ఓంకార‌నాథుడైన శివుడి జ‌న్మ ర‌హ‌స్యం అత్యంత ఆస‌క్తిదాయ‌కం!

By: sujeeth kumar
Subscribe to Boldsky

హిందూ ఇతిహాసాల ప్ర‌కారం ప‌ర‌మ శివుడిని వినాశ‌కారుడిగా భావిస్తారు. ఐతిహాసాల ప్ర‌కారం త్రిమూర్తుల్లో ఆ మ‌హాదేవుడికి ప్ర‌త్యేక‌మైన స్థానం ఉంది. త్రిమూర్తుల్లో మ‌రో ఇద్ద‌రు బ్ర‌హ్మ‌దేవుడు, విష్ణుదేవుడు. బ్ర‌హ్మ సృష్టిక‌ర్త కాగా విష్ణువు ర‌క్ష‌ణ‌కారుడు. హిందువులు అనేక ర‌కాలుగా ఈ దేవుళ్ల‌ను పూజిస్తుంటారు.

మ‌హాశివుడి అవ‌తారం భ‌క్తుల‌ను సంభ్ర‌మాశ్చ‌ర్యాల్లో ముంచెత్తుతుంది. ప‌ర‌మేశ్వ‌రుడికి మూడు క‌ళ్లు. అందుకే ముక్కంటిగా పిలుస్తారు. మెడ‌కు పాము చుట్టుకొని ఉంటుంది. శ‌రీరమంతా బూడిద పూసుకొని ఉంటాడు. ఏనుగులు, పులి చ‌ర్మాన్ని శ‌రీరానికి కప్పుకొని ఉంటారు. ప‌ర‌మ‌శివుడు కోపాగ్నికి బాగా ప్ర‌సిద్ధి. ఆయ‌న కోపానికి మ‌న్మ‌ధుడు మాడిమ‌సైన‌ట్టు పురాణాలు చెబుతాయి.

శివుడి జోతిర్లింగాల గురించి అద్భుత రహస్యాలు: మొదటి జోతిర్లింగం సోమేశ్వరం యొక్క ప్రాముఖ్యత

మ‌హాశివుడు జ‌న్మ ప్ర‌స్థానం....

మ‌హాశివుడు జ‌న్మ ప్ర‌స్థానం....

ప‌ర‌మేశ్వ‌రుడు జ‌న్మ క‌థ‌నం చాలా ఆస‌క్తిక‌రంగా ఉంటుంది. హిందువుల ప్ర‌కారం ఒక నాడు మ‌హా విష్ణువు, బ్ర‌హ్మ‌దేవుడు ఒక విష‌య‌మై తీవ్రంగా వాదించుకుంటున్నారు. ఇద్ద‌రిలో నేను గొప్ప అంటే నేను గొప్ప అని అనుకుంటున్నారు. శ‌క్తివంతుల్లో ఎవ‌రికి వారే అన్న‌ట్టు మాట‌ల యుద్ధం మొద‌లుపెట్టారు. ఇంత‌లో వారి వాగ్వాదానికి అడ్డుక‌ట్ట వేస్తూ ఒక స్తంభం ప్ర‌త్య‌క్ష‌మ‌వుతుంది. అది అంత‌కంత‌కు పెరుగుతూ పోతుంది. దేవుళ్లిద్ద‌రికీ అదేమిటో ఆశ్చ‌ర్యం క‌లిగిస్తుంటుంది. ఆ స్తంభం పై కొస‌, కింద కొస క‌నిపించ‌డం లేదు. ఆకాశ‌పుటంచుల‌ను చీల్చుకుంటూ వెళ్లింది. భూమిలోని అంతే ప‌రిస్థితి. దీని సంగ‌తేమిటో చూద్దామ‌ని ఇద్దరు దేవుళ్లు నిశ్చ‌యించుకున్నారు.

బ్ర‌హ్మ‌దేవుడు ప‌క్షిగా మారి పైకి వెళ్ల‌ాడు.......

బ్ర‌హ్మ‌దేవుడు ప‌క్షిగా మారి పైకి వెళ్ల‌ాడు.......

అనుకున్న‌ట్టుగానే బ్ర‌హ్మ‌దేవుడు ప‌క్షిగా మారి పైకి వెళ్ల‌నారంభించాడు. ఇక మ‌హావిష్ణువు అడ‌వి పందిగా మారి భూమిలోప‌లికి వెళ్ల‌సాగాడు. ఎంత వెళ్లినా వారికి స్తంభం అంతం కనిపించ‌లేదు. ఇలా ఏళ్ల త‌ర‌బ‌డి అన్వేష‌ణ కొన‌సాగింది. ఇద్ద‌రు ఎంతో అల‌సిపోయి త‌మ త‌మ స్థానాల‌కు వ‌చ్చి క‌లుసుకున్నారు.

