For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చెల్లెలి వరుసయ్యే ద్రౌపదినే అనుభవించాలనుకున్నాడు, అర్జునుడికి పుత్రశోకం మిగిలిస్తాడు, వాడే సైంధవుడు

|

కౌరవులు ఎంతమంది అందరూ వందమంది అని చెబుతారు. దృతరాష్ట్రుని పిల్లలందరూ కౌరవులే అనుకుంటే కనుక 102 మంది కౌరవుల లెక్క తేలుతుంది. ఎందుకంటే దృతరాష్ట్రునికీ, సుఖద అనే చెలికత్తెకీ యుయుత్సుడు అనే కుమారుడు జన్మిస్తాడు. ఇక కౌరవులకు దుస్సల అనే చెల్లెలు కూడా ఉంది. ఈ ఇద్దరితో కలుపుకొని కౌరవులు 102 మంది.

దుస్సల అలా పుడుతుంది

దుస్సల అలా పుడుతుంది

వ్యాసుని అనుగ్రహం వల్ల గాంధారి గర్భాన్ని ధరించింది. అయితే కాలం గడుస్తున్నా తనకి సంతానం కలగకపోగా, తన తోటికోడలు కుంతికి ధర్మరాజు జన్మించాడు. దీంతో అసూయతో రగిలిపోయిన గాంధారి తన కడుపులో ఉన్న పిండాన్ని తన చేతులతోనే నాశనం చేసుకునేందుకు ప్రయత్నిస్తుంది. అదే సమయానికి అక్కడికి చేరుకున్న వ్యాసుడు, తన వరం వృథాపోదనీ, ఆ మాంసపు ముద్దలని నూరు కుండలలో ఉంచమనీ... వాటి నుంచి నూరుగురు కుమారులు ఉద్భవిస్తారనీ పేర్కొంటాడు.

ఒక్క ఆడపిల్ల కూడా ఉంటే బాగుండు

ఒక్క ఆడపిల్ల కూడా ఉంటే బాగుండు

అయితే తనకి అందరూ మగపిల్లలే కాకుండా ఒక్క ఆడపిల్ల కూడా ఉంటే బాగుండు అనుకుంటుంది గాంధారి. ఆమె కోరికను వ్యాసుడు మన్నించడంతో 101 కుండలలో ఆమె గర్భస్థ శిశువుని భద్రపరుస్తారు. అలా జన్మించిన 101వ శిశువే దుస్సల. దుస్సల బాల్యం గురించి మహాభారతంలో ప్రస్తావన చాలా తక్కువగా కనిపిస్తుంది. అయితే నూరుగురు సోదరులకు తోడు ఐదుగురు పాండవులు కూడా కలిసి పెరగడంతో బహుశా ఆమె వారందరి సోదర ప్రేమను పొంది ఉంటుందనడంలో సందేహం లేదు.

జయద్రధునితో వివాహం

జయద్రధునితో వివాహం

దుస్సలకి యుక్తవయసు రాగానే సింధు రాజ్యాధిపతి అయిన జయద్రధునితో వివాహం జరుగుతుంది. ఇతను ఎవరో కాదు... మనం తరచూ వినే ‘సైంధవుడే'. సింధు రాజ్యాధిపతి కాబట్టి జయద్రధునికి ఆ పేరు వచ్చింది. సైంధవుడు మహా క్రూరుడు. పైగా స్త్రీలోలుడు. కోటికాస్యుడు అనే స్నేహితుడితో కలిసి సైంధవుడు అరణ్యం గుండా వెడుతున్నాడు. ద్రౌపదీ దేవి ఆశ్రమంలో పూలు కోసుకుంటున్నది. ఆమె మహా సౌందర్యవతి. సైంధవుడికి ఆమె చెల్లెలవుతుంది. ఆ సమయంలో పాండవులు ఆశ్రమంలో లేరు. వేటకు వెళ్లారు. పాండవులు లేరు కనుక, ఒక్కతే ఉంది కనుక కబురు చేసాడు.

