For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మంత్రాలన్నీ “ఓం” తోనే ప్రారంభం అవుతాయి ఎందుకో తెలుసా? విశ్వం ఆవిర్భవించినప్పుడు ఆ శబ్దమే!

మూడు రకాల శక్తులను క్రమబద్దీకరిస్తూ, మానసిక ఒత్తిడిని తగ్గించి ఉపశమనం అందిస్తూ ఏకాగ్రతను మెరుగుపరచడంలో అత్యంత ప్రభావాన్ని కలిగి ఉంటుందని చెప్పబడింది. క్రమంగా మంత్రాల ప్రయోజనాలను పూర్తి స్థాయిలో పొందేం

|

అనేక మంది హిందువులు దేవుని పూజించే సమయంలో, తమ మంత్రోచ్చారణ ప్రారంభాన్ని"ఓం" తోనూ మరియు "స్వాహా" తో ముగింపుని ఇవ్వడాన్ని మనం తరచుగా గమనిస్తూనే ఉంటాము. దీనికి గల ప్రధాన కారణమేమిటో మీకు తెలుసా ?

పురాతన హిందూ ఋషుల ప్రామాణికాల ప్రకారం, "ఓం" ప్రధానంగా మూడు శబ్దాలను కలిగి ఉంటుంది. అవి వరుసగా అ, ఉ, మ గా ఉన్నాయి. హిందూ మతం నమ్మకాల ప్రకారం ఈ మూడు అక్షరాలూ, త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను సూచిస్తాయని తెలుపబడింది.

ధర్మ శాస్త్రాల ప్రకారం :

ధర్మ శాస్త్రాల ప్రకారం :

ధర్మ శాస్త్రాల ప్రకారం, విశ్వం మూడు రకాల ప్రాథమిక శక్తులను కలిగి ఉంటుంది. అవి వరుసగా, సత్వ, రజో మరియు తమో గుణాలు. ఇక్కడ సత్వ గుణం, భగవంతుని లేదా మంచి లక్షణాలను ప్రతిబింబిస్తుంది. రజో గుణం మనిషి లేదా రాజు యొక్క సహజ లక్షణాలకు నిదర్శనం. ఇక తమో గుణం చెడు లేదా రాక్షస లక్షణాలకు సంబంధించినది. ప్రతి ఒక్క మూలకం కూడా, వివిధ నిష్పత్తులలో ఈ మూడు గుణాలను కలిగి ఉంటుందని చెప్పబడింది.

“ఓం” అనే పదం

“ఓం” అనే పదం

ఈ శక్తుల లేదా గుణాల నిష్పత్తిని మార్చగలిగినా, సమ్మేళనం మాత్రం అలాగే మిగిలిపోతుంది. ఈ మూడు గుణాల కలయిక ద్రవ్యరాశిగా మారుతుంది. "ఓం" అనే పదం ఈ మూడు గుణాల కలయికగా ఉంటుంది. అందుకే, అంత ప్రాధాన్యతను సంతరించుకుందని చెప్పబడింది.

ఒక పవిత్రమైన ప్రారంభం :

ఒక పవిత్రమైన ప్రారంభం :

హిందూ గ్రంథాల ప్రకారం, ఓం అనే పదం శివుడిని మరియు వినాయకుడిని కూడా సూచిస్తుంది. అందుకే వినాయకుడిని కొన్ని సందర్భాలలో "ఓం" రూపంలో చిత్రీకరించి పూజించడం మనం గమనిస్తూనే ఉంటాం. ఎటువంటి దైవ కార్యాన్ని మొదలుపెట్టాలన్నా, హిందూ ఆచారాల ప్రకారం, మొట్టమొదటగా వినాయకుని పూజించడం పరిపాటిగా ఉంటుంది.

మంత్రోచ్చారణ

మంత్రోచ్చారణ

అందుకే వినాయకుని, ఆది గణపతి అని కూడా పిలవడం జరుగుతుంది. క్రమంగా మంత్రోచ్చారణ ప్రారంభం నందు ఓం అనే పదాన్ని ఉచ్చరించడం ద్వారా వినాయకుని స్మరించినట్లుగా కూడా చెప్పబడుతుంది.

Most Read :రోజూ బెల్లం ముక్క తింటే ఆ ఇబ్బందులేమీ ఉండవు, బెల్లం ఉపయోగాలు ఇవే, ఆ సమయంలో నొప్పి తగ్గించలగలదుMost Read :రోజూ బెల్లం ముక్క తింటే ఆ ఇబ్బందులేమీ ఉండవు, బెల్లం ఉపయోగాలు ఇవే, ఆ సమయంలో నొప్పి తగ్గించలగలదు

మొట్టమొదటి శబ్దం :

మొట్టమొదటి శబ్దం :

విశ్వం ఆవిర్భావం జరిగినప్పుడు, ఓం అనే ధ్వని వినిపించిందన్నది పురాతన కాలం నుండి వస్తున్న ప్రధాన నమ్మకం. విశ్వం ముగింపునకు వచ్చినప్పుడు కూడా అదే ధ్వని వినిపిస్తుందని చెప్పబడింది. క్రమంగా ప్రాధమిక ధ్వనిగా గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉన్న కారణంగా, ఆ శబ్దంతోనే మంత్రోచ్చారణ ప్రారంభించడం కూడా ఆనవాయితీగా వస్తున్నది.

ఏకాగ్రత మెరుగుపరుస్తుంది

ఏకాగ్రత మెరుగుపరుస్తుంది

మూడు రకాల శక్తులను క్రమబద్దీకరిస్తూ, మానసిక ఒత్తిడిని తగ్గించి ఉపశమనం అందిస్తూ ఏకాగ్రతను మెరుగుపరచడంలో అత్యంత ప్రభావాన్ని కలిగి ఉంటుందని చెప్పబడింది. క్రమంగా మంత్రాల ప్రయోజనాలను పూర్తి స్థాయిలో పొందేందుకు, ఏకాగ్రత కీలకపాత్రను పోషిస్తుంది.

రాజ యోగ, హాత్ యోగా

రాజ యోగ, హాత్ యోగా

అందుచేతనే, రాజ యోగ, హాత్ యోగా వ్యాయామాలను అనుసరించే సమయంలో తరచుగా ఈమంత్రం జపించడం జరుగుతుంది. ఓంకారోచ్చరణ మానసికంగానే కాకుండా, శ్వాసకోశ, ఉదర సంబంధిత ఆరోగ్యాల ప్రకారం శారీరికంగా కూడా ఎన్నో ప్రయోజనాలను కలిగి ఉంటుందని చెప్పబడింది.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, ఆరోగ్య, జీవనశైలి, ఆహార, వ్యాయామ, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

Why Do Most Hindu Mantras Begin With Aum?

Why Do Most Hindu Mantras Begin With Aum
Desktop Bottom Promotion