మ‌హాశివుడు ద‌ర్శ‌నం......

మ‌హాశివుడు ద‌ర్శ‌నం......

అక్క‌డికి చేరుకున్నాక మ‌హాశివుడు ద‌ర్శ‌నమిచ్చాడు. నూత్త‌నేత్తోజ అవ‌తారంలో ఆయ‌న క‌ళ్ల ముందు సాక్షాత్క‌రించాడు. దీంతో దేవుళ్లిద్ద‌రికీ అర్థ‌మైంది. ప‌ర‌మేశ్వ‌రుడి గొప్ప‌తనం తెలిసివ‌చ్చింది. ఆయ‌న శ‌క్తి త‌మ ఆలోచ‌న‌ల‌కు, అంచనాల‌కు మించి పోయి ఉంద‌ని వారికి అర్థ‌మైంది. వాళ్లిద్ద‌రితో పోలిస్తే మ‌హాదేవుడు చాలా శ‌క్తిమంతుడ‌ని తెలుసుకున్నారు. ఇదే మూడో శ‌క్తి ఈ విశ్వాన్ని ఏలుతుంద‌ని అప్పుడు న‌మ్మారు.

ఇతిహాసాల ప్ర‌కారం ప‌ర‌మేశ‌ర్వుడికి త‌ల్లిదండ్రులు లేరు....

ఇతిహాసాల ప్ర‌కారం ప‌ర‌మేశ‌ర్వుడికి త‌ల్లిదండ్రులు లేరు....

ఇతిహాసాల ప్ర‌కారం ప‌ర‌మేశ‌ర్వుడికి త‌ల్లిదండ్రులు లేరు. ఆయ‌న‌ను అనాదిగా వ్య‌వ‌హ‌రిస్తారు. అంటే పుట్టుక‌కు, చావుకు మించి ఉన్న‌వాడు అని అర్థం.

ప‌ర‌మ‌శివుడి జీవ‌న‌శైలి...

ప‌ర‌మ‌శివుడి జీవ‌న‌శైలి...

ప‌ర‌మ శివుడు సామాన్య‌మైన దేవుడు కాద‌ని హిందువులంద‌రూ విశ్వ‌సిస్తారు. ఆయ‌న విచిత్ర‌మైన విధానాల‌కు, అల‌వాట్ల‌కు ప్ర‌సిద్ధి. దీన్ని భూమిపై ఉన్న‌వారికి అంత సులువుగా అర్థంకాదు. ఆయ‌న అనేక అవ‌తారాల‌ను ప్ర‌ద‌ర్శిస్తుంటారు. ఎంతో శ‌క్తిమంతుడు. ఆ దేవుడికి శ్మ‌శానాల్లో తిర‌గ‌డం ఇష్టమ‌ని చెబుతారు. ఆయ‌న మెడ‌లో పుర్రెల‌ను వేసుకొని, జంతు చ‌ర్మంతో శ‌రీరాన్ని కప్పుకుంటారు.

అక్కడ శివలింగం ఎలా కదులుతుంది మిస్టరీ ఏంటి..?

భ‌క్తుల ప్ర‌కారం ప‌ర‌మ‌శివుడికి కోపం వ‌స్తే త‌ట్టుకోలేరు...

భ‌క్తుల ప్ర‌కారం ప‌ర‌మ‌శివుడికి కోపం వ‌స్తే త‌ట్టుకోలేరు...

భ‌క్తుల ప్ర‌కారం ప‌ర‌మ‌శివుడికి కోపం వ‌స్తే త‌ట్టుకోలేరు. అయితే హిమాల‌యాల్లో ఆయ‌న గంట‌లు గంట‌లు ప్ర‌శాంతంగా ధ్యానం చేసుకోగ‌ల త‌ప‌స్వి. ప్ర‌శాంత‌తతోపాటు కోప‌గుణం కూడా ఆయ‌న‌లో మెండు. దీని వ‌ల్ల ఆయ‌న నిజ‌స్వరూపాన్ని తెలుసుకోవ‌డం భ‌క్తుల‌కు క‌ష్ట‌మైపోతుంది.

శివుడు న‌ట‌రాజ రూపంలో వేసే నాట్య‌విన్యాసం..

శివుడు న‌ట‌రాజ రూపంలో వేసే నాట్య‌విన్యాసం..

శివుడు న‌ట‌రాజ రూపంలో వేసే నాట్య‌విన్యాసం పంచ‌భూతాల‌ను అబ్బుర‌ప‌రుస్తుంది. భూమి, ఆకాశం, నీరు, నిప్పు, గాలి అంతా ఆ మ‌హాదేవుడి వ‌శం. జై న‌మోః న‌మః

English summary

who-gave-birth-to-lord-shiva

Do you know who gave birth to Lord Shiva? Read to know the mythological story behind Lord Shiva’s birth.
Subscribe Newsletter