దుర్మార్గపు బుద్ధితో వచ్చిన సైంధవుడు

దుర్మార్గపు బుద్ధితో వచ్చిన సైంధవుడు

అన్నగారే కనుక రమ్మనమంది. ఆ మర్యాదతోనే ఆయనకు మంచినీళ్లు ఇచ్చి పళ్లు తెచ్చిపెట్టింది. దుర్మార్గపు బుద్ధితో వచ్చిన సైంధవుడు.. నేను నిన్ను నా భార్యను చేసుకుందామనుకుంటున్నాను అన్నాడు. ఆవిడ ఆశ్చర్యపోయి.. అన్నా ! నీ నోటివెంట ఈ మాట రావచ్చా? అన్న చెల్లెలితో ఇలా మాట్లాడవచ్చా? చాలా తప్పుగా మాట్లాడుతున్నావు అన్నా అంది. అంతే.. ఆమెను అపహరించి రథంలో చాలా వేగంగా తీసుకుపోయాడు.

భార్యను ఎత్తుకుపోతే కోపం ఎవరికి రాదు

భార్యను ఎత్తుకుపోతే కోపం ఎవరికి రాదు

కొద్దిసేపటి తర్వాత పాండవులు వచ్చి విషయం తెలుసుకున్నారు. ఇక్కడ

సైంధవుడు తప్పు చేశాడు.. ధర్మరాజుకు కూడా కోపం వచ్చింది. భార్యను ఎత్తుకుపోతే కోపం ఎవరికి రాదు మరి కోపం. కానీ భీముడు కోపంతో సైంధవుణ్ణి చంపేస్తాడేమోనని... ‘‘ భీమా.. కోపంతో చంపేస్తావేమో.. ఒక్కటి గుర్తుపెట్టుకో. మన చెల్లెలు పసుపు కుంకుమలు పోతాయి. చెల్లెలు ఇంటికొచ్చి- అన్నయ్యా, నా పసుపు కుంకుమలు తుడిచేశావా? అంటే ఏం చెప్తాం. కోపాన్ని నిగ్రహించుకో'' అని ధర్మరాజు భీముడితో అంటాడు.

చెల్లెలి ముఖం చూసి వదిలేస్తున్నా

చెల్లెలి ముఖం చూసి వదిలేస్తున్నా

అయినా భీముడి కోపం చల్లారలేదు. అందుకే అర్జునుడిని తోడిచ్చి పంపాడు. వెంటనే పరమ వేగంతో వెళ్లి సైంధవుణ్ణి బంధించి పట్టుకొచ్చారు. పాండవుల శక్తి అటువంటిది. సైంధవుణ్ణి బంధించి తీసుకొచ్చి ధర్మరాజు కాళ్లముందు పడేశారు. "నీచమైన గుణానికి లోనయ్యావు. బావవి కనుక చెల్లెలి ముఖం చూసి వదిలేస్తున్నా. లేకపోతే చంపేసుండేవాళ్లు నా తమ్ముళ్లు. బుద్ధి మార్చుకుని బతుకుపో" అన్నాడు ధర్మరాజు.

చితక్కొట్టి, గుండు గొరిగించి వదిలిపెడతారు

చితక్కొట్టి, గుండు గొరిగించి వదిలిపెడతారు

సైంధవుడిని చావచితక్కొట్టి, గుండు గొరిగించి వదిలిపెడతారు పాండవులు. అలా దుస్సల కారణంగా సైంధవుని ప్రాణం నిలుస్తుంది. తర్వాత సైంధవుడు పరమశివుడి గురించి తపస్సు చేశాడు. శంకరుడు ప్రత్యక్షమై ఏం కావాలన్నాడు. ప్రాణభిక్ష పెట్టిన పాండవుల మీద కక్షపెట్టుకుని వారిని చంపగల శక్తి ఇవ్వమని అడిగాడు. ‘‘వారు ధర్మ రక్షకులు. అలా కుదరదు. అయితే ఒక వరం ఇస్తాను. నా పాశుపతాస్త్రం ఉంది కనుక అర్జునుణ్ణి నీవెలాగూ ఓడించలేవు. అర్జునుడు లేని సమయంలో మిగిలిన నలుగురినీ ఒక్కరోజు మాత్రం వారెంత బలగంతో వచ్చినా నీవు ఓడించగలవు'' అన్నాడు.

