For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హిందువులు క్షౌరము (గుండు) ఎందుకు చేయించుకుంటారు?

|

హిందూ మతంలో అనేక ఆచారాలు ఉన్నాయి. ఉపనయనం,వివాహం మొదలైన సమయాల్లో తల క్షౌరము (గుండు)చేయించుకుంటారు. హిందూ మతంలో పుట్టిన సమయం నుండి అనేక ఆచారాలను అనుసరిస్తారు. హిందు మతంలో ఈ ఆచారవ్యవహారాలు అధిక బాగం ఆక్రమించి ఉన్నాయి. ప్రజలు పుట్టిన చక్రం నుండి మోక్షం లేదా స్వేచ్ఛ సాధించడానికి గొప్ప భక్తితో వీటిని అనుసరిస్తారు.

తల క్షౌరము (గుండు) చేయించుకోవటం అనేది హిందువులు అనుసరించే అత్యంత ముఖ్యమైన ఆచారాలలో ఒకటి. తిరుపతి,వారణాసి వంటి పవిత్ర ప్రదేశాలలో తల క్షవరం చేయించుకోవటం మరియు దేవునికి జుట్టు అందించటం తప్పనిసరి పద్ధతి. దేవునికి జుట్టు ఇవ్వటం గర్వకారణంగా భావిస్తారు. ఈ విధంగా చేయుట వలన తమ అహంకారం పోతుందని నమ్మకం. అంతేకాక ప్రజలు వారి కోరికలు తిరినప్పుడు,వారు దేవునికి చేసిన వాగ్దానం మేరకు జుట్టును మొక్కుగా చెల్లిస్తారు.

కాబట్టి, హిందువులు తల క్షవరం లేదా గుండు చేయించుకోవటానికి గల కారణాలను తెలుసుకోవటానికి ఈ క్రింది వ్యాసాన్ని చదవండి.

 Hindus Shave Off Their Head?

పుట్టిన చక్రం
హిందువులు పుట్టుక మరియు పునర్జన్మ భావనలను నమ్ముతారు. ఇది పిల్లల యొక్క శిరో మొండన వేడుకలో,మొదటిసారి తలకు గుండు చేయిస్తే గత జన్మ బంధాల నుండి అతడు/ఆమెను విడిపించవచ్చని నమ్ముతారు. తలకు గుండు చేయిస్తే అతడు/ఆమెకు కొత్త జీవితం ప్రారంభమైందని గుర్తు.అందువల్ల, ఈ మార్గం ఒక ముఖ్యమైన ఆచారంగా ఉంది.

మొత్తం సమర్పణ
జుట్టును గర్వం మరియు అహంకారం యొక్క గుర్తుగా భావిస్తారు. అందువలన జుట్టు మొత్తంను దేవునికి సమర్పిస్తారు. మేము మా అహంకారం వదిలించుకోవటం కొరకు దేవుని దగ్గరకు వెళ్ళతాము. ఇది ఒక నమ్రత చర్యగా ఉంటుంది. అంతేకాక ఒక చిన్న అడుగు అనేది మనస్సులో ఎటువంటి అహంకారం లేదా ప్రతికూల ఆలోచనలు లేకుండా దేవుని ఆలోచనలు ఉండేలా చేస్తుంది.

మన్నత్
ప్రజలు కూడా మన్నత్ లో భాగంగా వారి తల క్షవరం చేస్తారు. ఒక చిన్న కోరిక సఫలీకృతం అయినప్పుడు దేవుని చేసిన వాగ్దానం మేరకు జుట్టును సమర్పిస్తారు. ఒక వ్యక్తి యొక్క నిర్దిష్ట కోరిక నెరవేర్చినప్పుడు, అతడు/ఆమె దేవుని వైపు కృతజ్ఞతా చిహ్నంగా దేవుడుకి జుట్టును సమర్పిస్తారు. ఈ పద్ధతి తిరుపతి, వారణాసి దేవాలయాల్లో ప్రబలంగా ఉంది.

అందువలన,తల క్షౌరము అనేది హిందూమతంలో ముఖ్యమైన సంప్రదాయం.ఇది వినయం మరియు దేవునికి మొత్తం లొంగిపోయిన భావనలో ఒక చర్య.

Story first published: Friday, October 10, 2014, 18:20 [IST]
Desktop Bottom Promotion