Latest Updates
-
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.!
ఈ భూమి మీద నిజమైన అదృష్టవంతులెవరో తెలుసా...?
ఈ భూమి మీద నిజమైన అదృష్టవంతులెవరో ఇప్పుడు తెలుసుకుందాం.
మనలో ప్రతి ఒక్కరి జీవితం వారి తలరాతను బట్టే ఉంటుంది. అందరి తలరాతలు ఒకేలా మాత్రం ఉండవు. ఒక్కొక్కరి తలరాత ఒక్కోలా ఉంటుంది. అయితే కొందరు పుట్టుకతోనే నిజమైన అదృష్టవంతులుగా పుడతారు..

మరికొందరు పెరిగి పెద్దయ్యాక అదృష్టాన్ని పొందుతారు. అయితే అదృష్టం అంటే కావాల్సినంత డబ్బు, నగలు, ఆభరణాలు, విలాసవంతమైన భవనాలు వంటివి కాదు.

ఎవరైతే మానసిక ప్రశాంతత మరియు సంతోషకరమైన జీవితం కలిగి ఉంటారో వారే ఈ భూమి మీద నిజమైన అదృష్టవంతులని చెబుతుంటారు పెద్దలు. అయితే పురాణాల ప్రకారం, ఇలాంటి లక్షణాలుండే వ్యక్తులను నిజంగా అదృష్టవంతులనే చెబుతారు. ఇంతకీ వారెవరో తెలుసుకోడానికి ఈ ఆర్టికల్ పూర్తిగా చూసేయ్యండి...

ఉదయాన్నే మేల్కొనేవారు..
ప్రతిరోజూ ఉదయాన్నే నిద్రలేచి వ్యాయామం చేసేవారు మరియు ఆరోగ్యంగా ఉండాలని భావించేవారు.. అనునిత్యం దైవారాధన చేసే వారిని ఈ భూమి మీద నిజమైన అదృష్టవంతులని చెబుతారు. అదృష్టం అంటే కేవలం సంపద, సౌకర్యాలు కాదు.. మంచి గుణాలు అలవడటం, ఎల్లప్పుడూ దొరికిన దాంతో సర్దుకుపోయే వారే నిజమైన అదృష్టవంతులు.

భాగవతం ప్రకారం..
‘ప్రాణకోటిలో చతుష్పాద జంతువుగా (మానవుల విషయంలో చేతులను సైతం పాదాలుగా చెప్పి, చతుష్పాద జంతువులుగా అనేక చోట్ల వర్ణించారు). పుట్టడమే ఓ భాగ్యం. అందులో బుద్ధి ఉండేవారిని, అందునా మాటల ద్వారా భావవ్యక్తీకరణ చేయలగడం మానవులకు మాత్రమే కలగడం గొప్ప భాగ్యం' అని వ్యాస భాగవతంలో పేర్కొనబడింది.

విధుర నీతి ప్రకారం..
విధుర నీతి ప్రకారం.. కేవలం డబ్బు, ఆస్తి, ఐశ్వర్యం, విలాసవంతమైన భవనాలు మాత్రమే ఉంటే.. వారు అదృష్టవంతులు కాదు.. వీటితో పాటు జీవితంలో మనశ్శాంతి మరియు సంతోషం వంటివి ఉన్నవారే ఈ భూమి మీద నిజమైన అదృష్టవంతులు.

విద్య ఉన్నవారు..
సరస్వతీ దేవి కటాక్షం ఉంటే.. మనం ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా.. ఎన్ని కష్టాలెన్ని ఎదురైనా బతికే అవకాశం దక్కుతుంది. అంతేకాదు.. సరస్వతీదేవి ఎక్కడుంటే.. అక్కడికి ఆటోమేటిక్ గా ధనలక్ష్మీ కూడా వస్తుంది కాబట్టి.. ఎలాంటి పరిస్థితుల్లో అయినా.. విద్యను నిర్లక్ష్యం చేయని వారు.. సమస్యలకు పరిష్కారం కనుగొనేవారు నిజమైన అదృష్టవంతులు.

తెలివైన భాగస్వామి..
ఈ లోకంలో ప్రతి ఒక్కరికీ పెళ్లి అనేది చాలా ముఖ్యమైన ఘట్టం. చాలా మంది పెళ్లికి ముందు ఏవేవో కలలు కంటారు. అయితే కొందరే వాటిని నిజం చేసుకుంటారు. అయితే ఎవరికైతే తెలివైన భాగస్వామి ఉంటారో.. వారే జీవితంలో నిజమైన అదృష్టవంతులు. ఎందుకంటే తెలివైన వ్యక్తిత్వం ఉండేవారు మన ఇంటిని చక్కనిదారిలో నడిపిస్తుంది.

అవసరం లేకున్నా ఆదాయం..
ఈ లోకంలో కొందరు ఎంత కష్టపడినా రూపాయి పుట్టదు. ఒకవేళ పైసలు వచ్చినా.. వాటిని నీళ్లలా ఖర్చు పెట్టేస్తుంటారు. అయితే మరికొందరికి మాత్రం ఎలాంటి కష్టం లేకుండానే ఆస్తి, ఆదాయం వంటివి పెరుగుతూ పోతుంటాయి. అలా జీవితాంతం ఆదాయం పొందే వాళ్లు నిజమైన అదృష్టవంతులు.

కుటుంబాన్ని ప్రేమించేవారు..
ఎవరైతే తమ కుటుంబాన్ని మరియు స్నేహితులను నిరంతరం ఇష్టపడతారో.. అనునిత్యం వారి గురించే ఆలోచిస్తూ.. వారి బాగోగులను కోరుకుంటారో.. అలాంటి నిజమైన అదృష్టవంతులని చెప్పొచ్చు. ఎందుకంటే వారు ప్రతి చోటా గౌరవం పొందుతారు.

ఓపిక ఉన్నవారు..
మనలో చాలా మంది ఓపిక అనేది చాలా సందర్భాల్లో తక్కువగా ఉంటుంది. ఇప్పటితరం వారికైతే అస్సలు ఓపిక అనేదే ఉండట్లేదు. ప్రతిదీ క్షణాల్లో కావాలని కోరుతున్నారు. అయితే ఇలాంటి టెక్నాలజీ మరియు డిజిటల్ యుగంలో కూడా ఎవరైతే ఓపికగా ఉంటారో.. అలాంటి వారిని నిజమైన అదృష్టవంతులుగా పరిగణిస్తారు.



Click it and Unblock the Notifications