అభిమన్యుడు పద్మవ్యూహంలోకి వెళ్లగానే

అభిమన్యుడు పద్మవ్యూహంలోకి వెళ్లగానే

దానిని అవకాశంగా తీసుకున్న సైంధవుడు అర్జునుడి కొడుకు అభిమన్యుడు పద్మవ్యూహంలోకి వెళ్లగానే ధర్మరాజు, భీముడు, నకుడు, సహదేవులను లోనికి వెళ్లకుండా అడ్డుకుని పాండవుల మీద పగతో చంపేస్తాడు. అర్జునుడు ఊరుకుంటాడా, ఆ మర్నాడు సాయంత్రానికల్లా సైంధవుడి తల నరికేశాడు.

అశ్వమేధయాగాన్ని తలపెడతాడు

అశ్వమేధయాగాన్ని తలపెడతాడు

కురుక్షేత్ర సంగ్రామం తరువాత ధర్మరాజు హస్తినాపురానికి రాజుగా నియమితుడవుతాడు. అదే సమయంలో జయద్రధుని (సైంధవుడు) వారసునిగా, అతని కుమారుడైన సురధుడు సింధు రాజ్యపు సింహాసనాన్ని చేజిక్కించుకుంటాడు. హస్తినాపుర సింహాసనం మీద ఉన్న ధర్మరాజు ఒకనాడు అశ్వమేధయాగాన్ని తలపెడతాడు. ఇందులో భాగంగా యాగాశ్వం సింధురాజ్యం వైపు పరుగులు తీస్తుంది. ఆ అశ్వాన్ని కాపాడేందుకు దాని వెనుకనే అర్జునుడూ బయలుదేరాడు.

గుండె ఆగి చనిపోతాడు

గుండె ఆగి చనిపోతాడు

యాగాశ్వం తమ రాజ్యం వైపుగానే వస్తోందని తెలిసిన సురదుడు, అర్జునుడి చేతిలో చావు తప్పదన్న భయంతోనే గుండె ఆగి చనిపోతాడు. సురధుని కుమారుడు మాత్రం అర్జునుని ఎదుర్కొనేందుకు సిద్ధపడతాడు. కానీ మహామహావాళ్లే అర్జునుని ముందు నిలవలేకపోయినప్పుడు, అతను ఎంతసేపని తన పోరుని సాగించగలడు. అందుకే ‘తమ మధ్య ఉన్న వైరాన్ని మర్చిపోయి, తన మనవడిని కాపాడమంటూ' దుస్సల అర్జునుని కోరుకోవడంతో అతడిని సింధు రాజ్యానికి అధిపతిగా నియమించి వెనుదిరుగుతాడు అర్జునుడు.

అపకీర్తిని మూటగట్టుకున్నాడు

అపకీర్తిని మూటగట్టుకున్నాడు

అలా దుస్సల విచక్షణతో కౌరవ, పాండవుల మధ్య దీర్ఘకాలంగా ఉన్న వైరం నిలిచిపోతుంది. ఈ కథ ద్వాపరయుగం నాటిది. అయితే ఇప్పటికీ ఇప్పటికీ ఒక మంచి పనికి ఎవరడ్డువచ్చినా ‘సైంధవుడిలా అడ్డుపడ్డాడు' అని అంటూంటాం. అటువంటి అపకీర్తిని శాశ్వతంగా మూటగట్టుకున్నాడు సైంధవుడు.

English summary

why arjuna killed jayadratha

why arjuna killed jayadratha
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more