫుల్ మంత్రమైన ఓం గం గణపతయే నమ: అని స్మరించుకోవడం వల్ల సమస్యలు తొలగిపోయి.. ఎల్లప్పుడూ మీకు రక్షగా ఉంటానని ఆ మహా గణపతి వివరిస్తాడు.

లక్ష్మీ మంత్రం:

లక్ష్మీ మంత్రం:

సంపద, శ్రేయస్సు ప్రసాధించే దేవతగా హిందువులు లక్ష్మీ దేవిని పూజిస్తారు. కాబట్టి ఓం శ్రీ మహా లక్ష్మియే స్వాహా అని స్మరించుకోవడం వల్ల వైవాహిక సంపద పొందగలుగుతారు. అలాగే...జీవితంలో శ్రేయస్సు పొందుతారు.

రుద్రాభిషేక పూజ:

రుద్రాభిషేక పూజ:

రుద్రాభిషేక పూజ మరో పవిత్రమైనది. శివుడి అద్భుతమైన అనుగ్రహం పొందాలంటే...ఈ పూజ చలా మంది. రుద్రాభిషేకం పూజలో భాగంగా 11 రకాల పదార్థాలతో అభిషేకం నిర్వహించి, 108 శివనామాలు స్మరిస్తారు. ఈ పూజ చేయించడం వల్ల జీవితంలో విజయం సాధించి ఉన్నత స్థానానికి చేరుకుంటారు. గ్రహదోషాలు తొలగిపోతాయి.

విజయానికి :

విజయానికి :

మీరు విజం సాధించడానికి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కానప్పుడు జేహి విధి హోయి నాత్ హిట్ మోరా కరాహు సో వేగి దాస్ మెయిన్ తోరా అని స్మరించుకోవాలి. అంటే ఓ శివ దేవా నేను మీ భక్తుడిని, నేను ఏం చేయాలో నాకు తెలియదు, కాబట్టి, నాకు ఏది మంచిదో అది చేసే శక్తని ప్రసాదించు అని అర్థం. ఈ మంత్రంలోని పరమార్థం జీవితంలో సక్సెస్ అవడానికి దారి చూపించును అని.

కాలసర్ప దోస నివారణకు పూజ:

కాలసర్ప దోస నివారణకు పూజ:

ఏడు గ్రహాలు ఒకే దగ్గర ఉన్న సమయంలో రాహు, కేతువు ఉంటే దాన్ని కాల సర్ప యోగం అంటారు. ఈ సమయంలో పుట్టిన వాళ్లకు జీవితంలో అనేక రకాల సమస్యలు, జీవితాంతం ఒడిదుడుకులు ఉంటాయి. కాబట్టి ఈ దోసం నివారించడానికి ఈ కాలసర్ప దోష పూజ చేయించుకోవాలి.

హనుమంతుడి పూజ:

హనుమంతుడి పూజ:

సూర్యోదయానికి ముందు హనుమాన్ చాలీసా మంత్రం జపిస్తూ ఆంజనేయస్వామికి పూజ చేయడం వల్ల మీకు, మీ కుటుంబానికి మంచి జరుగుతుంది. భయం తొలగించి, ధైర్యాన్ని ఇస్తుంది. ఈ పూజ జీవితంలో అన్ని రకాల సమస్యలను తొలగిస్తుంది.

శని దేవుడికి అభిషేకం:

శని దేవుడికి అభిషేకం:

శని శింగాపూర్ లో స్వయంభువుగా వెలసిన అత్యంత శక్తివంతమైన శనీశ్వరుడుకి శనిదోషం తొలగించే అద్భుతమైన శక్తి ఉంది. కాబట్టి, ఈ ఆలయాన్ని సందర్శించి తైలాభిషేకం నిర్వహించడం వల్ల కీడు, వివాహ సంబంధ దోసాలు, సమస్యలు తొలగిపోతాయి.

పార్థివ శివ లింగ పూజ :

పార్థివ శివ లింగ పూజ :

శివుడికి నిర్వహించే పూజల్లో ఇది చాలా శక్తివంతమైనది. మట్టితో చేసిన 108 శివలింగాలకు గంగానది దగ్గర అభిషేకం నిర్వహిస్తారు. ఈ పూజ ఓంకారేశ్వర్, కాఈ జ్యోతిర్లింగం ఆలయాల్లో నిర్వహిస్తారు. కాబట్టి, ఈ పూజ చేయించుకోవడం వల్ల గ్రహ దోషాలు, అనారోగ్య సమస్యలు, ఒత్తిడి తొలగిపోతాయి..

English summary

Which is good pooja mantra for happy life? / Mantra for removing Obstacles in Life

Which is good pooja mantra for happy life? Mantra for removing Obstacles in Life ,
Story first published: Thursday, September 15, 2016, 13:52 [IST]
Desktop Bottom Promotion