TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
యుద్ధనీతి విడిచి భీముడు దుర్యోధనుడి తొడలపై ఎందుకు కొట్టి చంపాడు, బలరాముడు భీమున్ని చంపాలనుకున్నాడు
మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం తర్వాత చాలా సంఘటనలు జరిగాయి. యుద్ధం పూర్తయ్యాక ఆ రణరంగం నిండా సైనికుల శవాలు, మృతి చెందిన వేలాది ఏనుగులు, గుర్రాలు గుట్టలుగుట్టలుగా పడ్డాయి. ఇక కౌరవ సైన్యంలో ఒక్కరు కూడా మిగలకుండా అందరూ తుడిచిపెట్టుకు పోయారు.
కానీ దుర్యోధనుడు మాత్రం ప్రాణాలతోనే ఉన్నాడు. కౌరవసేన అలా నేలకొరగడంతో రగిలిపోయాడు. గుర్రం మీద ద్వైపాయన సరస్సు వైపుకు బయలుదేరి వెళ్లాడు. దుర్యోధనుడు నీటిలో మునిగి లేచాడు. అంతలో భీముడు వచ్చాడు.
కోపంతో రగిపోతాడు
దుర్యోధనుడు భీముడిని చూడగానే కోపంతో రగిలిపోయాడు. వారిద్దరి మధ్య యుద్ధం మొదలయ్యింది. దుర్యోధనుడు భీముడు బీకరంగా తలపడుతున్నారు. దుర్యోధనుడిని ఎక్కడ కొడితే చనిపోతాడో శ్రీకృష్ణుడికి తెలుస. ఆ విషయాన్ని కృష్ణుడు భీముడికి ఒక సంకేతం ద్వారా తెలుపుతాడు.
తొడలపై కొడితే
తొడలపై కొట్టు చస్తాడు అన్నట్లుగా సైగ చేస్తాడు. వెంటనే భీముడు
దుర్యోధనుడి తొడల మీద గట్టిగా కొట్టాడు. దుర్యోధనుడి తొడలు విరిగి నేల మీద పడిపోయాడు. కానీ యుద్దనీతినిబంధనలకు ఇది విరుద్ధం. దీంతో అక్కడే ఉన్న బలరాముడు కోపంతో భీమున్ని చంపడానికి వెళ్తాడు.
యుద్దనీతి
భీమ, దుర్యోధనుల గదాయుద్ధంలో భీముడు యుద్దనీతి పాటించలేదంటాడు బలరాముడు. ఇది అన్యాయం అంటాడు. దుర్యోధనుడిని అంత నీచంగా చంపిన భీముడిని చంపేస్తానంటూ బలరాముడు నాగలి, రోకలితో భీముని మీదకు వెళ్తాడు.
తప్పులేదు
కానీ కృష్ణుడు అడ్డుకుంటాడు. భీముడు చేసిన దాంట్లో ఎలాంటి తప్పు లేదంటాడు. భీముడి ప్రతిజ్ఞ చేసిన ప్రకారం చంపాడంటాడు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం సుక్షత్రియుడి లక్షణం అని క్రిష్ణుడు చెబుతాడు.
శాపం ఉంది
ఇక దుర్యోధనుడికి తొడలు విరిగిపోయే శాపం ఒకటి ఉందని గుర్తు చేస్తాడు. మైత్రేయి అనే మహర్షి శాపం వల్లే దుర్యోధనుడు ఇలా తొడలు కోల్పొయాడంటాడు. అందువల్లే ఇలా జరిగిందని కృష్ణుడు చెప్పడంతో బలరాముడు శాంతంగా మారుతాడు.